• తాజా వార్తలు

నెట్‌ఫ్లిక్స్‌లో వీడియోలు డౌన్‌లోడ్ చేసుకుని, ఆఫ్‌లైన్‌లో చూడడానికి గైడ్‌

హైడెఫినీష‌న్ మూవీ, వీడియో, టీవీ కంటెంట్ చూడడానికి ప్రపంచ‌వ్యాప్తంగా పేరొందిన స‌ర్వీస్ నెట్‌ఫ్లిక్స్‌.  దీని స‌బ్‌స్క్రిప్ష‌న్ కాస్ట్‌లీ. నెల‌కు క‌నీసం 500 పెడితే గానీ స‌బ్‌స్క్రిప్ష‌న్ చేయ‌లేం. అయితే ఇప్పుడు ఒక నెల ఫ్రీ ట్ర‌యల్‌ను నెట్‌ఫ్లిక్స్ అంద‌రికీ ఆఫ‌ర్ చేస్తోంది. అది ఎలా వాడుకోవాలో మొన్న‌టి ఆర్టిక‌ల్‌లో తెలుసుకున్నాం. నెట్‌ఫ్లిక్స్ వీడియోల‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో చూసుకునేలా డౌన్‌లోడ్ ఫీచ‌ర్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తెచ్చింది. 

నెట్‌ఫ్లిక్స్ యాప్‌, సైట్ రెండింటిలోనూ రీసెంట్‌గా డౌన్‌లోడ్ ఫీచ‌ర్‌ను కూడా యాడ్ చేశారు.  దీంతో మీరు యూట్యూబ్ ఆఫ్‌లైన్ ఫీచ‌ర్ మాదిరిగానే మూవీస్‌, టీవీషోలు ఇలా నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఏ వీడియోన‌యినా డౌన్‌లోడ్ చేసుకుని త‌ర్వాత ఆఫ్‌లైన్‌లో చూసుకోవ‌చ్చు.

1. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

2.మూవీ, టీవీషో, ఎలాంటి వీడియో అయినా మీరు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. 

3. మీరు వీడియో ఓపెన్ చేశాక ప్లే ఆప్ష‌న్ కింద డౌన్‌లోడ్ ఐకాన్ క‌నిపిస్తుంది. ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ స్టార్ట‌వుతుంది.

4.ఆ త‌ర్వాత ఈ వీడియోను ఇంట‌ర్నెట్ కనెక్ష‌న్ అవ‌స‌రం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్‌లైన్‌లో చూసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు