కంప్యూటర్ మీట నొక్కగానే మనకు వెంటనే అవసరమయ్యేది గూగుల్. మనం కంప్యూటర్‌లో ఏది వెతకాలన్నా, ఎలాంటి సమాచారం అవసరమైన వెంటనే గూగుల్‌లో వెతుకుతాం. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే సెర్చ్ ఇంజన్‌గా, ఇంటర్నెట్ దిగ్గజంగా నిలిచిన గూగుల్ సంస్థ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మార్పులు కూడా చేసుకుంటూ ఉంటుంది. కొత్త కొత్త టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి యూజర్ల పని మరింత సులభం అయ్యేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చిందే గూగుల్ ఆటో కంప్లీట్. సాధారణంగా మనం ఏదైనా విషయం గురించి వెతకాలంటే గూగుల్‌లో టైప్ చేస్తాం అయితే మనం ఆ పదాన్ని పూర్తిగా టైప్ చేయకుండానే ఆటోమెటిగ్గా మన పదానికి దగ్గరగా ఉండే సెర్చ్ రిజల్ట్స్‌ను గూగుల్ అందిస్తుంది. దీని వల్ల మనం సమయం వృథా కాదు. వెంటనే మనకు అవసరమైన పదాన్ని సెలక్ట్ చేసుకునే అవకాశం దీని ద్వారా ఉంటుంది. ఇదే గూగుల్ ఆటో కంప్లీట్.
కీ వర్డ్ సజీషన్స్
గూగుల్ సెర్చ్‌బార్‌లో మనం టైప్ చేస్తుంటే మనకు ఎన్నో రకాల సజీషన్స్ వస్తాయి. ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చేవే. అంటే మనం ఎక్కువగా ఉపయోగించే కీవర్డ్స్‌ను బట్టి ఈ సజీషన్స్ ఉంటాయి. ఉదాహరణకు సచిన్ అని టైప్ చేస్తే.. సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్, సచిన్ ఆటోబయోగ్రఫీ, సచిన్ డాక్యుమెంటరీ, సచిన్ సినిమా, సచిన్ గ్రేట్ ఇన్సింగ్స్ లాంటి కీవర్డ్స్ మనకు సెర్చ్‌బార్‌లో కనిపిస్తాయి. ఇదే కీవర్డ్స్ సజీషన్. అంతేకాదు మనం ఏమైనా తప్పుగా టైప్ చేసినా కూడా సరైన పదాలను గూగుల్ మనకు అందిస్తుంది. అంటే యునైటెడ్‌సాటెస్ట్ అని మనం టైప్ చేస్తే మనం తప్పుగా స్పెల్లింగ్ టైప్ చేశామని భావించి యునైటెడ్ స్టేట్స్ అనే పదాన్ని కూడా గూగుల్ మనకు సజిస్ట్ చేస్తుంది. ఇలా సజిస్ట్ చేయడం కోసం గూగుల్ ఆటో కంప్లీట్ సజీషన్స్, భిన్నమైన అల్గరిథమ్స్‌ను ఉపయోగిస్తుంది.
అల్గరిథమ్‌కు అందకుండా..
ఒక్కోసారి మనం టైప్ చేసే వర్డ్స్ గూగుల్ సెర్చ్ ఇంజన్‌కు తెలియకపోవచ్చు. అంటే అవి పూర్తిగా కొత్తవి కావొచ్చు. గూగుల్ దాదాపు అన్ని రకాల పదాలతో అల్గరిథమ్స్‌ను సెట్ చేస్తుంది. అయినా కూడా కోట్లాది కొత్త పదాలు ఉంటాయి. అందుకే వీటన్నిటి సమాహారంగా కొన్ని కొత్త పదాలను సజిస్ట్ చేస్తుంది గూగుల్. అంటే ఆ పదానికి దగ్గరగా ఉన్న పదాలను మనకు అందిస్తుంది. ఇవి మనకు నవ్వు తెప్పించేలా కూడా ఉంటాయి. పాలిటిక్స్ గురించి టైప్ చేస్తే పొలిటికల్ ఇష్యూస్‌కు సంబంధించిన కీవర్డ్స్ మనకు అందిస్తుంది.
బ్లాగర్లకు ఉపయోగం
మనం పదాలను తప్పుగా టైప్ చేసినా ఆటో కరెక్ట్ అవుతాయి. పావులర్ సెర్చ్‌లు ఒక రకంగా ఉంటే.. అంతగా పాపులర్ కాని సెర్చ్‌లు మరో విధంగా కనిపిస్తాయి. ముఖ్యంగా మీ ప్రివియస్ సెర్చ్‌లను మళ్లీ చూసుకునే ఆప్షన్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది. బ్లాగ్‌లు, సైట్లు రన్ చేసేవాళ్లకు ఈ సెర్చ్‌ల వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఒక టాపిక్ గురించి కీవర్డ్స్‌ను ట్యాగ్‌లుగా ఇవ్వాలనుకుంటే ఈ సెర్చ్‌బార్‌లో వచ్చే సజిషన్స్‌ను చూస్తే చాలు.