మీరు వేరే ఫోన్ కాల్‌లో బిజీగా ఉన్నా లేకపోతే కాల్ ఆన్సర్ చేసే పరిస్థితి లేకపోయినా అవతలివారు మీకు ఆడియో మెసేజ్ పంపవచ్చు. దీన్నే వాయిస్ మెయిల్ అంటారు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఎవరయినా ఈ వాయిస్ మెయిల్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఆర్టికల్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్ మెసేజ్ సెట్ చేయడం, వాటిని యాక్సెస్ చేయడం ఎలాగో చూశాం. ఇప్పుడు ఐఫోన్‌లో వాయిస్ మెయిల్ సెట్ చేసుకోవడం, వాటిని యాక్సెస్ చేయడం ఎలాగో చూద్దాం.
ఐ ఫోన్‌లో వాయిస్ మెయిల్ సెట్ చేయడం ఎలా?
* ఐ ఫోన్‌లో వాయిస్ మెయిల్ సర్వీస్ ముందుగానే యాక్టివేట్ అయి ఉంటుంది. కాబట్టి జస్ట్ మీరు పాస్‌కోడ్ క్రియేట్ చేసుకుంటే చాలు.
* ఇప్పుడు మీ సెల్‌లో ఫోన్ యాప్‌ను టాప్ చేయండి. దానిలో కింద వైపున ఉండే వాయిస్ మెయిల్ ఆప్షన్‌ను టాప్ చేయండి.
* వచ్చిన ఆప్షన్లలో సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేయండి.
* Set Up Nowను క్లిక్ చేసి 4 లేదా 6 అంకెల పాస్‌కోడ్‌ను సెట్ చేయండి
* డన్ నొక్కి పాస్‌కోడ్‌ను మళ్లీ ఎంటర్ చేసి మళ్లీ డన్ నొక్కండి.
* అంతే మీ ఐ ఫోన్‌లో వాయిస్ మెయిల్ సెట్ అయిపోయింది.
ఐ ఫోన్‌లో వాయిస్ మెయిల్‌ను చెక్ చేసుకోవడం ఎలా?
* ఐ ఫోన్‌లో ఫోన్ యాప్‌ను క్లిక్ చేయండి. దీనిలో వాయిస్‌మెయిల్ ట్యాబ్ పక్కనే ఓ బ్యాడ్జి కనిపిస్తుంది. దానిమీద ఎన్ని నెంబర్లుంటే అన్ని వాయిస్‌మెయిల్స్ మీకు వచ్చినట్లు వాటిని క్లిక్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి మీరు వినొచ్చు.
* ఫోన్ స్పీకర్ ద్వారా గానీ బ్లూటూత్ స్పీకర్ ద్వారా గానీ వినొచ్చు
* ఫోన్ యాప్‌ను ఓపెన్ చేసి వాయిస్ మెయిల్‌ను టాప్ చేస్తే ఆప్షన్లు వస్తాయి. దాన్ని కావాలంటే మీరు ఎవరికైనా పంపడానికి షేర్ ఆప్షన్ కూడా ఉంది.
* అలాగే దాన్ని ఎంపీ4 ఫార్మాట్‌లో సేవ్ కూడా చేసుకోవచ్చు.
కాలర్‌కు గ్రీటింగ్ మెసేజ్ వినిపించొచ్చు
మీ కాలర్స్ మీకు వాయిస్ మెసేజ్ పంపేటప్పుడు వారిని గ్రీట్ చేసేందుకు వాయిస్ మెసేజ్‌ను కూడా క్రియేట్ చేయొచ్చు.
* ఫోన్ యాప్ ఓపెన్ చేసి వాయిస్ మెయిల్‌ను టాప్ చేయండి
* ఇప్పుడు Greeting అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి Customను టాప్ చేయండి.
* Recordను టాప్ చేసి మీరు కాలర్‌ను విష్ చేస్తూ వాయిస్ మెసేజ్ క్రియేట్ చేయండి. తర్వాత దాన్ని సేవ్ చేయండి.
* అంతే ఇప్పుడు ఎవరైనా మీరు అందుబాటులో లేరని మీ ఐ ఫోన్‌కు వాయిస్ మెయిల్ పంపాలనుకుంటే వారికి ఈ గ్రీటింగ్ మెసేజ్ వినిపిస్తుంది.