ఫ్రెండ్స్, కొలీగ్స్, క్లాస్‌మేట్స్ .. ఏదైనా ఒకటే విషయం ఎక్కువ మందికి ఫోన్ చేసి చెప్పాలనుకున్నా, ఒక టాపిక్ మీద అందరూ డిస్కస్ చేసుకోవాలన్నా, ఆఫీస్‌లో బాస్ సబార్డినేట్స్ అందరికీ ఒకేసారి ఫోన్ చేసి విషయం చెప్పాలన్నా ఏం చేస్తారు? ఏముంది కాన్ఫరెన్స్ కాల్ చేస్తారు. ఒకేసారి ఎక్కువ మందికి కాల్ మాట్లాడే అవకాశం ఉండడంతో టెక్నాలజీలో ఎన్ని మార్పులొచ్చినా కూడా కాన్ఫరెన్స్ కాల్స్ తమ ప్రాధాన్యతను నిలబెట్టుకుంటున్నాయి. ఇలాంటి కాన్ఫరెన్స్ కాల్స్‌ను మీరు కూడా ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్‌తో చేసుకుని మాట్లాడుకోవడానికి చాలా మార్గాలున్నాయి. వాటికి సంబంధించిన అతి సులువైన గైడ్ మీకోసం..
గూగుల్ హ్యాంగవుట్స్ (Google Hangouts)
టెక్ జెయింట్ గూగుల్ మీ కాన్ఫరెన్స్ కాల్స్ కోసం తెచ్చిన పర్‌ఫెక్ట్ ప్రోగ్రామ్ .. గూగుల్ హ్యాంగవుట్స్. జీమెయిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అయి మీ హ్యాంగవుట్స్ అకౌంట్‌ను సెట్ చేసుకోవాలి. ఇది ఫ్రీ టూల్. ఒకేసారి 25 మందితో ఆడియో లేదా వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఒకేసారి 150 మందికి టెక్స్ట్ మెసేజ్‌లు పంపించవచ్చు. * మీ ఫోన్, ట్యాబ్, ల్యాపీ డివైస్ ఏదైనా మైక్రోఫోన్, కెమెరా ఉంటే చాలు హ్యాంగవుట్స్‌తో నిశ్చింతగా కాన్ఫరెన్స్ కాల్స్‌చేసుకోవచ్చు.అయితే మీ కాల్ రిసీవ్ చేసుకోబోయే వ్యక్తికి కూడా జీమెయిల్ అకౌంట్ ఉండాలి. మొబైల్‌కే కాదు ల్యాండ్ లైన్‌కు కూడా ఫ్రీగా కాల్ చేసుకోగలగడం హ్యాంగవుట్స్ ప్లస్ పాయింట్.
స్కైప్ Skype
గత మూడు నాలుగేళ్లుగా బాగా పాపులరయిన కాలింగ్ సొల్యూషన్ స్కైప్. సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్, టెక్నాలజీతో నిత్యం టచ్‌లో ఉండే విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌కి కాన్ఫరెన్స్ కాలింగ్‌కు ఇప్పుడు స్కైపే ఎక్కువగా వాడుతున్నారు. 2001లో మైక్రోసాఫ్ట్ స్కైప్‌ను కొని ఇంటర్‌ఫేస్, ఫీచర్స్ అన్నీడెవలప్ చేసింది. స్కైప్ కూడా ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లను ఫ్రీగా ఆఫర్ చేస్తుంది. దీని ద్వారా మీరు 25 మందితో ఒకేసారి గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుకోవచ్చు. అయితే వాళ్లందరూ కూడా స్కైప్‌లో ఉండాలి. ఒకవేళ వాళ్లకు స్కైప్ లేకపోతే మీరు స్కైప్ క్రెడిట్ ఉపయోగించి వాళ్లందరితో కాన్ఫరెన్స్ మాట్లాడుకోవచ్చు.
