• తాజా వార్తలు

స్మార్ట్‌ఫోన్‌లో ఐపీ రేటింగ్స్ అంటే ఏమిటో తెలుసా?

ఈ రోజుల్లో ఏ సెల్‌ఫోన్ కంపెనీ అయినా స‌రే త‌మ ఫోన్ ఇంత గొప్ప అంటే ఇంత గొప్ప అని బాగా డ‌బ్బా కొట్టుకుంటున్నాయి. త‌మ ఫోన్ ఇచ్చినంత‌గా ప్రొటెక్షన్ మ‌రే ఫోనూ ఇవ్వ‌దంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించుకుంటున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇదే బాట‌లో న‌డ‌స్తున్నాయి. మ‌రి వేలు పోసి కొంటున్న మ‌న స్మార్ట్‌ఫోన్లు నిజంగా ఎంత‌వ‌ర‌కు సేఫ్‌? అయితే యాపిల్‌, శాంసంగ్ లాంటి కంపెనీలు ఐపీ రేటింగ్స్ పెంచుకోవ‌డం ద్వారా త‌మ డివైజ్‌లు చాలా సుర‌క్షితం అనే ఆలోచ‌న వినియోగ‌దారుల‌కు క‌ల్పించేలా చేస్తున్నాయి. మ‌రి స్మార్ట్‌ఫోన్ల‌లో ఐపీ రేటింగ్స్ ఏమిటో మీకు తెలుసా?

ఏంటి ఐపీ రేటింగ్‌?
ఐపీ అంటే ఇంగ్రెస్ ప్రొటెక్ష‌న్ అని అర్ధం. సెల్‌ఫోన్లు మ‌న‌కు ఎంత వ‌ర‌కు ప్రొటెక్ష‌న్ ఇస్తున్నాయో చెప్ప‌డానికి నిర్దేశించిందే ఈ ఐపీ రేటింగ్‌. అంటే ఈ ఫోన్లు దుమ్ము, నీళ్లు, అగ్ని లాంటి కార‌కాలు త‌ట్టుకొని ఎంత వ‌ర‌కు నిల‌బ‌డ‌గ‌ల‌వు అనే విషయాల‌ను ఐపీ రేటింగ్స్ చెబుతాయి. ఈ రేటింగ్స్‌ను బ‌ట్టి ఫ‌లానా ఫోన్ ప‌రిస్థితి ఏంటో.. వాటిలో ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకోవ‌చ్చు.  దీనిని బ‌ట్టి మ‌నం మ‌న డివైజ్‌ను ఎలా కాపాడుకోవాలో తెలుసుకునే అవ‌కాశం ఉంది. యాపిల్ కంపెనీ త‌న ఐఫోన్ ఎక్స్ఆర్‌ను ఐపీ67 రేటింగ్‌తో విడుద‌ల చేసింది. అంటే ఇది చాలా హై స్టాండ‌ర్డ్ రేటింగ్‌. అందుకే విలువ కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది. 

ఎలా తెలుసుకోవ‌చ్చు
ప్ర‌తి స్మార్ట్‌ఫోన్ ఆల్‌మోస్ట్ ఐపీ రేటింగ్స్‌తో వ‌స్తున్నాయిపుడు. ఐతే వీటిలో ఏది బెస్ట్ అని తెలుసుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే. ముందుగా మ‌నం వీటికి వాడే కోడ్‌ల‌ను గుర్తుంచుకుంటే మంచి ఐపీ రేటింగ్ ఫోన్ల‌ను క‌నిపెట్ట‌డం అంత క‌ష్టం కాదు. ఉదాహ‌ర‌ణ‌కు ఐపీ 68 అని ఉంటే ఐపీ త‌ర్వాత వచ్చే తొలి అంకె సాలిడ్ అబ్జెక్ట్‌ల నుంచి లెవ‌ల్ ఆఫ్ ప్రొటెక్ష‌న్‌కు గుర్తు. దీన్ని 1 నుంచి 6 వ‌ర‌కు ఎలా అయినా రేట్ చేయ‌చ్చు. రెండో డిజిట్ మీకు లెవ‌ల్ ఆఫ్ లిక్విడ్స్‌కు గుర్తు. దీన్ని 1 నుంచి 9 వ‌ర‌కు రేట్ చేస్తారు. దీన్ని బ‌ట్టి మీరు మీకు కావాల్సిన ఐపీ రేటింగ్ ఉన్న ఫోన్‌ను ఎంచుకునే అవ‌కాశం ఉంది. 

జన రంజకమైన వార్తలు