స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వాళ్లకు గూగుల్ ప్లే స్టోర్ గురించి పరిచయం చేయక్కర్లేదు. మనకు ఏ యాప్ కావాలన్నా వెంటనే గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి వెతుకుతాం. మన యాప్‌లను అప్‌డేట్ చేయాలన్నా ప్లేస్టోర్ ఓపెన్ చేసి అప్‌డేట్ చేస్తాం. మరి గూగుల్ ప్లే స్టోర్‌నే అప్‌డేట్ చేయాలంటే ఏం చేయాలి? .. దీనికి మూడు మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ప్లే స్టోర్ సెట్టింగ్స్ నుంచి...
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉండే యాప్‌ల అప్‌డేట్ వివరాలు మనకు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. మీకు ఏ అప్‌డేట్ కావాలన్నా ప్లేస్టోర్ సెట్టింగ్స్‌లోకి వెళితే సరిపోతుంది. అందుకోసం కొన్ని స్టెప్స్ పాటించాల్సి ఉంటుంది.
1. మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న త్రి బార్ హారిజాంటల్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత సెట్టింగ్స్‌మీద క్లిక్ చేయాలి.
2. సెట్టింగ్స్ పేజీ మీద స్క్రోల్ డోన్ చేసుకుంటూ వెళితే మీకు ప్లే స్టోర్ వెర్షన్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయాలి. ఏదైనా ఏదైనా అప్‌డేట్ ఉంటే మీకు అక్కడే తెలిసిపోతుంది. ప్లేస్టోర్ ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అయిపోతుంది. మీకు గూగుల్ ప్లే స్టోర్ అప్ టు డేట్ అనే మెసేజ్ కూడా కనిపిస్తుంది.
ప్లేస్టోర్ డేటాను క్లియర్ చేయడం..
ప్లే స్టోర్ ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అయ్యేలా చేయడానికి మరో మార్గం డేటాను క్లియర్ చేయడం. ఇలా చేయడం వల్ల గూగుల్ ఆటోమెటిక్‌గా లేటెస్ట్ అప్‌డేట్ ఉన్న ప్లేస్టోర్ మీ డివైజ్‌లో ఉండేలా చూస్తుంది. ఇందుకోసం మీరు రెండు స్టెప్స్ వేయాలి
1. క్విక్ మెనూ నుంచి డివైజ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి
2. ఆ తర్వాత యాప్స్, అప్లికేషన్ మేనేజర్, ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఆప్షన్ల మీద క్లిక్ చేసుకుంటూ ముందుకెళ్లాలి. యాప్స్ అన్నిటికింద గూగుల్ ప్లే స్టోర్ అని కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయాలి.
3. గూగుల్ ప్లే స్టోర్‌లో యాప్ ఇన్ఫో అని ఉంటుంది. ఆ తర్వాత గూగుల్ స్టోరేజ్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్టోరేజ్ స్క్రీన్‌లో హిట్ క్లియర్ స్టోరేజ్ ..లేదా క్లియర్ డేటా మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ డివైజ్‌ను రీస్టార్ చేసి 2 నుంచి 3 నిమిషాలు వెయిట్ చేయాలి. మీ ప్లే స్టోర్ ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అయిపోతుంది.
ఏపీకేను ఉపయోగించి..
మీకు పైన చెప్పిన రెండు పద్ధతుల్లో సరైన ఫలితం రాకపోతే.. లేటెస్ట్ ప్లే స్టోర్ ఏపీకేను ఇన్‌స్టాల్ చేసుకుని అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని అవసరమైన పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ఇది చాలా అవసరం. డివైజ్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి సెక్యూరిటీ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత అన్‌నౌన్ స్సోరెస్ మీద అనేబుల్ చేయాలి .