ఉబెర్ కాన్ఫరెన్స్ UberConference
క్యాబ్, ఫుడ్ డెలివరీ సర్వీసులతో మనకు పరిచయమైన ఉబెర్ కూడా కాన్ఫరెన్స్ సొల్యూషన్ తెచ్చింది. అదే ఉబెర్ కాన్ఫరెన్స్. దీని ద్వారా ఒకేసారి పది మందితో ఫోన్ , వీఓఐపీ ( వాయిస్ ఓవర్ ఆన్ ఐపీ అడ్రస్) కాల్స్ మాట్లాడుకోవచ్చు. స్క్రీన్, డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. బిజినెస్ పర్సన్స్‌కోసం నెలకు 10 డాలర్ల సబ్‌స్క్రిప్షన్ ఉంది. దీంతో ఒకేసారి 100మందితో మాట్లాడుకోవచ్చు. ఉబెర్ కాన్ఫరెన్స్‌కు ఆండ్రాయిడ్, ఐవోఎస్, డెస్క్‌టాప్ యాప్స్ ఉన్నాయి. అయితే వీడియో కాన్ఫరెన్సింగ్ లేకపోవడం దీనిలో పెద్ద మైనస్.
ఫ్రీ కాన్ఫరెన్స్ కాలింగ్ (FreeConferenceCalling)
పేరుకు తగ్గట్లే ఇది ఫ్రీ సర్వీస్. అయితే ఇందులో కూడా ఆడియో కాన్ఫరెన్స్ మాత్రమే ఉంది. వీడియో కాన్ఫరెన్స్, టెక్స్ట్ పంపించుకోవడానికి అవకాశం లేదు. అయితే ఆడియో కాన్ఫరెన్స్ ఒకటే చాలనుకుంటే మాత్రం ఇది చాలా పవర్‌పుల్‌గా పనిచేస్తుంది. ఒకేసారి ఏకంగా 1000 మందితో కాన్ఫరెన్స్ మాట్లాడుకోగలగడం దీని ప్రత్యేకత. ఫ్రీ కాన్ఫరెన్సింగ్ కాలింగ్ వెబ్‌పోర్టల్ ద్వారా మీ కాల్స్‌ను, యూజర్స్‌ను మేనేజ్ చేయొచ్చు, ఎంత మంది అటెండ్ అయ్యారో తెలుసుకోవచ్చు. కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు.
ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ (Free Conference Call)
పేరు ఒకేలా ఉన్నా పైదానికీ దీనికీ ఏ సంబంధం లేదు. దీనిలో చాలా అద్భుతమైన ఫీచర్లున్నాయి. ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ కాల్స్‌తోపాటు క్యాలెండర్ ఇంటిగ్రేషన్, మీటింగ్ రికార్డింగ్, వెబ్ కంట్రోల్ లాంటి ఫీచర్లు దీనికి ప్లస్‌పాయింట్స్. స్క్రీన్ షేరింగ్, రిమోట్ డెస్క్‌టాప్ సపోర్ట్, వెయ్యిమందితో ఒకేసారి కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు.
ఇవేకాక Join.Me, GoToMeeting లాంటి కాన్ఫరెన్స్ కాలింగ్ ఆప్షన్స్‌ను కూడా పరిశీలించవచ్చు.
ఆండ్రాయిడ్, ఐఫోన్స్‌లో..
ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌లో ఒకేసారి ముగ్గురు, నలుగురితో మాట్లాడుకోవాలనుకుంటే ఇవేమీ అవసరం లేదు. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో డయల్ ప్యాడ్ ఓపెన్‌చేసి కాల్‌చేయగానే Add Callఅని స్క్రీన్ మీద వస్తుంది. మీరు కాల్ నడుస్తుండగానే మరో వ్యక్తికి కాల్ చేసి, Merge Call కొడితే రెండో కాల్ కూడా వచ్చి కాన్ఫరెన్స్ అవుతుంది. ఇలా ఐఫోన్‌లో మీతోపాటు ఐదుగురిని, ఆండ్రాయిడ్‌లో అయితే ఆరుగురిని ఒకేసారి కాన్ఫరెన్స్‌లో పెట్టి మాట్లాడుకోవచ్చు.