• తాజా వార్తలు

ఫోటోలు అమ్మి డ‌బ్బులు సంపాదించ‌డానికి సింపుల్ గైడ్‌

ఫోటోలు తీయ‌డం మీ హాబీయా?  అయితే మీరు స‌ర‌దాగా తీసే ఫోటోలు కూడా మీకు డ‌బ్బులు సంపాదించి పెడ‌తాయి తెలుసా.  మీ ఫోటోల‌కు డ‌బ్బులు చెల్లించే యాప్స్, వైబ్‌సైట్లు చాలా ఉన్నాయి. వాటిలో ది బెస్ట్ ఏమిటో తెలియ‌జెప్పే సింపుల్ గైడ్ మీకోసం.. 

బ్లూమెల‌న్ (Bluemelon)
ఫోటోలు అమ్మి డ‌బ్బులు సంపాదించుకునేవాళ్ల‌కు ఇది బెస్ట్ యాప్‌. దీంతో మీరు కొంత డ‌బ్బులు సంపాదించుకోవ‌డ‌మే కాదు అఫిలియేట్ నెట్‌వ‌ర్కింగ్‌తో మరింత ఎక్స్‌ట్రా ఇన్‌క‌మ్ కూడా పొంద‌వ‌చ్చు.  మీ ఫోటోలు సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా షేర్ చేయ‌డానికి బ్లూ మెల‌న్ మంచి ఛాయిస్‌. 
ఫీచ‌ర్లు 
* బ్లూమెల‌న్ వెబ్‌సైట్లోకి వెళ్లి సైన్ అప్ అయి ఫోటోల‌ను, వీడియోల‌ను ఈజీగా షేర్ చేయొచ్చు.  అప్‌లోడ్ ప్రాసెస్ చాలా సులువు. 
* మీ ఫోటోల‌కు బ్రాండింగ్ ఇస్తుంది. ఫుల్ ప‌ర్స‌న‌ల్ పోర్ట్ ఫోలియో త‌యారుచేసుకోవ‌చ్చు. 
* మీ కంటెంట్‌కు మంచి ప్రొటెక్ష‌న్ ఉంటుంది కాబ‌ట్టి ఎలాంటి అనుమానం లేకుండా మీ ఫోటోల‌ను షేర్ చేసుకోవ‌చ్చు. 
* ఫోటోల‌ను సులువుగా మార్కెట్ చేసుకోవ‌చ్చు. 
* మీ ఫోటోలు చూసిన విజిట‌ర్స్‌తో క‌నెక్ట్ కావ‌చ్చు. 
క‌మీష‌న్ తీసుకోదు. 
 మిగిలిన అన్ని వెబ్‌సైట్ల‌తో పోల్చితే నామ‌మాత్ర‌పు యాన్యువ‌ల్ ఫీజ్ మాత్రం ఉంటుంది. మీ ఫోటోలు న‌చ్చి ఎవ‌రికైనా కొనుక్కుంటే  బ్లూమెల‌న్ ఎలాంటి క‌మీష‌న్ తీసుకోదు. క్ల‌యింట్స్ ద‌గ్గ‌ర నుంచి పేవాల్ 2చెక్ అకౌంట్లోకి నేరుగా మ‌నీ వ‌చ్చేస్తుంది. 
మైన‌స్ పాయంట్స్‌
* బ్లూమెల‌న్‌లో ఫోటోల‌ను ప్రింట్ తీసుకునే ఆప్ష‌న్ లేదు. కేవలం డౌన్‌లోడ్ మాత్ర‌మే చేయ‌గలం. 
* మిగిలిన వాటితో పోల్చుకుంటే థీమ్స్, క‌స్ట‌మైజేష‌న్లు త‌క్కువ‌. 

2. ట్వంటీ 20 (Twenty20)
ఆన్‌లైన్‌లో ఫోటోలు అమ్మి డ‌బ్బులు సంపాదించుకోవ‌డానికి మంచి వెబ్‌సైట్‌. ట్వంటీ 20. దీనికి గ‌తంలో ఇన్‌స్టాకాన్వాస్ అనే పేరుండేది. అప్ప‌ట్లో ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల‌తో గ్యాల‌రీ క్రియేట్ చేస్తే వాటిని అమ్ముకోవ‌డానికి వీలుండేది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలే కాదు మీరు తీసిన ఏ ఫోటోన‌యినా దీనిలో అమ్ముకోవ‌చ్చు. అయితే మీ ఫోటోను కొంత‌మంది ఎడిట‌ర్ల గ్రూప్ చెక్ చేస్తుంది. వాళ్లు ఎక్స్‌పెక్ట్ చేసినంత మినిమం క్వాలిటీ ఉంటేనే తీసుకుంటారు.  ఈ వెబ్‌సైట్ ఫోటోగ్ర‌ఫిక్ ఛాలెంజ్‌లు కూడా నిర్వ‌హిస్తుంది. 
ఎంత సంపాదించ‌వ‌చ్చు?
ట్వంటీ 20 వెబ్‌సైట్‌లో మీరు స‌బ్‌స్క్రిప్ష‌న్ ప్లాన్ తీసుకుంటే ఫోటో అమ్మిన‌దానిలో 40% మీకు ఇస్తారు. అదే సింగిల్ ఫోటో సేల్ అయితే 32% ఇస్తారు. పేమెంట్స్ అన్నీ పేపాల్ ద్వారానే జ‌రుగుతాయి. 

