వాట్సప్.. ప్రపంచంలో ఎక్కువమంది వాడే మెసేజింగ్ యాప్ ఇదే. కోట్లాది మందికి వాట్సప్ ఒక అడిక్షన్‌గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్ వాడేవాళ్లలో దీన్ని చూడకుండా నిద్రపోయేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. నిజానికి టెక్ట్ మెసేజ్‌లు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ వాట్సప్ ఈ టెక్ట్ మెసేజ్‌లలో రివల్యూషన్ తీసుకొచ్చింది. ఎమోజీలతో పాటు ఎన్నో ఫీచర్లతో కస్టమర్లను కట్టిపడేసింది. ఈ వాట్సప్ ఇప్పుడు మీకు వ్యక్తిగతంగానే కాక వృత్తిపరంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక బిజినెస్‌కు ఇది సాయం చేస్తుందన్న మాట. అదెలా అంటే వాట్సప్ బిజినెస్ అకౌంట్ ద్వారా మీరు మీ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవచ్చు. మరి ఈ బిజినెస్ అకౌంట్‌ను ఎలా పొందాలి? ఎలా వెరిఫై చేయించాలో చూద్దామా..
వాట్సప్ పర్సనల్ లాగే వాట్సప్ బిజినెస్ అకౌంట్ కూడా ఉంది. అయితే దీనికి వాట్సప్ గుర్తింపు కూడా ఇస్తుంది. ఈ బిజినెస్ అకౌంట్ ఫేక్ కాదు మీరు నమొచ్చు అనే భరోసాను కల్పిస్తుంది. అంటే మీ వాట్సప్ బిజినెస్ అకౌంట్‌కు ఒక వెరిఫైడ్ బ్యాడ్జ్ వస్తుంది. ఇందుకోసం మీరేమీ వాట్సప్‌కు ప్రత్యేకమైన రిక్వెస్ట్‌లు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ డాక్యుమెంట్ సబ్‌మిట్ చేయక్కర్లేదు. మీ బిజినెస్ యాక్టివిటీని బట్టి ఇది ఆటోమెటిక్‌గా వెరిఫికేషన్ చేసుకుంటుంది. ఇందుకోసం కొన్ని స్టెప్స్ మనం పాటించాలి
1. ముందుగా వాట్పప్ బిజినెస్ అకౌంట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2,. ముందుగా కొన్ని స్టెప్స్ కంప్లీట్ చేయాలి. మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిపై చేయాలి
3. మొబైల్ వెరిఫై అయిన తర్వాత ఆమ బిజినెస్ పేరు (షాప్ పేరు లేదా కంపెనీ పేరు) ఎంటర్ చేయాలి. ఈ పేరు ఒకసారి క్రియేట్ అయిన తర్వాత మళ్లీ మర్చడం కుదరదు.
4. ఆ తర్వాత యాప్ హోమ్ పేజీకి వెళితే మీకు రెగ్యులర్ వాట్సప్ హోమ్ పేజీ మాదిరిగానే అనిపిస్తుంది. ఇక్కడే మీరు మీ బిజినెస్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవాలి
5. టాప్ రైట్‌లో ఉన్న మూడు డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయాలి. ఆ తర్వాత బిజినెస్ సెట్టింగ్స్ ప్రొఫైల్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
6. ఆ తర్వాత మీ డిస్ ప్లే పిక్‌ను సెట్ చేసుకుని.. బిజినెస్ అడ్రెస్ ఇవ్వాలి. లొకేషన్ కూడా ఇక్కడే ఇచ్చుకోవచ్చు.
7. ఆ తర్వాత మీ బిజినెస్ కేటగిరి ఏంటో మెన్షన్ చేయాలి. ఆటోమేటివ్, క్లోతింగ్, ఫైనాన్స్, రెస్టారెంట్ ఇలా మీ వ్యాపారానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి.
8. మీ బిజినెస్ ఎన్ని రోజులు ఉంటుంది.. ఎన్ని గంటలు పని చేస్తారు.. ఎంత మంది ఎంప్లాయిస్ ఉంటారు ఇలాంటి వివరాలు కూడా ఇవ్వొచ్చు.
ఈ వివరాలు ఇస్తే చాలు మీ బిజినెస్ పనితీరును బట్టి వాట్సప్ ఆటోమెటిక్‌గా మీ బిజినెస్ అకౌంట్‌ని వెరిఫై చేసుకుంటుంది.