• తాజా వార్తలు

షియోమీ ఫోన్‌లో యాడ్స్ అంతు చూడటానికి A-Zగైడ్

చిరాకు తెప్పించే యాడ్స్ ను వదిలించుకోవాలంటే ఏం చేయాలి. ముఖ్యంగా షియోమీ ఫోన్లలో యాడ్స్ చికాకు పెట్టిస్తుంటాయి. ఎంఐ యాప్స్ లో వందలకొద్దీ యాడ్స్ వస్తూ...చిరాకు తెప్పిస్తుంటాయి. ఈ యాడ్స్ బెడదను నియంత్రించాలంటే....ఫోన్ను ఎలా వాడుకోవాలో తెలిపే మార్గాలు చాలా ఉన్నాయి. అవేమిటో చూద్దాం. 
యాడ్స్ ఎలా తొలగించాలి...
ముందుగా సెట్టింగ్స్ కు వెళ్లండి. అందులో అడిషనల్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. దానికి కనిపించే ఆథరైజేషన్ అండ్ రీవొకేషన్ ఆప్షన్ను సెలక్ట్ చేసి msaను డిజేబుల్ చేయండి. ఇది ఒకేసారి డిజేబుల్ కాదు. రెండు లేదా మూడు సార్లు ప్రయత్నిస్తే డిజేబుల్ అవుతుంది. 
1.షియోమీ ఫోన్ MIUI10తో రన్నింగ్ అవుతున్నట్లయితే ఇంటర్నెట్ కు కనెక్ట్ చేసినట్లు నిర్థారించుకోండి. మీరు ఆఫ్ లైన్ ద్వారా రివోక్ చేయలేరు. 
2.సెట్టింగ్స్>అడిషనల్ సెట్టింగ్స్< ఆథరైజేషన్& రీవొకేషన్> ఆఫ్ సెట్ msa. 
3.ఇప్పుడు మీరు రివోక్ చేసే ముందు 10 సెకన్లు వేచి ఉండాలి. 
4.ఒకసారి మీరు నొక్కినట్లయితే...మీకు కావాల్సిన మెసేజ్ ను చూస్తారు. 
5.ఈ పర్మిషన్ ను క్యాన్సల్ చేయడానికి ఇలానే మూడు నాలుగు సార్లు మెసేజ్ వస్తుంటుంది. 
6.మీరు సక్సెస్ అయ్యేంతవరకు ప్రయత్నిస్తూనే ఉండండి
7.తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి అడిషనల్ సెట్టింగ్స్ లో ప్రైవసీ లో యాడ్స్ సర్వీసు అని ఉంటుంది. దానిని ఆఫ్ చేయండి. 
ఫైల్ మేనేజర్ నుంచి యాడ్స్ ఎలా తొలగించాలి....
1.ఎంఐ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి.
2.లెఫ్ట్ సైడ్ ఉన్న హంబర్గర్ ఐకాన్ను నొక్కండి
3.దాన్ని గురించి తెలుసుకోండి
4.యాప్ కు మారేందుకు రెకమండేషన్స్ పై నొక్కండి. 
5. యాప్ ఫోల్డర్లను కలిగి ఉన్నట్లయితే...ఫోల్డర్ యొక్క పేరుపై ప్రెస్ చేయండి. తర్వాత ప్రమోట్ చేసిన యాప్స్ ను స్టాప్ చేయండి. miuiఫోల్డర్లలో చూపించే ప్రొమేటెడ్ యాప్స్ ను డిజాబుల్ చేస్తుంది. 
miuiనుంచి యాడ్స్ తొలగించాలంటే....
1. miui క్లీనర్ ఓపెన్ చేయండి. 
2. రైట్ సైడ్ ఉన్న బ్రష్ ఐకాన్ పై నొక్కండి. 
3.ఇప్పుడు గేర్ ఐకాన్ పై ప్రెస్ చేయండి
4. యాప్ కు మాడానికి రెకమండెషన్స్ ను యాక్సెప్ట్ చేయండి. 
miవీడియో నుంచి యాడ్స్ ఎలా తొలగించాలి....
1. ఎంఐ వీడియోను ఓపెన్ చేయండి
2. రైట్ సైడ్ ఉన్న అకౌంట్ ను నొక్కండి
3.ఆఫ్ లైన్ సిఫార్సులను ఆఫ్ చేయండి.ఇప్పుడు ప్రొమేషనల్ యాడ్స్ డిజేబుల్ చేస్తుంది. 
4.ఫుష్ నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి
ఎంఐ ఫోన్లలో చాలావరకు యాడ్స్ ప్రదర్శించేది డిఫాల్ట్ miuiబ్రౌజరే. కనుక మీరు ముందుగా బ్రౌజర్ సెట్టింగ్స్ లోకి వెళ్లి...అక్కడ అడ్వాన్స్డ్ కింద ఉన్న టాప్ సైట్స్ ఆర్డర్ లో కూడా రిసివ్ రెకమండేషన్స్ ను డిజేబుల్ చేయాలి. 
డౌన్ లోడ్స్ యాప్ ను ఓపెన్ చేసి, సెట్టింగ్స్ లోకి వెళ్లి షో రెకమండేషన్స్ కంటెంట్ ను డి సెలక్ట్ చేయాలి.
ఇక చివరిగా మీరు ఫోన్ను వినియోగించే తీరు ఆధారంగా యాడ్స్ ట్రాక్ పనిపట్టాలి. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి వరుసగా అడిషనల్ సెట్టింగ్స్, ప్రైవసీ, యాడ్ సర్వీసులోకి వెళ్లాలి. అక్కడ కనిపించే పర్సనలైజ్డ్ యాడ్ రెకమండేషన్స్ ను డిజేబుల్ చేయాలి. ఇలా చేసినట్లయితే మీరు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాక..ఫోన్ను రీబూట్ చేయండి. ఇలా చేస్తే యాడ్స్ బాధ తప్పుతుంది. 

జన రంజకమైన వార్తలు