• తాజా వార్తలు

మీ రైలు టికెట్ ను ఇంకెవరికైనా ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈజీ గైడ్ !

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. మీరు కన్ఫర్మ్ చేసుకున్న టికెట్లను వేరొకరికి ట్రాన్స్‌ఫర్ చేసుకునే సదుపాయాన్ని IRCTC కల్పించింది.  ప్రయాణం చేయడం కుదరని సందర్భాల్లో  వేరొకరికి మార్చుకునే వెసులుబాటు కల్పించింది ఇండియన్ రైల్వే. ప్రయాణికుడి సీటు లేదా బెర్తును వేరొకరి పేరుపై బదిలీ చేయడానికి రైల్వే స్టేషన్ల ప్రధాన రిజర్వేషన్ అధికారికి ఈ అధికారం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లోని ఎవరికైనా టికెట్లను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మరి టికెట్లను ఎలా బదిలీ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ను ఫాలో అవ్వండి. 

ప్రయాణికుడి పేరు మార్చాలంటే.

1. మీ టికెట్ ను ప్రింట్ అవుట్  తీసుకోవాలి. 

2. మీ దగ్గర్లోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లండి.
 
3. మీకు బదులుగా ఎవరికైతే టికెట్ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారో...వారి ఫోటోతో ఉన్న గుర్తింపు కార్డును తీసుకెళ్లండి. 

4. ఇప్పుడు మీ పేరుకు బదులుగా ...మీ సంబంధీకుల పేరు మార్చమని అడగండి. 

గమనిక....రైలు బయలుదేరేందుకు 24 గంటల ముందు లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకుని టికెట్ ను బదిలీ చేసుకోవాలి. అయితే ఒక టికెట్ ను ఒకసారి మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. 

ఇక రైల్వే సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రయాణీకులకు వాట్సాప్ ద్వారా వివరాలను అందించేందుకు మేక్ మై ట్రిప్ తో ఇండియన్ రైల్వే ఒప్పందం చేసుకుంది. ఇప్పుడిది అత్యంత ప్రజాధారణ పొందింది. ప్రయాణీకులకు ట్రైన్ టైమింగ్స్ తోపాటు బుకింగ్ స్టేటస్, టికెట్ కాన్సిల్, ఫ్లాట్ ఫాం నెంబర్, వంటివి వాట్సాప్ ద్వారా పొందవచ్చు. 


 

జన రంజకమైన వార్తలు