• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఫోన్‌ల బ్యాట‌రీని కాలిబ్రేట్ చేయ‌డానికి స‌రైన గైడ్ మీకోసం

స్మార్ట్‌ఫోన్ల‌కు అతి పెద్ద ప్రాబ్ల‌మ్ బ్యాట‌రీనే. మ‌నం వాడుతున్న కొద్దీ దీని జీవ‌న ప‌రిమాణం త‌గ్గిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఛార్జింగ్ పాయింట్లు ఉన్న‌ట్లు క‌నిపించినా వెంట‌నే స్విచ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. దీనికి కార‌ణం బ్యాట‌రీ డ్రై అయిపోవ‌డ‌మే. అందుకే మీ బ్యాట‌రీని రీకాలిబ్రేట్ చేయాల్సి ఉంటుంది. మ‌రి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను రీకాలిబ్రేట్ చేయ‌డం ఎలాగో తెలుసుకుందామా..

బ్యాట‌రీ ప‌రిశీలించాలి
బ్యాట‌రీని రీకాలిబ్రేట్ చేయాలంటే ముందుగా దాన్ని నిశితంగా ప‌రిశీలించాలి. ఫోన్ బ్యాక్ ప్యాన‌ల్ ఓపెన్ చేసి బ్యాట‌రీని దాని స్లాట్ నుంచి బ‌య‌ట‌కు తీయాలి. ఏమైనా లీక్స్ ఉన్నాయా.. లేదా తుప్పు ఏదైనా ప‌ట్టిందా ఒక‌సారి చెక్ చేసుకోవాలి. మ‌న ఒక‌సారి బ్యాట‌రీ బయ‌ట‌కు తీసిన త‌ర్వాత మ‌ళ్లీ అది త‌న స్థానంలో స‌రిగా అమ‌ర‌లేక‌పోతే మ‌నం కొత్త బ్యాట‌రీ కొనే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అర్థం.  మార్కెట్లో బ్యాట‌రీల‌ను అమ్మ‌డానికి థ‌ర్డ్ పార్టీ సెల‌ర్స్ ఉన్నారు.  కానీ మ‌న‌మెప్పుడూ వాటి జోలికి వెళ్లకూడ‌దు. ఒరిజిన‌ల్ బ్యాట‌రీ మాత్ర‌మే కొనుగోలు చేయాలి. బ్యాట‌రీ విరిగినా.. పాడైనా దాన్ని క్యాలిబిరేట్ చేయ‌డం వేస్ట్‌.


ఏం చేయాలంటే..
మ‌న బ్యాట‌రీని క్యాలిబిరేట్ చేయాలంటే ముందుగా బ్యాట‌రీ మొత్తం పూర్తిగా డ్రై అయిపోవాలి. అయితే ఇదేమీ లాంగ్‌ట‌ర్మ్ సొల్యుష‌న్ కాదు. బ్యాట‌రీ పూర్తిగా అయిపోయిన త‌ర్వాత ఫోన్ ఆటోమెటిక్‌గా స్విచ్ ఆఫ్ అయ్యే వ‌ర‌కు వేచి చూడాలి. ఆ త‌ర్వాత ఛార్జ‌ర్ పెట్టి 100 శాతం ఛార్జింగ్ అయ్యే వ‌ర‌కు వెయిట్ చేయాలి. ఛార్జింగ్ పూర్త‌య్యాక ఫోన్‌ను ఆన్ చేయాలి.అయితే మీరు ఆన్ చేసిన త‌ర్వాత ఫోన్ ఛార్జింగ్ ఇంకా కాలేద‌ని మీ బ్యాట‌రీ ఇండికేట‌ర్ చూపిస్తుంటే క‌నుక ఈసారి ఫోన్ ఆన్‌లో ఉంచే మ‌ళ్లీ ఛార్జింగ్ పెట్టాలి. పూర్తిగా ఛార్జ్ అయ్యే వ‌ర‌కు దాన్ని అలాగే ఉంచాలి. అలా పూర్త‌య్యాక బ్యాట‌రీ అయ్యే వ‌ర‌కు మ‌ళ్లీ వాడాలి. ఆ త‌ర్వాత పుల్ కెపాసిటీ వ‌ర‌కు మ‌ళ్లీ ఛార్జ్ పెట్టాలి. దీన్నే బ్యాట‌రీ క్యాలిబేట్రేష‌న్ అంటారు. ఇందువ‌ల్ల మీ బ్యాట‌రీ స్టామినా ఏంటో మీరు క‌నిపెట్టొచ్చు. 

జన రంజకమైన వార్తలు