జియో ఫోన్‌ను భారత్‌లో ఏకంగా 40 మిలియన్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. జియో ఫోన్‌లో మనం ఉయోగించని ఫీచర్లు చాలా ఉన్నాయి. అయితే మనం జియో ఫోన్‌ను ఉపయోగించి మ్యూజిక్ వింటాం. ఇంకా ఇంటర్నెట్ సర్ఫింగ్ చేస్తాం. దీంతో ఇంకో ఉపయోగం కూడా ఉంది అదే మనకు నచ్చిన సినిమాలు డౌన్‌లోడ్ చేయడం. జియో ఫోన్ ద్వారా ఎస్‌డీ కార్డులోకి సులభంగా సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మరి అవేంటో తెలుసా..
సాధారణంగా సినిమాలు డౌన్‌లోడ్ చేయడానికి ఎక్కువమంది ఉపయోగించే పద్ధతి యూట్యూబ్. అయితే గతేడాది సెప్టెంబర్ నుంచి జియో ఫోన్ ద్వారా యూట్యూబ్ సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునే పద్ధతి వచ్చింది. సినిమా డౌన్‌లోడింగ్‌లో ఇదో కొత్త ట్రెండ్. అయితే మీరు కోరుకునే సినిమా యూట్యూబ్‌లో ఉంటే మాత్రమే ఈ పద్ధతిలో మనం డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మీకు నచ్చిన మూవీని వెతకేముందు ఆ మూవీ పేరుతో పాటు యూట్యూబ్‌లో వై అక్షరానికి ముందు యూఆర్ ఎల్‌లో ఎస్ఎస్ అనే అక్షరాలు టైప్ చేయాలి. ఎస్ఎస్ అక్షరాలను టైప్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి.
సేవ్ ఫ్రమ్.నెట్
మీరు ఒకసారి యూట్యూబ్ యూఆర్ ఎల్‌లో ఎస్ఎస్ యాడ్ చేసి ఎంటర్ చేశాక మీరు సేవ్‌ఫ్రమ్.నెట్ అనే వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతాము అక్కడ మీకు నచ్చిన ఫార్మాట్‌లో మూవీస్ సేవ్ చేసుకోవచ్చు. 144 పీ నుంచి 1080పీ హెచ్‌డీ వరకు మీకు నచ్చిన క్వాలిటీలో సినిమాలను మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఇంటర్నెట్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే మీరు సినిమాను డౌన్‌లోడ్ చేయకుండా ఆన్‌లైన్ ద్వారా చూడాలనుకుంటే జియో సినిమా అప్లికేషన్ ద్వారా చూడొచ్చు. మీరు సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఎస్‌డీ కార్డు ద్వారా చేసుకోవచ్చు. అయితే మనం ముందుగా ఎస్‌డీ కార్డు ఆప్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే ఇంటర్నల్ మెమెరీ ఫుల్ అయిపోయే అవకాశం ఉంది.