3. షట్ట‌ర్ స్టాక్ (Shutterstock)
ఇంట‌ర్నెట్‌లో ఫోటోలు సెర్చ్ చేసేవాళ్లంద‌రికీ తెలిసిన పేరు ష‌ట్ట‌ర్ స్టాక్‌. దీనిలో నుంచి మ‌నం ఫొటో డౌన్‌లోడ్ చేసుకుంటే సైట్‌కు డ‌బ్బులు క‌ట్టాలి. అంతేకాదు దీనిలో మీ ఫోటోలు అప్‌లోడ్ చేసి డ‌బ్బులు సంపాదించవచ్చు.
* మీ ఫోటోలు, వీడియోలు, వెక్టార్ డిజైన్లు కూడా ఇందులో అప్‌లోడ్ చేసి డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు. 
* షట్ట‌ర్‌స్టాక్‌లో కంటెంట్ రైట‌ర్ల కోసం ఓ బ్లాగ్ కూడా ఉంది. మంచి ఫోటోలు ఎలా తీయాలి? ఎడిటింగ్ ఎలా చేయాలి. కొత్త టెక్నిక్‌లు, థీమ్‌ల గురించి ఇందులో రాసి డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు. 
* ఫోటోగ్రాఫ‌ర్లు త‌మ అనుభ‌వాల‌ను వేరేవాళ్ల‌తో పంచుకోవ‌డానికి ఓ ఫోరం కూడా ఉంది. 
ఎంత సంపాదించ‌వ‌చ్చు? 
ఫోటోల అమ్మిన రేటులో 30% వ‌ర‌కు మీకు వ‌స్తుంది. పాతిక సెంట్లు అంటే డాల‌ర్‌లో నాలుగో వంతు నుంచి 120 డాల‌ర్ల వ‌ర‌కు సంపాదించుకోవ‌చ్చు. అంటే ర‌ఫ్‌గా 20 రూపాయ‌ల నుంచి 8,400 వ‌ర‌కు ఒక్కో ఫోటోకు సంపాదించుకునే అవ‌కాశం ఉంది. 

4. డిపాజిట్ ఫోటోస్ (DepositPhotos) 
ఇది కూడా షట్ట‌ర్‌స్టాక్‌లాంటి స‌ర్వీసే. దీనిలో యూజ‌ర్లు త‌మ సొంత అకౌంట్ క్రియేట్ చేసుకుని దానిలో త‌మ సొంతంగా తీసిన ఫోటోలు పెట్టి డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చు. 
* మీ ఫోటోలు, వీడియోలు, వెక్టార్ డిజైన్లు కూడా ఇందులో అప్‌లోడ్ చేయొచ్చు. ఇవి డిపాజిట్ ఫోటోస్ యూజ‌ర్లంద‌రికీ అందుబాటులో ఉంటాయి. వీటిని ఎవ‌రైనా వాడుకుంటే మీకు  డ‌బ్బులు చెల్లించాలి. అయితే ఇది జ‌ర‌గాలంటే మీ ఫోటోలు కొన్ని క్వాలిటీ చెక్స్ టెస్ట్‌లో పాస్ కావాలి. 
ఎంత సంపాదించ‌వ‌చ్చు? 
డిమాండ్‌ను బ‌ట్టి ఫోటోల అమ్మిన రేటులో 34% నుంచి 42% వ‌ర‌కు మీకు వ‌స్తుంది.  కొన్ని ఫోటోల‌కు 30 నుంచి 35 సెంట్లు ఫిక్స్‌డ్ ప్రైస్ ఉంటుంది. 

5. ఐస్టాక్ ఫోటో (IStockPhoto)
2000వ సంవ‌త్స‌రంలో దీన్ని ప్రారంభించారు. ఇది ఒక ఫ్రీ ఫోటో ఎక్స్చేంజ్ వెబ్‌సైట్‌. దీనిలో ఫోటోగ్రాఫ‌ర్లు త‌మ ఫోటోలు పెడితే వాటిని కావాల్సిన‌వాళ్లు కొనుక్కుంటారు. మీడియా సంస్థ‌లు  ఐస్టాక్ ఫోటోను ఎక్కువ‌గా వాడ‌తాయి. 
* మీ ఫోటోలు, వీడియోలు, ఇల్లుస్ట్రేష‌న్లు కూడా ఇందులో అప్‌లోడ్ చేయొచ్చు. వీటిని ఎవ‌రైనా వాడుకుంటే మీకు  డ‌బ్బులు చెల్లించాలి. అయితే ఇది జ‌ర‌గాలంటే మీ ఫోటోలు కొన్ని క్వాలిటీ చెక్స్ టెస్ట్‌లో పాస్ కావాలి. 
ఎంత సంపాదించ‌వ‌చ్చు? 
ఫోటోల అమ్మిన రేటులో 15% నుంచి 20% వ‌ర‌కు మీకు వ‌స్తుంది. అయితే మీరు ఎక్స్‌క్లూజివ్‌గా ఐస్టాక్ ఫోటోస్‌కే ప‌ని చేస్తుంటే 25% నుంచి 45% వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. 

జన రంజకమైన వార్తలు