ఇప్పుడు వస్తున్న చాలా ఫోన్లు ఐ ఫోన్‌ను కాపీ కొట్టేవే. డిజైన్, లుక్ మాత్రమే కాదు ఫీచర్లను కాపీ కొట్టి అచ్చంగా ఐఫోన్‌లను తలపించే ఫోన్లు మార్కెట్లో ఉన్నాయిప్పుడు. ముఖ్యంగా జెస్చెర్ బేస్డ్‌గా వస్తున్న చాలా ఫోన్లలో ఇప్పుడు ఐ ఫోన్ ఫీచర్లు కనిపిస్తున్నాయి. మరి షియోమి ఫోన్లో ఐఫోన్ ఎక్స్ లాంటి జెస్చెర్లు పొందడం ఎలాగో తెలుసుకుందామా... దానికిదే గైడ్.
ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే అనేబుల్
1.సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెర్చ్‌లో ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే మీద క్లిక్ చేయాలి. దీనిలో మీకు బటన్స్, ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. దీనిలో మీరు రెండో ఆప్షన్ ఎంచుకోవాలి. దీనిలో ఉన్న ఉపయోగం ఏమిటంటే మీరు ఎంచుకున్న తర్వాత ఎప్పుడైనా వెనక్కి వెళ్లొచ్చు.
2. జెస్చెర్స్ ఆప్షన్ అనేబుల్ చేసిన తర్వాత గో బ్యాక్ జెర్చర్‌ను స్విచ్ ఆన్ చేయాలి. దీనిలో మీకు సరిపోయే యానిమేషన్లు కనిపిస్తాయి. స్క్రీన్ అంచుల చివరి స్వైప్ చేయాలి.
3. ఎంఐయూఐ 9.5 జెస్చర్లను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం దీనిలో ప్రత్యేకించి బటన్స్ ఉంటాయి.
4. హోమ్ బటన్‌లో స్వైప్ అప్ చేసి మిడ్ ఆఫ్ ద స్క్రీన్‌కి వెళ్లొచ్చు
5. బ్యాక్ అంటే స్క్రీన్ లెఫ్ట్ ఎడ్జ్ నుంచి స్వైప్ చేయాలి
6. రీసెంట్ యాక్షన్ కోసం స్క్రీన్ మిడిల్ నుంచి పైకి స్వైప్ చేయాలి
7. స్క్రీప్ట్ స్క్రీన్ కోసం స్క్రీన్ అడుగు భాగం నుంచి పాజ్ చేస్తూ స్వైప్ చేయాలి.
ఏంటీ ఉపయోగం
జెస్చర్స్ ఫీచర్ వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. దీని వల్ల ఫోన్ డిస్‌ప్లే నుంచి 100 శాతం బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. స్క్రీన్‌లో ఎక్కడ టచ్ చేసైనా సరే మనం పనులు చేసుకోవచ్చు. 18:9 లాంటి పెద్ద డిస్‌ప్లే ఉన్న షియోమిలో మరిన్ని ఉపయోగాలు పొందొచ్చు. జెస్చర్స్ వల్ల ఫోన్‌లో ఫలానా ప్లేస్‌లో మీ చేతి వేళ్లు ఉంచాల్సిన అవసరం లేకుండానే మీరు అనుకున్న పని చేయచ్చు. మీరు అనుకున్న దిశగా జస్ట్ స్వైప్ చేస్తే చాలు. దీనిలో ఉండే క్విక్ బాల్ మెనూ కూడా మీకెంతో ఉపయోగపడుతుంది.