వాట్సాప్ ఇప్పుడు అన్నింటికీ ఆధారమైపోయింది. ఫ్రెండ్స్ పంపించే మార్నింగ్ జోక్స్ నుంచి ఆఫీస్‌లో బాస్ పంపించే ఇంపార్టెంట్ నోట్స్ వరకు అన్నీ ఇప్పుడు వాట్సాప్‌లోనే. చాలా కంపెనీలు, ఆఫీస్‌లు ఉద్యోగులతో వాట్సాప్ గ్రూప్‌లు పెట్టి కంపెనీ వ్యవహారాలు ఏమున్నా ఎంప్లాయిస్‌కు వాటిలోనే షేర్ చేస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో కూడా వాట్సాప్ మంచి సమాచార వేదికగా మారింది. ఇలాంటప్పుడు ఎన్నో ఇంపార్టెంట్ మెసేజ్‌లు దానిలో ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకుంటే ఎక్కడో చోట స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే పొరపాటున ఫోన్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి లేదా పిల్లలు ఆడుతూ పొరపాటున డిలీట్ చేస్తేనే ఇంపార్టెంట్ డేటా మిస్సయ్యే ప్రమాదముంది. ఫొటోలు, వీడియోల విషయంలోనూ ఇదే పరిస్థితి
ఎదురవ్వచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ డేటాను ఎప్పటికప్పుడు ఆటోమేటిగ్గా బ్యాకప్ తీసుకోవడానికి సెట్టింగ్స్‌లోనే ఆప్షన్ ఉంది.అలాకాకుండా గూగుల్ డ్రైవ్‌లో సేవ్‌చేసుకోవచ్చు. ఈ మెయిల్ ద్వారా ఆ డేటాను ఎవరికైనా మెయిల్ చేయొచ్చుకూడా.
వాట్సాప్ చాట్‌ను గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేయడం
1. వాట్సాప్ ఓపెన్ చేసి Settings > Chats > Chat backupలోకి వెళ్లండి. ఇది మీ చాట్‌ను వెంటనే బ్యాకప్ తీస్తుంది. అయితే ఇలా బ్యాకప్ తీసిన డేటా మీ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోనే సేవ్ అవుతుంది. మీ ఫోన్‌కు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫ్యాక్టరీ రీస్టోర్ కొడితే ఈ డేటా అంతా పోయినట్లే.
2. ఇలాంటి పరిస్థితుల్లో మీ డేటాను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకోవడం బెటర్. చాట్ బ్యాకప్‌లోనే బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బ్యాకప్ డేటా నేరుగా మీ గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అవుతుంది. ఇప్పటికే గూగుల్ అకౌంట్ లేకపోతే Add account ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. నెట్‌వర్క్ ప్రిఫరెన్స్ దగ్గర cellular or Wi-Fi అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని Wi-Fiలోకి మార్చుకుంటే ఒకవేళ డేటా ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఉండదు. లేదంటే మీకు తెలియకుండానే మొబైల్ డేటా ఖర్చయిపోతుంది
వాట్సాప్ చాట్స్‌ను ఈమెయిల్ ద్వారా సేవ్ చేయడం
ఈ పద్ధతిలో మీరు ఇండివిడ్యువల్‌గా చాట్స్‌ను సేవ్‌చేయాలి. మీరు సేవ్ చేయాలనుకుంటున్న వాట్సాప్ చాట్‌లోకి వెళ్లి టాప్‌లో కుడివైపున్న మూడు డాట్స్‌ను క్లిక్ చేస్తే Moreఅనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న Email chatను సెలెక్ట్‌చేస్తే మీ డేటా మెయిల్ ద్వారా వేరే ఎవరికైనా పపించుకోవచ్చు. చాట్స్ మాత్రమే కాదు అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా కావాలంటే Attach Mediaను క్లిక్ చేయాలి.
విండోస్ ఫోన్ యూజర్లకు
విండోస్ ఫోన్ యూజర్లకు కూడా ఛాన్స్
విండోస్ ఫోన్ యూజర్లు కూడా తమ వాట్సాప్ చాట్ హిస్టరీని మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవచ్చు.
1. విండోస్ 8.1 ఆ తర్వాత వచ్చిన ఫోన్లకు మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. అంతేకాదు ఈ ఫోన్‌కు వన్‌డ్రైవ్‌తో సైన్ అన్ అయి ఉండాలి.
2. వాట్సాప్ ఓపెన్‌చేసి more ఆప్షన్ క్లిక్ చేసి icon > settings > chats and calls > backupలోకి వెళ్లాలి. వీడియోలు కూడా బ్యాకప్ తీయాలా లేదా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాకప్ ఎన్నాళ్లకు ఒకసారి తీయాలనే ఫ్రీక్వెన్సీ, వైఫై లేదా మొబైల్ డేటా ద్వారా బ్యాకప్ తీయాలా అనే ప్రిఫరెన్స్‌లు సెలెక్ట్ చేసుకోవాలి.
3. మీరు ఒకవేళ మాన్యువల్‌గా బ్యాకప్ తీసుకోవాలంటే more ఆప్షన్ క్లిక్ చేసి icon > settings > chats and calls > backupలోకి వెళ్లాలి. అప్పుడు మీ డేటా ఫోన్ ఇంటర్నల్ మెమరీలో స్టోర్ అవుతుంది. కావాలంటే అక్కడి నుంచి వన్‌డ్రైవ్‌కు పంపుకోవచ్చు.