• తాజా వార్తలు

పేటీఎం నుండి బ్యాంక్ అకౌంట్‌కు డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డానికి ఈజీయెస్ట్ గైడ్‌

డీమానిటైజేషన్ తర్వాత ఇండియాలో అత్యంత ఫేమ‌స్ అయిన పేరు ఏమిటంటే పేటీఎం అని ట‌క్కున చెప్పొచ్చు. ఛాయ్ బ‌డ్డీ నుంచి జ్యూయ‌ల‌రీ షాప్ వరకు అన్నిచోట్లా పేటీఎం యాక్సెప్టెడ్ హియ‌ర్ అనే బోర్డులు క‌నిపిస్తున్నాయి.  మొబీక్విక్‌, ఫోన్‌పే వంటి ఇత‌ర వాలెట్ల‌తో కంపేర్ చేస్తే యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ తేలిగ్గా ఉండ‌డంతో పెద్ద‌గా చ‌దువుకోని రోడ్ సైడ్ వెండ‌ర్లు కూడా దీన్ని వినియోగించుకుంటున్నారు.  పేటీఎం వాలెట్‌తో షాపింగే కాదు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో దాన్నుంచి అమౌంట్‌ను బ్యాంక్ అకౌంట్‌కు కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.  యూపీఐ ట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా ఏదైనా బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్‌కు పేటీఎం ఫ్లాట్‌ఫాం ద్వారా మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. దీనికి ఎలాంటి ఛార్జీ ఉండదు. అలా కాకుండా మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లో నుంచి క్యాష్‌ను పేటీఎంలో లోడ్ చేసుకుని దాన్ని మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఇది మీకు చేతిలో డబ్బులు లేవ‌న్న చింత తీర్చ‌డానికి ప‌నికొస్తుంది.  అయితే దీనికి 100కి నాలుగు రూపాయ‌ల ఛార్జి ప‌డుతుంది. 

పేటీఎం నుంచి బ్యాంక్ అకౌంట్‌కు మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డం
1. పేటీఎం వాలెట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి

2. ఇప్పుడు మీకు మెయిన్ పేజీలో టాప్‌లోనే పాస్‌బుక్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. 

3.  ట్రాన్స్‌ఫ‌ర్ బ్యాల‌న్స్ టూ బ్యాంక్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ నెంబ‌ర్‌, అకౌంట్ హోల్డ‌ర్ పేరు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌, అమౌంట్ యాడ్ చేయండి.

4. క‌న్ఫ‌ర్మేష‌న్ మెసేజ్ వ‌స్తుంది.   మీ వాలెట్‌కు బ్యాంక్ అకౌంట్ యాడ్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్‌ను బ‌ట్టి దీనికి ఒక రోజు నుంచి వారం రోజుల వ‌ర‌కు టైం ప‌ట్టొచ్చు. 

మనీ యాడ్ చేయ‌డం
1.  హోం పేజీలోకి వెళ్లి పాస్‌బుక్ ఆప్ష‌న్ క్లిక్ చేయండి.  యాడ్‌ మ‌నీ టూ పేటీఎం వాలెట్ అనే ఆప్ష‌న్ కనిపిస్తుంది. 

2. ఇక్క‌డ మీకు కావాల్సిన అమౌంట్‌ను  ఎంట‌ర్ చేసి కింద ఉన్న యాడ్ మ‌నీ  ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆప్ష‌న్స్ టూ పే  అనే హెడ్ కిద డెబిట్ కార్డ్‌, క్రెడిట్ కార్డ్‌, నెట్ బ్యాంకింగ్‌, బీమ్ యూపీఐ అనే నాలుగు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. మీరు దేనితో మ‌నీ యాడ్ చేయాల‌నుకుంటే దాన్ని క్లిక్ చేయండి. 

3. డిటైల్స్ ఎంట‌ర్ చేశాక సీవీవీ నెంబ‌ర్ టైప్ చేసి మ‌నీ యాడ్ చేయండి. ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేస్తే మీ వాలెట్‌లో మ‌నీ యాడ్ అవుతుంది. 

4.  ఈ మ‌నీని మీ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌డానికి వంద‌కు నాలుగు రూపాయ‌ల ఛార్జి వేస్తుంది. ఆ నాలుగు రూపాయ‌లను కూడా వాలెట్‌కు యాడ్ చేయాలి. (అంటే 100 రూపాయ‌లు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలంటే 104 రూపాయ‌లు యాడ్ చేయాలి)

5. పాస్‌బుక్‌లోకి వెళ్లి పేటీఎం వ్యాలెట్‌ను క్లిక్ చేసి సెండ్ మ‌నీ టూ బ్యాంక్ ఆప్ష‌న్ క్లిక్ చేయండి. మీరు వాలెట్ నుంచి మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే ఛార్జీలు ప‌డ‌తాయని పాప్ అప్ మేసేజ్ వ‌స్తుంది. దాని కింద ఐ అండ‌ర్ స్టాండ్ అని ఉన్న ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ ఎంట‌ర్ చేయాలి. ఆల్రెడీ మీరు అకౌంట్ యాడ్ చేసి ఉంటారు కాబ‌ట్టి అకౌంట్ నెంబ‌ర్ క్లిక్ చేయ‌గానే అది హైలైట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసి ట్రాన్స్‌ఫ‌ర్ చేసేయండి.
6. కొత్త నెంబ‌ర్ అయితే మ‌ళ్లీ డిటైల్స్ యాడ్ చేయండి.
 

జన రంజకమైన వార్తలు