• తాజా వార్తలు

సెల్‌ఫోన్ నుంచి మీ బ్రెయిడ్ డైవ‌ర్ట్ చేయ‌డానికి వ‌న్ అండ్ వోన్లీ గైడ్‌

సెల్‌ఫోన్‌.. ఇది లేనిది మ‌నిషికి రోజు గ‌డ‌వ‌దు. ఎక్క‌డున్నా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. ప‌డుకున్నా.. తింటున్నా.. ప‌ని చేస్తున్నా ఫోన్ మాత్రం ప‌క్క‌న ఉండాల్సిందే. సెల్‌ఫోన్‌కు అడిక్ట్ అయిపోయిన వాళ్లు కోట్ల‌లోనే ఉన్నారు. ఎందుకంటే ఇదో ప్ర‌పంచం. ఇది చేతిలో ఉంటే మ‌నకి ప్ర‌పంచంతో ప‌ని లేదు. అయితే సెల్‌ఫోన్‌లు మ‌నిషిని యాంత్రికంగా మార్చేయ‌డం.. మ‌న స‌మ‌యాన్ని, ఆరోగ్యాన్ని కూడా మింగేయ‌డ‌మే ఇక్క‌డ అతి పెద్ద స‌మ‌స్య. మ‌రి సెల్‌ఫోన్ నుంచి మ‌న బ్రెయిన్‌ను డైవ‌ర్ట్ చేయ‌డం ఎలా?

సెల్‌ఫోన్‌కు మ‌నం బానిస‌లుగా మారుతున్నాం అంటే ఎందుకు మారుతున్నాం అనే ప్ర‌శ్న వేసుకోవాలి. అంత‌గా ఫోన్‌కు అడిక్ట్ కావాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది. మ‌నం ఫోన్‌కు అతుక్కుపోయి ఉండేలా చాలా కంపెనీలు మ‌న వెనుక ప‌ని చేస్తున్నాయ‌న్న సంగ‌తి మీకు తెలుసా? అన్నిటికన్నా ముఖ్యంగా యాప్ కంపెనీలు మ‌న‌కు న‌చ్చిన‌, మనం మెచ్చే అంశాల‌తోనే యాప్‌ల‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నాయి. దీంతో ఆటోమెటిక్‌గా మ‌న‌కు తెలియ‌కుండానే ఈ యాప్‌ల మాయ‌లో ప‌డిపోతున్నాం. ఫేస్‌బుక్‌, స్నాప్‌చాట్‌, వాట్స‌ప్ లాంటివి ఈ కోవ‌కే చెందుతాయి.  దీని వ‌ల్ల ఎన్నో  ప‌ని గంట‌లు వృథా అవుతున్నాయి. మ‌న క‌ళ్లు స్ర్టెస్ అవుతున్నాయి. ఇప్పుడు గేమ్‌లు కూడా వ‌చ్చేశాయి. ప‌బ్జీ అనే గేమ్ కోసం యూత్ పిచ్చేక్కిపోతోంది  గంట‌లు గంట‌లు ఫోన్‌లోనే ఉంటుంది. ఇవ‌న్నీ గేమ్ డెవ‌ల‌ప‌ర్స్ ట్రిక్స్‌లో భాగ‌మే. ఇక టిక్ టాక్ గురించి చెప్ప‌క్క‌ర్లేదు. చిన్నా పెద్దా ముస‌లి.. ముత‌కా అంద‌రూ ఇందులోనే గ‌డుపుతున్నారు.

అయితే మ‌నం ఫోన్‌కు అతుక్కుపోకుండా చేయ‌డానికి కొన్ని సాఫ్ట్‌వేర్‌లు కూడా ఉన్నాయి. మ‌న‌ల్ని హెచ్చ‌రించే టెక్నాల‌జీ కూడా అందుబాటులోకి వ‌చ్చింది. ఆ కోవ‌కు చెందిందే హ్యాచ్‌. ఈ సాఫ్ట్‌వేర్ మ‌న ఫోన్‌లో వేసుకుంటే చాలు మ‌న బ్రెయిన్‌కు స్ట్రెయిన్ ఎక్కువ అయిన‌ప్పుడు వెంట‌నే ఒక పాప‌ప్ మెసేజ్ ద్వారా హెచ్చ‌రిస్తుంది. అంటే మీరు కంటెంట్ మీద ఫోక‌స్ చేయలేక‌పోవ‌డాన్ని గుర్తించి వెంట‌నే మ‌న‌కు మెసేజ్ పంపిస్తుంది. ఇందు కోసం మ‌నం ముందుగా టైమ్ సెట్ చేసుకోవాలి.  ఇదొక్క‌టే కాదు మ‌న‌ల్ని మ‌నం మెంట‌ల్‌గా ఫిక్స్ చేసుకుంటే ఈ ఫోన్ జాడ్యం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. స్నేహితుల్ని నేరుగా క‌ల‌వ‌డం.. వారితో ఎక్కువ‌సేపు మాట్లాడ‌డం ద్వారా కూడా ఫోన్ పిచ్చి నుంచి కొంతైనా బ‌య‌ట‌ప‌డొచ్చు. 

జన రంజకమైన వార్తలు