స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వాళ్లకు డునాట్ డిస్టర్బ్, సైలెంట్, ఎయిరోప్లేన్ మోడ్ ఈ మూడు ఆప్షన్ల గురించి తెలిసే ఉంటుంది. అయితే ఈ మూడింటిలో ఎక్కువగా ఉపయోగించేది సైలెంట్ ఆప్షన్‌ను మాత్రమే. అయితే డునాట్ డిస్టర్బ్, ఎయిరో ప్లేన్ మోడ్ కూడా దాదాపుగా సైలెంట్ మాదిరిగానే పపి చేస్తాయి. ఈ రెండు ఫీచర్ల ఉద్దేశం కూడా మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూడటమే. మరి ఈ మూడింటి మధ్య ఏంటి ప్రధాన ప్రత్యేకతలు... ఏఏ సమయాల్లో ఈ మూడు ఉపయోగించాలి..!
సాధారణంగా సైలెంట్ మోడ్‌ను మాత్రమే మనం ఎక్కువగా వాడుతుంటాం. దీనికి కారణం ఇది బేసిక్ మోడ్. మనకు అందుబాటులో ఉండే ఎక్కువగా అవసరమయ్యే ఫీచర్ కూడా. దీని వాడడం వల్ల మనకు నోటిఫికేషన్ సౌండ్లు రావు.. కాల్స్, మెసేజ్‌లు, యాప్స్ యాక్టివిటీ మనకు తెలియదు. మనం నిశ్మబ్దాన్ని కోరుకున్నప్పుడు.. నిద్రపోతున్నప్పుడో లేదా ఏదైనా ముఖ్యమైన మీటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తాం. డునాట్ డిస్టర్ట్ మోడ్ అంటే సైలెంట్‌కు భిన్నం. మనల్ని అస్తమానం విసిగించే కాల్స్‌ను లేదా మెసేజ్‌లను ఆపడమే ఈ ఫీచర్ యొక్క ప్రత్యేకతలు. ఇది యాక్టివేట్ కావాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీకు ఫలానా నంబర్ నుంచి కాల్స్ రాకుండా డునాట్ డిస్టర్బ్ పెట్టుకోవచ్చు. లేదా యాప్స్ నోటిఫికేషన్లను ఆపేసుకోవచ్చు.
చివరిది ఎయిరో ప్లేన్ మోడ్..సాధారణంగా మనం విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాత్రమే ఈ మోడ్‌ను ఉపయోగిస్తాం. ఇది మోడ్ యాక్టివేట్ చేస్తేమీ నెట్‌వర్క్ కనెక్టివిటీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అయితే ఇలా బ్లాక్ అయిపోయినా ఫోన్లో ఇతర ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. ఫొటోలను చెక్ చేసుకోవచ్చు, ఫొటోలు తీసుకోవచ్చు. గేమ్స్ ఆడొచ్చు. మ్యూజిక్ వినొచ్చు. అయితే కాల్స్ చేయడం తప్ప ఏదైనా చేసే అవకాశం ఈ మోడ్ ద్వారా ఉంటుంది. మన అవసరాలను బట్టి.. మన పరిస్థితులను బట్టి సైలెంట్, డునాట్ డిస్టర్బ్, ఎయిరో ప్లేన్ మోడ్ ఆప్లన్లు తెలివిగా ఉపయోగించుకోవాలి. వైబ్రేషన్, లాక్ స్క్రీన్ లైట్ లాంటివి ఉపయోగించడం ద్వారా ఈ మోడ్‌లో పెట్టినా కూడా మనం కాల్స్, మెసేజ్‌లు మిస్ కాకుండా చేసుకోవచ్చు.