రిలయన్స్ జియో ‘మై వోచర్స్’ పేరిట ‘మై జియో’ యాప్‌లో వినియోగదారులకు ఒక ఆప్షన్ ఇచ్చింది. దీనిద్వారా మీరు బ్యాలన్స్ వోచర్‌ను కొనుగోలు చేయొచ్చు. అలాగే బదిలీ లేదా రీచార్జి కోసం లేదా మీ స్నేహితులకు బహూకరించడానికి ఆ వోచర్లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు వోచర్ కోడ్‌ను ఏ సమయంలోనైనా చూసుకోవచ్చు. అలాగే సుదీర్ఘ కాలంలో ఎప్పుడైనా ఆ వోచర్లను వాడుకునే సౌకర్యం కల్పిస్తూ వాటిని మై జియో యాప్ ఖాతాలో స్థిరంగా స్టోర్ చేస్తుంది.
‘మై వోచర్స్’ను వినియోగించుకోవడం ఎలా?
జియో మినహా మరే టెలికాం ఆపరేటర్ తమ నెట్‌వర్క్ ఖాతాదారులకు ఇలాంటి సదుపాయాన్ని కల్పించలేదు. దీన్ని వినియోగించుకునే కొన్ని పద్ధతులేమిటో చూద్దాం... ఇప్పుడు జియో రూ.98, 149 ప్లాన్ల రీచార్జి కోసం కూడా రూ.50 వోచర్‌ను వాడుకునే కొత్త ట్రిక్ ఇది... ఇందుకోసం ఏం చేయాలంటే:- మై జియోలో My Vouchers సెక్షన్లోకి వెళ్లి Buy ఆప్షన్‌మీద క్లిక్ చేయాలి. తర్వాత డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయిన రూ.399 లేదా రూ.98 లేదా రూ.149 ప్లాన్లలో ఒకదాన్ని, రూ.11 ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి (రూ.11 ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడం ముఖ్యం). అటుపైన Proceedపై క్లిక్ చేసి మీ వోచర్‌ను వినియోగించాలి. దీంతో మీ ప్లాన్‌పై మీకు రూ.50 డిస్కౌంట్ వచ్చినట్లు స్క్రీన్‌పై కనిపిస్తుంది. తర్వాత ఏదైనా ఆన్‌లైన్ పేమెంట్ పద్ధతి (జియో మనీ, పేటీఎం, క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్‌బ్యాంకింగ్)లో చెల్లించాలి. మీ వోచర్ వెంటనే ప్లాన్‌లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు View మీద, అటుపైన Redeem మీద క్లిక్ చేయాలి.
మై వోచర్స్ నుంచి కొనుగోలు ఎలా?
మై జియో యాప్‌ను ఓపెన్ చేసి మీ జియో మొబైల్ నంబరుతో లాగిన్ కావాలి. మెనూ మీద క్లిక్ చేస్తే మీకు My Plansకు ఎగువన “My Vouchers” ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ వోచర్ వివరాలు కనిపిస్తాయి. తర్వాత Buy ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీరు కోరుకున్న ప్లాన్‌ను సెలెక్ట్ చేయాలి. అక్కడ మీ వోచర్‌ను వాడుకుంటే డిస్కౌంట్ వస్తుంది. తర్వాత ఏదైనా ఆన్‌లైన్ పద్ధతిలో చెల్లింపు చేయడమే తరువాయి!
మై వోచర్స్ కోడ్‌ను చూడటం ఎలా?
ఈ ఫీచర్‌లోని View ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత మీకు అందుబాటులో ఉన్న వోచర్ కోడ్స్ కనిపిస్తాయి. తదుపరి రీచార్జి కోసం లేదా మీ స్నేహితులకు బదిలీ కోసం వీటిని వాడుకోవచ్చు. ఒకవేళ మీకెవరైనా వోచర్‌ను బహూకరించి ఉన్నా View ఆప్షన్‌లో అవి కనిపిస్తాయి.
మై వోచర్‌ద్వారా బ్యాలన్స్ బదిలీ (గిఫ్ట్) ఎలా?
మీరు కోడ్స్‌ను కొనుగోలుచేసి ఉండి, వాటిని మీ స్నేహితులకు బహూకరించదలిస్తే కింది పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌లో కనిపించే Transfer ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ స్నేహితుడి జియో నంబరును ఎంటర్ చేసి, వోచర్ విలువను కూడా ఎంటర్ చేయండి. తర్వాత ట్రాన్స్‌ఫర్‌పై క్లిక్ చేస్తే తక్షణం మీ ఖాతా నుంచి బదిలీ.. తగ్గింపు ప్రక్రియలు పూర్తయిపోతాయి.
రీచార్జి కోసం వోచర్లు రిడీమ్ చేసుకోవడం ఎలా?
ముందుగా పైన చెప్పిన పద్ధతిలో కొనుగోలు చేయాలి. తర్వాత View ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ మీకు Redeem ఆప్షన్ కనిపిస్తుంది. అటుపైన ప్రొసీడ్ బటన్‌పై క్లిక్ చేస్తే, మీ రీచార్జి వెంటనే ప్రాసెస్ అయిపోతుంది.
మై జియో వోచర్స్ హిస్టరీ చూసుకోవడం ఎలా?
హిస్టరీ ఆప్షన్‌లో మీ లావాదేవీలన్నిటినీ పరిశీలించుకోవచ్చు... మీరు ఎంత మొత్తానికి, ఎప్పుడు వోచర్ కొనుగోలు చేశారు... మీరెప్పుడు బదిలీ చేశారు వగైరా ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. అప్పుడు ‘ఆప్షన్’పై క్లిక్ చేసి, Old Details పరిశీలన కోసం దిగువకు స్క్రోల్ చేయండి.