• తాజా వార్తలు

మీ శాంసంగ్ ఫోన్‌ను మేక్ ఓవ‌ర్ చేయ‌డానికి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

భార‌త్‌లో ఎక్కువ అమ్ముడుపోయే ఫోన్ల‌లో శాంసంగ్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది. మ‌న జీవిత అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా టూల్స్‌తో వ‌చ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎకో సిస్ట‌మ్ వినియోగ‌దారుల‌ను మ‌రింత ఆక‌ట్టుకుంటోంది. గెలాక్సీ ఎస్‌9, ఎస్‌9 ప్ల‌స్ లాంటి డివైజ్‌ల‌లో ఉన్న అద్భుత ఫీచ‌ర్లు క‌స్ట‌మ‌ర్ల‌ను ఇంకా ఆక‌ర్షిస్తున్నాయి. అయితే ఈ ఫీచర్లు మాత్ర‌మే కాదు శాంసంగ్ థీమ్స్ సాయంతో మ‌న ఫోన్‌ను మేక్ ఓవ‌ర్ చేసుకోవ‌చ్చు. మ‌రింత అందంగా.. ఆక‌ర్షణీయంగా త‌యారు చేయ‌చ్చు. మ‌రి ఎలాగో చూద్దామా..

మేక్ ఓవ‌ర్ ఎలా చేయాలంటే..
శాంసంగ్‌లో వాల్‌పేప‌ర్స్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే (ఏవోడీ) ఇమేజ్‌లు, కాల్ అండ్ మెసేజ్ ఇంట‌ర్‌ఫేస్‌లు, థీమ్స్ లాంటి వాటితో అద్బుతాలే సృష్టించొచ్చు. మీ శాంసంగ్ ఫోన్‌ను పూర్తిగా మార్చేయ‌చ్చు. మీ స్క్రీన్ మీద ప్ర‌తి డిజైన్ ప్ర‌భావవంతంగా క‌నిపించ‌డానికి శాంసంగ్ థీమ్స్ బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప్ర‌తి క‌స్ట‌మైజేష‌న్ మ‌న‌కు స‌హ‌జంగా క‌నిపించేలా చేస్తుంది. మీ డివైజ్‌ను ఎంతో ప్లేజ‌ర్‌గా ఉంచేలా చేయ‌డం వీటి ప్ర‌త్యేక‌త‌. 

మిక్స్ అండ్ మ్యాచ్‌తో ఎంతో వినోదం
మ‌న‌కంటూ ప్ర‌త్యేకత చాటుకోవ‌డం కోసం యూజ‌ర్ల‌కు స్పెష‌ల్ ఫీలింగ్ క‌లిగించ‌డం కోసం శాంసంగ్ థీమ్స్ ఎంతో సాయం చేస్తాయి. శాంసంగ్ థీమ్స్ మీరు నేరుగా  స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. లేదా కొన్నింటిని నేరుగా కూడా అప్లై చేసుకోవ‌చ్చు. దీనిలో నాలుగు ఆప్ష‌న్లు ఉంటాయి. ఒక‌టి థీమ్స్‌, రెండోది వాల్‌పేప‌ర్స్‌, మూడోది ఐకాన్స్‌, నాలుగోది ఏవోడీఎస్‌.  దీనిలో అంతులేని కాంబినేష‌న్లు ఉంటాయి. మీ ఫోన్‌కు సెట్ అయ్యే మిక్స్ అండ్ మ్యాచ్ ఏంటో సుల‌భంగా గ్ర‌హించొచ్చు. మీరు ఎంచుకున్న థీమ్ మీకు మాత్ర‌మే సొంతం. యునిక్ అన‌మాట‌. 

వైడ్ రేంజ్ క‌లెక్ష‌న్లు
శాంసంగ్ థీమ్స్‌లో ఎన్నో వంద‌ల క‌లెక్ష‌న్లు ఉన్నాయి. ఎన్నో వెరైటీ థీమ్స్ వెయిట్ చేస్తున్నాయి. పాప్ క‌ల్చ‌ర్ బేస్డ్ డిజైన్ల ద‌గ్గ‌ర నుంచి సంప్ర‌దాయ డిజైన్లు, సీజ‌న‌ల్ డిజైన్లు, ఫ్యాష‌న‌బుల్ థీమ్స్ లాంటి కోకొల్ల‌లుగా అందుబాటులో ఉన్నాయి. ఆటిజంతో ఇబ్బందితో ఉన్న‌వాళ్ల కోసం ప్ర‌త్యేకంగా కొన్ని డిజైన్లు ఉన్నాయి. ఆర్టిస్టిక్ స్కిల్స్ లాంటి వాటిని కూడా  ఈ థీమ్స్ ద్వారా పొందొచ్చు. ఓవ‌రాల్‌గా ఫోన్ మేక్ ఓవ‌ర్ చేసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు