మీ పీసీ స్లో అయిపోయిందా.. ఫైల్ లోడింగ్ అయినా లేదా ఫైల్‌ను డౌన్‌లోడ్ అయినా మీ సిస్టమ్ స్లో అయిపోతుందా అయితే మీ సిస్టమ్‌కు వైరస్ అటాక్ అయినట్లే. స్కాన్ చేసినప్పుడు మీ సిస్టమ్‌లో మాల్‌వేర్ ఉన్నట్లు చూపిస్తూ ఉంటుంది. చాలా త్రెట్స్ మీ కంప్యూటర్‌లో ఉన్నట్లుగా కూడా మీ సిస్టమ్ డిస్‌ప్లే చేస్తుంది. కానీ కుకీస్ వల్లే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. సునిశితంగా పరిశీలిస్తే ఇది నిజం అని అర్ధం అవుతుంది.. మరి మనల్ని ట్రాక్ చేసే ఆ కుకీస్ ఏమిటి.. వాటి నిజ స్వరూపాలేమిటో చూద్దామా..
ఏమిటీ ట్రాకింగ్ కుకీస్
అసలు కుకీస్ ట్రాక్ చేయడం ఏమిటి.. అసలు కుకీస్ అంటే ఏమిటి?.. అంటే మనం ఏదైనా ఫైల్‌ను కంప్యూటర్‌లో ఓపెన్ చేసినప్పుడు అది టెక్ట్ ఫైల్ రూపంలో సేవ్ అవుతుంది. మళ్లీ మనం అదే సైట్ లేదా లింక్ ఓపెన్ చేయాలని ప్రయత్నించినప్పుడు ఆ కుకీస్ ఆటోమెటిక్‌గా మనకు ఆ సైట్‌ను చూపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఎప్పుడు కంప్యూటర్‌లోకి వచ్చినా అవి కుకీస్ రూపంలో మీకు కనిపిస్తాయి. దీని వల్ల సులభంగా ఆ సైట్లను యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీని వల్ల ఉపయోగం ఉంది. కానీ ఈ కుకీస్ మన విజిటర్స్ డేటాను స్టోర్ చేసుకోవడం వల్లే అసలు సమస్య వస్తుంది. ఈ డేటాను ఎవరైనా చౌర్యం చేస్తే ఏంటి పరిస్థితి అనే అనుమానం తలెత్తుంది. వైరస్‌లు మన కంప్యూటర్‌ని అటాక్ చేసేది వీటి వలలే. అందుకే కుకీస్ క్లియర్ చేయాలని పదే పదే చెబుతూ ఉంటారు.
ఏంటి వీటి వల్ల నష్టం..
నిజానికి అన్ని కుకీలు మనకు ఇబ్బంది కలిగించవు. కానీ కొన్ని వాటి వల్ల కచ్చితంగా మన కంప్యూటర్ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. మనం ప్రతిసారి స్కాన్ చేసినప్పుడు ఫలానా కుకీస్ మీకు ఇబ్బంది లేదు అని యాంటీ వైరస్ మీకు మెసేజ్‌లు ఇస్తుంది. కానీ కొన్ని కుకీస్ వల్ల డేంజర్ ఉన్నట్లుగా కూడా చెబుతుంది. ఆ ప్రమాదం పొంచి ఉన్న కుకీస్‌ను వెంటనే డిలీట్ చేయాలి. ఎందుకంటే అటాకర్స్‌కి మన కంప్యూటర్‌ని సీజ్ చేయడానికి ఈ కుకీసే రాజ మార్గం వేస్తాయి. వీటినే ట్రాకింగ్ కుకీస్ అంటారు. మన డేటాను దొంగిలించి ఇతర వైరస్‌లకు అందించడమే వీటి పని. అంటే మనకు తెలియకుండానే మన కంప్యూటర్‌లోనే డేటా బయటకి వెళ్లిపోతుంది. వీటిని నివారించాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్సడ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత డు నాట్ ట్రాక్ మీద క్లిక్ చేయాలి. అంతే మాగ్జిమం ట్రాకింగ్ కుకీస్ బారి నుంచి తప్పించుకోవచ్చు.