• తాజా వార్తలు

సెర్చ్ ఇంజ‌న్ల నుంచి మీ పేరు పూర్తిగా తొల‌గించ‌డానికి వన్ అండ్ వోన్లీ గైడ్‌

కంప్యూట‌ర్‌లో మ‌నకు ఏదైనా అవ‌స‌రం ఉంటే వెంట‌నే గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. గూగుల్ అంటేనే ఇంట‌ర్నెట్ అనుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. అయితే గూగుల్ సెర్చ్ ఇంజ‌న్ మాత్ర‌మే. అంటే మ‌న‌కు అవ‌స‌ర‌మైన దాన్ని వెతికి పెట్టేది మాత్ర‌మే. కంప్యూట‌ర్‌లో మ‌న‌కు అవ‌స‌ర‌మైన వివ‌రాలు వెత‌క‌డం కోస‌మో లేదా మ‌న వివ‌రాలు రిజ‌స్ట్రేష‌న్ చేసుకోవ‌డం కోస‌మో చాలాసార్లు సైన్ అప్ అవుతాం. ప్ర‌తి సైట్ ఇప్ప‌డు సైన్ అప్ అడుగుతుంది. ఇలాంట‌ప్పుడు మీ వివ‌రాల‌న్నీ ఇస్తాం. ఈ వివ‌రాల‌న్నీ కంప్యూట‌ర్ సెర్చ్ ఇంజ‌న్లో నిక్షిప్త‌మై ఉంటాయి. మ‌రి ఈ విలువైన స‌మాచారాన్ని ఎవ‌రికి చిక్క‌కుండా దాచ‌డం ఎలా... అస‌లు సెర్చ్ ఇంజ‌న్ నుంచి మ‌న పేరును వివ‌రాల‌ను పూర్తిగా తొల‌గించ‌డం ఎలా?

కంప్యూట‌ర్‌ని ఉప‌యోగించుకుంటే దీనంత‌గా బాగా ఉప‌యోగ‌ప‌డే సాధ‌న‌మే లేదు.. అదే చెడుకు ఉప‌యోగిస్తే మాత్రం ఎంత‌టి వినాశ‌నాన్నైనా సృష్టించొచ్చు. అలాగే మ‌న వివ‌రాలు అన్ని కంప్యూట‌ర్‌లో దాస్తాం. అవ‌న్నీ మూడో కంటికి తెలియ‌దు అనుకుంటాం. కానీ చెడు ప‌నులు చేసేవాళ్ల‌కు మ‌న డేటాను సేక‌రించ‌డం పెద్ద విష‌యం కాదు. మీకు తెలియ‌కుండానే మీ విలువైన స‌మాచారాన్ని వాళ్లు త‌స్క‌రించొచ్చు లేదా వాటిని చెడుకు ఉప‌యోగించొచ్చు. దీనికి అంత‌టికి కార‌ణం సెర్చ్ ఇంజ‌న్లే.  మ‌రి మ‌న ఇన్ఫ‌ర్మేష‌న్ తీసేయాలంటే కొన్ని ప‌ద్ధ‌తులున్నాయి,

1.మీరు ఇన్ఫ‌ర్మేష‌న్ పోస్టు చేసిన సైట్ ఓన‌ర్ల‌ను కాంటాక్ట్ చేయాలి. మీ వివ‌రాల‌ను తీసేయ‌మ‌ని అడ‌గాలి.

2 ఏదైనా కాపీ రైటెడ్ కంటెంట్, హాని చేసే కంటెంట్‌, డిఫ‌మేష‌న్ మేట‌ర్లు ఉంటే అలాంటి వాటిని వెంట‌నే తొల‌గించాల‌ని హోస్ట్ కంపెనీని కోరాలి

3. మీకు సంబంధించిన ఏదైనా వివ‌రాలు కంప్యూట‌ర్‌లో రాంగ్‌గా క‌నిపిస్తే వెంట‌నే లాయ‌ర్‌ను కాంటాక్ట్ చేయాలి. అలాంటి కంటెంట్‌ను తొల‌గించేలా కోర్టు ద్వారా ప్ర‌య‌త్నించాలి.

4. మీ కంటెంట్ గూగుల్ ర్యాంకింగ్స్‌లో లేకుండా చూసుకోవాలి. దీని వ‌ల్ల ఎవ‌రు సెర్చ్ చేసినా మీ కంటెంట్ దొర‌క‌దు.

5. మీరు చాలా స‌బ్‌స్కైబ్ చేస్తుంటారు. ఈ లింక్స్‌ను ఎప్ప‌టిప్పుడు అన్ స‌బ్ స్కైబ్ చేయాలి.

జన రంజకమైన వార్తలు