ఆండ్రాయిడ్.. దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దీనిలో ఎంతో విలువైన సమాచారాన్ని పొందుపరుస్తాం. ఎన్నో ట్రాన్సాక్షన్లు చేస్తాం. అయితే వీటి వల్లే మన ఆండ్రాయిడ్ ప్రైవసీకి పెద్ద ముప్పు వచ్చి పడింది. ఎప్పుడు ఏ వైరస్ వచ్చి ఆండ్రాయిడ్‌లో చొరబడుతుందోనన్న ఆందోళన ఉంది. అందుకే చాలా కంపెనీలు తమ యాప్స్‌ను, సర్వీసులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాయి. మరి మన ఆండ్రాయిడ్ ఫోన్లో ప్రైవసీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి.
వెబ్‌ని ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయాలి
చాలా ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువగా చేసే పని ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయడం. నేరుగా బ్రౌజ్ చేయడం లేదా ఏదైనా లింక్స్ క్లిక్ చేయడం ద్వారా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం సర్వసాధారణం. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చిన లింక్స్, మెసేజింగ్ యాప్‌లు క్లిక్ చేయడం వల్ల మనం ఇంటర్నెట్లోనే ఎక్కువసేపు ఉంటాం. అయితే మీరు బ్రౌజింగ్ సైట్లు, లింక్స్, యాప్స్ ఏ మాత్రం సేఫ్ అనేది చూసుకోవాలి. ఇందుకోసం డక్‌డక్‌గో ప్రైవసీ బ్రౌజర్, గోస్ట్రీ ప్రైవసీ బ్రౌజర్, ఫైర్‌ఫాక్స్ ఫోకస్ లాంటి బ్రౌజర్లను ఉపయోగించడం ఉత్తమం.
ఎన్‌క్రిప్టెడ్ ఈమెయిల్స్
చాలామంది కమ్యూనికేషన్ కోసం వాట్సప్, ఫేస్‌బుక్ మెసెంజర్ లాంటివి వాడుతుంటారు. అయితే ఇప్పటికే ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ఇంకా చాలామంది ఈమెయిల్స్‌పైనే ఆధారపడడం. ఇప్పుడు సైబర్ దాడులకు ఈమెయిల్స్ ప్రధాన వేదికగా మారుతున్నాయి. మనం ఈమెయిల్స్ లింక్స్ క్లిక్ చేస్తే చాలు కంప్యూటర్లో సమాచారం అంతా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అందుకే పోర్షన్ మెయిల్, బ్లూ మెయిల్ లాంటి మెయిల్స్‌నే ఉపయోగిస్తే మంచిది.
ప్రైవేటు మెసేజింగ్
వాట్సప్‌కు అంటే ఎన్‌క్రిప్షన్ ఆప్షన్ ఉంది అదే వేరే మెసేజింగ్ యాప్‌లు అయితే సురక్షితం కాదు. డేటా స్కాండల్స్ ఎక్కువైన నేపథ్యంలో ఏ మెసేజింగ్ యాప్‌ను నమ్మలేం. ఈ స్థితిలో సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్, టెలిగ్రామ్ మెసెంజర్ లాంటి వాటిని ఉపయోగించడం వల్ల కూడా డేటా సెక్యూర్ ఉంచుకునే అవకాశం ఉంది.