ఆన్‌లైన్‌లో మన ఫొటోలను మేనేజ్ చేసుకోవడానికి, వాటిని భద్రంగా దాచుకోవడానికి గూగుల్ ఫొటోస్‌కు మించిన ఆప్షన్ మరొకటి ఉండదు. కానీ చాలా మంది గూగుల్ ఫొటోస్ గురించి పెద్దగా పట్టించుకోరు. అసలు బ్యాక్ అప్ గురించి కూడా ఆలోచించరు. కానీ స్మార్ట్‌ఫోన్ పాడైనప్పుడో లేదా ఎవరైనా దొంగిలించినప్పుడో మన విలువైన సమాచారం గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే గూగుల్ ఫొటోస్‌తో ఉన్న ఉపయోగాల గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. ఆ ఫీచర్లను ఉపయోగించుకుంటే మనం ఎంతో లాభం పొందొచ్చు. మరి గూగుల్ ఫొటోస్‌న సంపూర్ణంగా ఎలా వాడుకోవచ్చో చూద్దాం..
ఆల్బమ్స్, బుక్స్, మూవీస్
గూగుల్ ఫొటోస్‌లో ఎన్నో వందల ఫొటోలు దాగి ఉంటాయి. వాటిని అలా వదిలేయకుండా మంచి ఆల్బమ్స్‌గా చేసుకునే అవకాశం ఉంది. మూవీస్, కాలేజెస్, యానిమేషన్స్ చేసుకోవచ్చు. దీనికి గూగుల్ అసిస్టెంట్ మీకు సాయం చేస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ఉపయోగంలో మీకెలాంటి గందరగోళం ఉండదు. ఇలా చేయాలంటే గూగుల్ ఫొటోస్ అడుగు భాగంలో ఉండే అసిస్టెంట్ మీద క్లిక్ చేయాలి. దీనిలో మీకు అవసరమైన ఆల్బమ్, ఫొటో బుక్, మూవీ, యానిమేషన్, కాలేజ్ లాంటి ఆప్షన్లు ఉంటాయి. ప్రతి ఐటమ్‌కు మీకో ప్రత్యేకమైన పేజీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
ఏం చేసుకోవచ్చంటే..
ఆల్బమ్:. ఫొటోలను కలెక్షన్‌గా చేసుకుని సులభంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు
ఫొటో బుక్స్: కస్టమ్ బుక్ ఆర్డర్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. రియల్ బుక్ ద్వారా రియల్ పిక్చర్స్ క్రియేట్ చేయచ్చు.
మూవీ: వీడియోను తయారు చేయడం. మీ ఫొటోలను ర్యాండమ్‌గా సెలక్ట్ చేసుకుని మూవీ మీద క్లిక్ చేస్తే చాలు. అవన్నీ ఒక ఆర్డర్‌లో మీకు వీడియోగా తయారవుతాయి. మీరు ఇలా ఫొటోలను ఎన్ని రకాల వీడియోలైనా చేసుకోవచ్చు. మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వొచ్చు. థీమ్ వీడియోలకు ప్రత్యేకించి కొన్ని ఫార్మాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
యానిమేషన్:. ఫొటోలన్నిటిని ఎంచుకుని వాటిని షార్ట్ స్లైడ్ షో మాదిరి క్లిప్‌లా తయారు చేసుకోవడమే ఈ యానిమేషన్.
కాలేజ్: ..తొమ్మిది ఫొటోలు ఎంచుకుని ఒకే ఇమేజ్‌లా తయారు చేయడమే ఈ కాలేజ్. వీడియో మేకింగ్‌లో ఇదో భిన్నమైన ప్రక్రియ.