సెల్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం గుప్పిట్లో ఉన్నట్లే. కూర్చున్నచోట నుంచి కదలకుండా వ్యవహారాలన్నీ చక్కబెట్టేసుకోవచ్చు. అలాంటి సెల్‌ఫోన్ ఏ సిగ్నల్స్ అందకో ఆగిపోతే మన రోజువారీ పనుల్లో చాలా ఇబ్బంది పడాల్సిందే. 2జీ, 3జీ దాటి 4జీ కూడా రాజ్యమేలేస్తున్నా ఇప్పటికీ సెల్ సిగ్నల్స్ సరిగాలేని ప్రాంతాలు కనపడుతూనే ఉంటాయి. మరి అలాంటి చోట్ల ఇక ఇంతే అని సరిపెట్టేసుకోవాల్సిందేనా? అవసరం లేదు. దీనికి కూడా టెక్నాలజీ సొల్యూషన్స్ చూపిస్తుంది.
2జీ మొబైల్ నెట్‌వర్క్ లో సిగ్నల్స్ వీక్‌గా ఉంటే దాన్ని పెంచుకోవడానికి సెల్యులర్ యాంప్లిఫైయర్స్ అందుబాటులో ఉన్నాయి. జీఎస్ ఎం ఫ్రీక్వెన్సీ 900, 1800 కలిగి ఉన్న సెల్ కనెక్షన్ల సిగ్నల్స్‌ను ఈ యాంప్లిఫైయర్స్ స్ట్రెంగ్తెన్ చేస్తాయి. వీటిని ఏ నెట్‌వర్క్‌కైనా ఎన్ని కాల్స్ కోసమైనా వాడుకోవచ్చు.
3జీ రిపీటర్
ఇక 3జీ మొబైల్ సిగ్నల్ సరిగా అందకపోతే దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి 3జీ రిపీటర్లున్నాయి. ఈ 3జీ సిగ్నల్ యాంప్లిఫైయర్ పరిధి 2100 ఎంఏహెచ్ ఫ్రీక్వెన్సీ వరకు ఉంటుంది. ఇవి 2జీ సిగ్నల్స్ బూస్టర్స్ కంటే అడ్వాన్స్‌డ్ క్యాపబులిటీస్ కలిగి ఉంటాయి. 3జీ కాల్స్‌తోపాటు వీడియో కాల్స్ ఆఖరికి హై స్పీడ్ ఇంటర్నెట్ వాడుకునేలా సిగ్నల్స్ కెపాసిటీని పెంచుతాయి. వీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.
వైమాక్స్
ప్రస్తుతం సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లన్నీ 4జీ కనెక్టివిటీ ఉన్నవే. వీటిలో వీక్ సిగ్నల్స్ ఉండే వై మ్యాక్స్ అనే సిగ్నల్ బూస్టర్‌ను వినియోగించుకోవచ్చు. ఇది 4జీ నెట్‌వర్క్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. వీటి ఫ్రీక్వెన్సీ రేంజ్ 2.5 గిగా హెర్ట్జ్ వరకు ఉంటుంది.
ఈ సిగ్నల్ రిపీటర్స్ ధర వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నాయి.