ఈ ఎలక్ట్రానిక్ యుగంలో మనం వాడుతున్న అనేక వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం, వాటిని శుభ్రంగా, జాగ్తత్తగా ఉంచుకోవడం ఎలాగన్న అంశాలను మనం ఇప్పటికే ఒక వ్యాసంలో చదువుకున్నాం. మరికొన్ని వస్తువులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలిద్దామా?
మొబైల్ ఫోన్ సంరక్షణ ఇలా...
1. సెల్‌ఫోన్ జారిపడకుండా చూసుకోవడం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మొట్టమొదటిది. ఇందుకోసం దాన్ని లాన్‌యార్డ్ (కట్టి ఉంచే దారంవంటి కేబుల్)ను ఎప్పుడూ తగిలించి ఉంచాలి.
2 ఫోన్‌ను శుభ్రం చేయాలంటే ఆల్కహాల్‌లో ముంచిన దూదిని ఉపరితలంపై ఒత్తాలి. ఇది కేవలం ఫోన్ బయటివైపు శుభ్రం చేయడం కోసమే. లోపలిభాగాలను శుభ్రం చేయడానికి ఇలా ఆల్కహాల్ ముంచిన దూదిని వాడరాదు. నేడు దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు కాబట్టి, స్క్రీన్‌ను శుభ్రం చేయడం కోసం దూది కాకుండా పోగులు ఊడని మెత్తటి వస్త్రాన్ని వాడాలి.
3. మొబైల్ ఫోన్ శుభ్రం చేయడం కోసం స్ప్రే బాటిల్‌ను వాడకూడదు.
4. మీరు ఫోన్ వాడుతున్న సమయంలో అది వేడెక్కితే, ఉపయోగించడం ఆపండి. వాడక తప్పని పరిస్థితి ఉన్నట్లయితే చల్లబడేదాకా ఆగాలి లేదా మధ్యమధ్యలో కాసేపు విరామం ఇస్తూ ఉపయోగించవచ్చు.
5. వీలైతే స్క్రీన్ ప్రొటెక్టర్‌తోపాటు బలమైన ఫోన్ కేస్‌ను వినియోగించండి. మీరెంతగానో ఇష్టపడే ఫోన్ స్క్రీన్‌పై గీతలు పడకుండా నివారించే మార్గమిది.
6. ఫోన్‌ను బ్యాటరీ ఎప్పుడూ 40 నుంచి 80 శాతం మధ్య చార్జింగ్‌తో ఉండేవిధంగా చూసుకోవాలి.
7. ఫోన్‌ను సదా అప్‌డేటెడ్‌గా ఉంచుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నపుడు తప్పకుండా అప్‌డేట్ చేసుకోండి.
8. లెక్కకుమించిన యాప్స్ వల్ల మీ ఫోన్ పనితీరు మందగిస్తుంది. కాబట్టి మీరు వాస్తవంగా వాడుతున్నవి మాత్రమే ఉంచుకోండి.
9. ఫోన్ ఎప్పుడూ నీడలో ఉంచుకోవడంతోపాటు స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తక్కువ స్థాయిలో ఉంచండి.
10. సెల్ ఫోన్లను వాయిస్ కాల్స్ కోసం మాత్రమే వాడండి.
11. పూర్తిగా మూసి ఉన్న ప్రదేశంలో కాకుండా బాగా కనిపించే చోట ఫోన్‌ను ఉంచడం మంచిది.
టెలివిజన్ జాగ్రత్తలు ఇలా...
1. టెలివిజన్‌ను వాడని సమయంలో దాని ప్లగ్‌లను పవర్ సాకెట్ నుంచి తీసివేయాలి. దీనివల్ల విద్యుత్ వినియోగం తగ్గటంతోపాటు టీవీ ఓవర్‌హీట్ కాకుండా ఉంటుంది.
2. పదునైన వస్తువులను టెలివిజన్ స్క్రీన్‌కు దూరంగా ఉంచండి
3. టెలివిజన్ స్క్రీన్‌ను శుభ్రం చేయడానికి స్ప్రే క్లీనర్‌ను వాడండి..
4. టెలివిజన్‌కు నేరుగా ఎండగానీ, మంట లేదా వేడిమిగానీ తగలకుండా చూసుకోండి.
5. మీరు నివసించే ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, కోత అధికంగా ఉండేట్లయితే స్టెబిలైజర్‌తో మీ టెలివిజన్‌ను కనెక్ట చేయండి. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ ప్రమాదం నుంచి టెలివిజన్‌ను రక్షించుకోవచ్చు.