మీ కంప్యూటర్‌లో మదర్ బోర్డు నుంచి వెబ్‌కామ్ వరకు మంచిగా పని చేయాలంటే డ్రైవర్లు చాలా అవసరం. మరి మీ హార్డ్‌వేర్ ఇబ్బంది పెడితే డ్రైవర్లు మార్చుకోవాల్సి వస్తుంది. మీరు విండోస్ 10 లేదా 7 వెర్షన్లు ఉపయోగిస్తుంటే డ్రైవర్లు పాడైపోతే మీకు ఒరిజినల్ డ్రైవర్లు దొరకాలంటే ఎలా? అయితే ఈ వెర్షన్ల కోసం అఫీషియల్ డివైజ్ డ్రైవర్లను పొందడం ఎలా?
ఆటోమెటిక్ డౌన్‌లోడ్
మీ పీసీ, మీ కనెక్టెడ్ డివైజ్‌లు సరిగా పని చేస్తుంటే మీరు డ్రైవర్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ కంప్యూటర్‌లో విండోస్ ఉంటే..అది ఆటోమెటిక్‌గా డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేసుకుంటుంది. డివైజ్ మాన్యుఫాక్చర్లు ఈ ఆఫీషియల్ డ్రైవర్లను ముందుగానే మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసి ఉంచుతారు. ఇవి అవసరమైనప్పుడు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయి. విండోస్ అప్‌డేట్ ద్వారా ఇది ఎప్పటికప్పడు మనకు సమాచారం అందిస్తుంది. మీ విండోస్‌లో సురక్షితంగా డ్రైవర్లను అప్‌డేట్ చేయడానికి ఇదే మంచి మార్గం.
మాన్యుఫాక్చర్, మోడల్ నంబర్
మీరు డ్రైవర్లను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేయాలనుకుంటే మీకు ఆ డివైజ్‌కు సంబంధించిన మాన్యుఫాక్చర్ వివరాలు కూడా తెలియాల్సి ఉంటుంది. అంతేకాదు మోడల్ నంబర్ కూడా తెలియడం మస్ట్. ఈ సమాచారం అంతా డివైజ్ ప్యాకేజింగ్ మీద ప్రింట్ అయి ఉంటుంది. స్పీకీ వెర్షన్ ద్వారా కూడా మీరు మీ డివైజ్‌కు సంబంధించిన మాన్యుఫాక్చరింగ్, మోడల్ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. లేకపోతే మీ కంప్యూటర్‌ను మీరే తయారు చేసుకుంటే అంటే అసెంబ్లీంగ్ చేసుకుంటే.. మీ కంప్యూటర్‌లో వాడిన హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఏమిటో తెలియాల్సి ఉంటుంది.
అధికారిక డౌన్‌లోడ్ లింక్స్ ఇవే...
ఏసర్: ఎస్పైర్, ప్రిడాటర్, ట్రావాఎల్‌మేట్‌లతో పాటు ఇతర పీసీలకు కూడా యాక్ససరీస్ ప్రొవైడ్ చేస్తుంది. అలియన్‌వేర్ ద్వారా డెల్ వెబ్‌సైట్ నుంచి దీనికి సంబంధించిన డ్రైవర్లను యూజర్లు పొందొచ్చు. ఏఎండీ ద్వారా.రాడియన్ జీపీయూ, ఏఎండీ ఏపీయూ లాంటి వాటికి డ్రైవర్లను డౌన్‌లోడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏఎండీ వెబ్‌సైట్ ద్వారా చిప్ సెట్ డ్రైవర్లు పొందొచ్చు.యాపిల్ అయితే బూట్ క్యాంప్ సపోర్ట్ ద్వారా విండోస్ డ్రైవర్లను అందిస్తోంది. ఇది మాక్‌ల కోసం వాడుకోవచ్చు.