అమెజాన్.. ప్రపంచంలోనే ఎక్కువమంది ఉపయోగించే ఈ కామర్స్ సైట్ ఇది. అయితే ఇందులో కేవలం కొనడం అమ్మడం మాత్రమే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు అమెజాన్ చాలా ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేసింది. అలాంటి ఫీచర్లలో కీలకమైంది అమెజాన్ ఆడిబుల్. దీని సాయంతో మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నచ్చిన రచయిత పుస్తకాన్ని వినొచ్చు. అంటే డ్రైవింగ్ చేస్తున్నా లేదా ఎక్సర్‌సైజ్ చేస్తున్నా లేదా ఇంకేదేమైనా పని చేస్తున్నా కూడా మనం ఈ పుస్తకాలను చదివేసుకోవచ్చు. దీనికి ఆడియో బుక్ ఫీచర్ మనకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఎక్కువమందిన ఆకర్షిస్తున్న ఫీచర్ ఇదే.
ఎలా ఉపయోగించాలి?
అమెజాన్ ఆడిబుల్‌ను ఎలా ఉపయోగించాలి? .. నిజానికి ఇది చాలా సులభమైన ప్రాసెస్. ముందుగా మీకు వ్యక్తిగతంగా ఒక అమెజాన్ అకౌంట్ కావాలి. దీని ద్వారా సైన్ ఇన్ అయితేనే ఆడిబుల్ ఫీచర్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ముందుగా అమెజాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మన ఐడీ ద్వారా లాగిన్ కావాలి. ఇదే ఐడీని మనం ఆడిబుల్ ఫీచర్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. తొలిసారి ఈ ఆప్షన్ ఉపయోగించేవాళ్లకు అమెజాన్ 30 రోజుల పాటు ఉచితంగా సేవలు అందిస్తోంది. ఈ ఉచితంగా అందించే రోజుల్లో మనం రెండు ఆడియో బుక్స్‌ను వినే అవకాశం ఉంటుంది.
ట్రయల్ మగిశాక ..
ట్రయల్ పిరియడ్ ముగిశాక మనం ఆడిబుల్ ఫీచర్‌ని ఉపయోగించుకునే అవకాశం ఉండదు. అందుకే 14.95 డాలర్లు చెల్లిస్తే మళ్లీ ఈ సర్వీసులు పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. బుక్స్‌ని కొనుక్కోవడం మాత్రమే కాక నెలకు ఒకసారి ఒక బుక్‌ను అద్దెకు ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది దీనిలో. అయితే ఆరంభంలోనే మీకు ఈ క్రెడిట్ లభించదు. మీ సర్వీసు మొదలైన దగ్గర నుంచి మీకు ఈ ఆప్షన్ లభిస్తుంది. అంటే మీరు జనవరి 10వ తేదీని జాయిన్ అయితే నెక్ట్ మంత్ 10వ తేదీని మీకు క్రెడిట్ లభిస్తుంది. ఆడిబుల్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే బుక్స్ అన్ని కేటగిరీ వైజ్‌గా డివైడ్ చేసి ఉంటాయి. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు కావాల్సిన పుస్తకాన్ని వెతుక్కోవచ్చు.