ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాడుతున్నారు. రోజుకో పది కొత్త మోడల్ ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌కు అప్‌డేట్ అయ్యేవాళ్లు, ఉన్న ఫోన్ సరిగా పనిచేయడం లేదని ఫ్యాక్టరీ రీస్టార్ట్ చేసేవాళ్లు, ఏదైనా ప్రాబ్లం వస్తే విధిలేక ఫార్మాట్ కొట్టేవాళ్లు చాలా మందే ఉంటారు. ఇలాంటి వాళ్లు కాంటాక్ట్స్‌ను బ్యాకప్ తీసుకుంటారు. కానీ ఇంపార్టెంట్ ఎస్ఎంస్‌లు ఉంటే? మనం ముఖ్యమైన వాళ్లతో మాట్లాడిన కాల్ లాగ్స్ ఉంటే? మనం ఫోన్ మార్చినా, ఫార్మాట్ చేసినా అవన్నీ పోవాల్సిందేనా? ఆ ఇబ్బందిని తీర్చడానికి సూపర్ బ్యాకప్, రీస్టోర్ యాప్ ఉంది.
ప్రత్యేతకలు ఎన్నో..
సూపర్ బ్యాకప్ అండ్ రీస్టోర్ (Super Backup & Restore) యాప్ ఆండ్రాయిడ్ 4.0, ఆ తర్వాత వచ్చిన ఓఎస్‌లన్నింటిలోనూ పనిచేస్తుంది. ఇది ఫ్రీ యాప్.
* యూజర్ ఫ్రెండ్లీ యాప్. ఎలాంటి యాడ్స్ ఉండవు. దీంతో ఇంటర్‌ఫేస్ చాలా క్లీన్‌గా, వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది.
* ఈ యాప్‌తో మీ మొబైల్ నుంచి కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్‌లు, కాల్ లాగ్స్‌ను బ్యాకప్ తీసుకోవచ్చు.
* ఇలా బ్యాకప్ తీసుకున్న డేటాను బ్లూటూత్ ద్వారా వేరే మొబైల్‌కు పంపొచ్చు. ఈమెయిల్ చేసుకోవచ్చు. షేరిట్ లాంటి షేరింగ్ యాప్స్ ద్వారా వేరే మొబైల్‌కు సెండ్ చేయొచ్చు.
* బ్యాకప్ డేటాను గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, వన్ డ్రైవ్, బాక్స్.నెట్‌లాంటి క్లౌడ్ స్టోరేజ్‌లలో స్టోర్ చేసుకోవచ్చు.
వాడుకోవడం ఇలా..
1. Super Backup & Restore యాప్‌ను మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేయండి.
2. యాప్ ఓపెన్ చేశాక ఓ సింపుల్ ఇంటర్‌ఫేస్ కనిపిస్తుంది. దానిలో యాప్స్, ఎస్ఎంఎస్, కాల్‌లాగ్, కాంటాక్ట్స్ ఇలాంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
3. మీరు ఎస్ఎంఎస్, కాల్ లాగ్, కాంటాక్ట్స్ ఏది బ్యాకప్ తీసుకోవాలంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
4. ఫస్ట్ కనిపించే BACKUP ALL ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ డేటా అంతా బ్యాకప్ అవుతుంది.
5. ఇప్పుడు SEND TO CLOUD ఆప్షన్ నొక్కి మీ బ్యాకప్ డేటాను గూగుల్ డ్రైవ్ లాంటి క్లౌడ్ స్టోరేజ్‌లో ఎక్కడయినా సేవ్ చేసుకోవచ్చు.
6. వేరే ఎవరికైనా పంపాలంటే SEND TO OTHERS ఆప్షన్ నొక్కి ప్రొసీడవ్వాలి.