డూప్లికేట్ ఈమెయిల్స్, చెత్త మెయిల్స్, ఇన్‌వాలిడ్ టీఎల్‌డీస్‌తో విసిగిపోయారా? అయితే వాటి నుంచి విముక్తి పొందడానికి ఏం చేయాలో తెలియజెప్పే గైడ్ మీకోసం తీసుకొచ్చాం. ఈమెయిల్ లిస్ట్ క్లీనర్ (Email List Cleaner) అనే ఆన్‌లైన్ అప్లికేషన్‌తో మీరు ఇలాంటి అన్‌వాంటెడ్ ఈమెయిల్స్ నుంచి పర్మినెంట్‌గా విముక్తి పొందవచ్చు.
ఎలా పని చేస్తుంది?
ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ మీ ఈమెయిల్ అడ్రస్‌కు వచ్చిన మెయిల్స్‌లో డూప్లికేట్ ఈ మెయిల్స్, చెత్తవి, రిస్క్ ఉన్న మెయిల్స్‌ను ఫిల్టర్ చేస్తుంది. ఇందుకోసం బేసిక్ పారామీటర్స్‌ను ఉపయోగిస్తుంది. దీంతొ ఎలాంటి రిస్క్‌లేని ఈ మెయిల్స్ మాత్రమే మీరు పొందగలుగుతారు.
ఎలా వాడుకోవాలి?
1. Email List Cleaner అప్లికేషన్ హోం పేజీని మీ పీసీలో ఓపెన్ చేయండి. అక్కడ మీకు ఈ మెయిల్ లిస్ట్‌ను ఇంపోర్ట్ చేయడానికి ఆప్షన్ కనిపిస్తుంది. దీనికోసం Choose File బటన్ నొక్కి ఈ మెయిల్స్ ఉన్న సీఎస్‌వీ (CSV) ఫైల్‌ను సెలెక్ట్ చేయండి.
2. సీఎస్‌వీ ఫైల్ ఇంపోర్ట్ చేశాక ఈమెయిల్ కాలమ్ నేమ్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. డ్రాప్ డౌన్ మెనూను క్లిక్ చేసి కాలమ్ నేమ్‌ను సెలెక్ట్ చేయండి.
3. కంటిన్యూ బటన్ నొక్కితే రిజల్ట్ ఆటోమేటిగ్గా జనరేట్ అవుతుంది.
4. రిజల్ట్ పేజీలో క్లీన్ అయిన ఈమెయిల్స్ లిస్ట్ కనిపిస్తుంది. అలాగే ఎన్నోటేటెడ్ ఒరిజినల్ ఈమెయిల్స్ లిస్ట్ కూడా కనిపిస్తుంది. ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఆ ఫైల్స్ మీ పీసీలో సీఎస్‌వీ ఫైల్స్‌గా సేవ్ అవుతాయి.
5. ఇప్పుడు ఈ క్లీన్ అయిన ఈ మెయిల్స్ లిస్ట్‌లో ఎలాంటి డూప్లికేట్ ఈ మెయిల్స్, చెత్తవి, హై రిస్క్ ఈ మెయిల్స్, ఇన్‌వాలిడ్ టీఎల్‌డీలు ఉండవు. వెబ్‌సైట్ వీటన్నింటినీ ఫిల్టర్ చేసేస్తుంది. కానీ annotated original listలో మాత్రం మొత్తం మెయిల్స్ ఉంటాయి.