సరదాగానో, ఇంటరెస్ట్‌తోనే మీరు తీసే ఫోటోలు మీకు డబ్బులు తెచ్చిపెడతాయని మీకు తెలుసా. ఫోటో క్వాలిటీ, లైటింగ్, డెప్త్ వంటి విషయాలపై పెద్దగా టచ్ లేకపోయినా ఫోటోలు బాగా తీయగలిగినవాళ్లు ఉంటారు. అలాంటివాళ్లు తమఫోటోలను అమ్మి డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం కల్పించే కొన్ని వెబ్‌సైట్ల గురించి ఇంతకుముందు ఆర్టికల్‌లో తెలుసుకున్నాం. అలాంటి మరిన్ని వెబ్‌సైట్‌ల గురించి చెప్పేఈ గైడ్ మీకోసం..
స్నాప్‌వైర్ (SnapWire)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లందరినీ ఒకేచోటకు చేర్చే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాం స్నాప్‌వైర్. డిఫరెంట్ ఫోటోలు, టిపికల్ స్టాక్ ఫోటోలు కావాలనుకునేవాళ్లు ఈ ఆన్‌లైన్ సర్వీసును తరచుగా చూస్తుంటారు. వారికి మీ ఫోటోలు నచ్చితే అమ్ముకోవచ్చు. అలాగే స్నాప్‌వైర్‌లో ఫోటోగ్రాఫిక్ ఛాలెంజ్‌లు పెడుతుంటారు. వీటిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కొంత మంది క్లయింట్స్ తమకు ఎలాంటి ఫోటో కావాలో స్నాప్‌వైర్‌లోనే మీకు రిక్వయిర్‌మెంట్ చెబుతుంటారు. మీ ఫోటోలను ఈ సైట్‌లో ప్రదర్శించవచ్చు. దీనిమీద ఇతరులు రివ్యూలు రాసే అవకాశం కూడా ఉంది.
ఎంత సంపాదించొచ్చు?
ఛాలెంజ్‌లు, స్పెషల్ రిక్వెస్ట్‌లు అయితే ఫోటో అమ్మిన ధరలో 70% మీకు ఇస్తారు. సాధారణ ఫోటోలకయితే 50% వరకు ఇస్తారు.
స్కూప్‌షాట్ (ScoopShot)
ఇది కొద్దిగా డిఫరెంట్ సర్వీస్. ఆన్‌లైన్ సర్వీస్‌గా కాకుండా మొబైల్ యాప్ ద్వారా పనిచేస్తుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ల్లో స్కూప్ షాట్ యాప్ దొరుకుతుంది. ఇందులో మీరు ఫోటోను అప్‌లోడ్ చేస్తే అది నేరుగా స్కూప్‌షాట్ స్టోర్‌లో డైరెక్ట్‌గా అమ్ముకోవచ్చు. అంటే మీ ఫోటోను ఈ స్టోర్‌లో ఎవరైనా తమ యాడ్స్‌కు వాడుకుంటే వారి నుంచి మీకు డబ్బులు వస్తాయి. అంతేకాదు ఒక స్పెసిఫిక్ థీమ్‌తో డైలీ ఫోటో కాంటెస్ట్‌లు కూడా ఇందులో ఉంటాయి. క్లయింట్స్ మీ అకౌంట్ ద్వారా మిమ్మల్ని రీచ్ అవుతారు కూడా. పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. లేదా పేపాల్ అకౌంట్‌లోకి యాడ్ అవుతాయి
అలామీ (Alamy)
ఎలాంటి ఫోటోనయినా తమ సర్వీస్‌లో అమ్మకానికి పెడుతుంది అలామీ. ఇక్కడ ఫోటో క్వాలిటీని టెక్నికల్‌గా చూస్తారు. అంతే తప్ప ఎడిటోరియల్ క్వాలిటీ గురించి పట్టించుకోరు.
స్టూడెంట్స్ కోసం అలామీ ప్రత్యేక ప్రోగ్రాం నడుపుతోంది. దీనిలో ఫోటో అమ్మితే ఫుల్ అమౌంట్ మీకే ఇచ్చేస్తారు. అంతేకాదు మొబైల్ వెర్షన్ ఉంటుంది. దీంతో మీరు సెల్‌ఫోన్‌లో తీసిన ఫోటోను నేరుగా అప్‌లోడ్ చేయొచ్చు. అయితే ప్రస్తుతానికి ఐఫోన్‌కే ఈ సౌకర్యం ఉంది.
ఎంత సంపాదించొచ్చు?
మిగతా సర్వీసుల కంటే చాలా ఎక్కువ పే చేస్తుంది. ఏవరేజిన ఒక్కో ఫోటోకు 90 డాలర్లు కూడా ఇస్తారు. అయితే ఫోటోను క్లయింట్ కమర్షియల్‌గా వాడుకుంటున్నాడా ఎడిటోరియల్‌కు వాడుకుంటున్నాడా అనేదానిపైనే పేమెంట్ ఆధారపడి ఉంటుంది. పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. లేదా పేపాల్ అకౌంట్‌లోకి యాడ్ అవుతాయి.
స్మగ్ మగ్ (SmugMug)
స్మగ్ ఒక కంప్లీట్ ఫోటోగ్రఫిక్ సొల్యూషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో మీరు ఫోటోలు అమ్ముకోవచ్చు. మీ ప్రైవేట్ ఇమేజ్‌లను ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు మీ ఫోటోలకు ఆన్‌లైన్ బ్యాకప్‌గా కూడా వాడుకోవచ్చు. స్మగ్‌మగ్‌లో డిజిటల్ కాపీలే కాదు మీ ఫోటోలు పోస్టర్, కాన్వాస్, ఫ్రేమ్ కట్టిన ఫోటో, గ్రీటింగ్ కార్డ్ ఇలా ఏ రూపంలో ఉన్నా అమ్మిపెడుతుంది.
ఎంత సంపాదించొచ్చు?
స్మగ్‌మగ్‌ను ముందు రెండువారాలపాటు ఫ్రీగా వాడుకోవచ్చు. నచ్చితే తర్వాత నెలకు 12 డాలర్ల ఫీజుతో మెంబర్‌షిప్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు అమ్మే ఫోటోల ధరలో 85% వాటా మీకు ఇస్తారు.
ఇవికా 123RF, EyeEm, Clashotలను కూడా ప్రయత్నించవచ్చు.