• తాజా వార్తలు

మీ వీడియో లకు వాటర్ మార్క్స్ మీరే యాడ్ చేసుకోవడానికి ఏకైక గైడ్

మీ వీడియో లకు వాటర్ మార్క్ లు యాడ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే దీనికోసం చాలా అప్లికేషను లు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ మీ ఫోన్ లో లేదా సిస్టం లో డౌన్ లోడ్ చేసుకుని , ఇన్ స్టాల్ చేసుకుని మీ వీడియో లకు వాటర్ మార్క్ లు యాడ్ చేసుకోవలసి ఉంటుంది. అలా కాకుండా ఆన్ లైన్ లో మీ వీడియో లకు వాటర్ మార్క్ లు యాడ్ చేయాలంటే కొన్ని ఆన్ లైన్ అప్లికేషను లు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలి అంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే !

విడ్ లోగో

మీ వీడియో లకు వాటర్ మార్క్ యాడ్ చేయాలి అంటే ఒక బెస్ట్ వెబ్ సైట్ ఈ విడ్లోగో . మీ pc లో ఉన్న ఏ వీడియో కైనా దీనిద్వారా వాటర్ మార్క్ చేయవచ్చు. అయితే మీరు అప్ లోడ్ చేయ్సే వీడియో యొక్క మాక్సిమం లెంగ్త్ 40 MB కి మించి ఉండకూడదు. ఇది పూర్తి ఉచితంగా లభిస్తుంది.

  1.  మీరు ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసినపుడు వీడియో యొక్క సోర్సు ను మరియు వాటర్ మార్క్ చేయాల్సిన ఇమేజ్ ను అడుగుతుంది. అప్పుడు యాడ్ ఫైల్స్ బటన్ పై క్లిక్ చేసి మీ pc నుండి వీడియో తో పాటు ఇమేజ్ ను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రింద ఉండే నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  2. మీరు ఇలా చేసిన వెంటనే వాటర్ మార్క్ ఇమేజ్ మీ వీడియో పై భాగం లో కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆ వాటర్ మార్క్ యొక్క షేప్ ను మీకు నచ్చిన రీతిలో కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ మార్క్ యొక్క పారదర్శకత ను కూడా మార్చుకోవచ్చు.
  3. కస్టమైజేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే జనరేట్ వీడియో అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇది ఆటోమాటిక్ గా ప్రాసెస్ చేసి మీ వీడియో ను వాటర్ మార్క్ తో సహా డౌన్ లోడ్ చేస్తుంది.

లూనా పిక్

వీడియో లకు వాటర్ మార్కింగ్ చేయడానికి  గల ఫ్రీ వెబ్ సైట్ లలో ఇది మరొకటి. ఇందులో కూడా ఎన్ని వీడియో లనైనా ఉచితంగా వాటర్ మార్కింగ్ చేయవచ్చు.

  1. వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన తర్వాత పైన ఉండే డ్రా మెనూ పై ఒక్కసారి క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు అవసరమైన వివిధ రకాల టూల్ లు కనిపిస్తాయి.
  2. మీకు అవసరమైన టూల్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ మార్క్ చేయవలసిన వీడియో ను అప్ లోడ్ చేయాలనీ అడుగుతుంది. దీనిని మీరు మీ pc నుండి అప్ లోడ్ చేయవచ్చు లేదా యుఆర్ఎల్ కూడా ఎంటర్ చేయవచ్చు.
  3. వీడియో ను అప్ లోడ్ చేసిన తర్వాత ఒక కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది అక్కడ మీరు మీ వాటర్ మార్క్ యొక్క టెక్స్ట్ ను యాడ్ చేయవచ్చు. టెక్స్ట్ మాత్రమే గాక సింబల్స్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు.దీనిని ఇక్కడే కస్టమైజేషన్ చేయవచ్చు.
  4. కస్టమైజేషన్ చేసిన తర్వాత యాడ్ వాటర్ మార్క్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇది ఇన్ స్త్నాట్ గా మీ వీడియో కు వాటర్ మార్క్ ను యాడ్ చేస్తుంది. ఆ తర్వాత అ వీడియో ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

వీడియో టూల్ బాక్స్

ఇది లూనా పిక్ మాదిరిగానే పనిచేస్తుంది. ఇందులో వీడియో సైజ్ కు ఎటువంటి పరిమితి లేదు. అలాగే ఎన్ని వీడియోలకు అయినా వాటర్ మార్క్ లు యాడ్ చేసుకోవచ్చు.

  1. వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొత్త ఎకౌంటు కోసం సైన్ అప్ అవ్వాలి. ఫైల్ మేనేజర్ ను సెలెక్ట్ చేసుకుని అక్కడనుండి వీడియో ను అప్ లోడ్ చేయాలి. యుఆర్ఎల్ కూడా ఎంటర్ చేయవచ్చు.
  2. సెలెక్ట్ యాక్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు వివిధ రకాల ఆప్షన్ లు కనిపిస్తాయి. వీటిలో మీరు యాడ్ వాటర్ మార్క్ ను సెలెక్ట్ చేయాలి.
  3. తర్వాత వాటర్ మార్క్ క్రియేట్ చేయడానికి అవసరమైన ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ టెక్స్ట్ ను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జనరేట్ వాటర్ మార్క్ లింక్ ను సెట్ చేస్తుంది.
  4. ఇప్పుడు ప్రాసెస్ మొదలయి వీడియో పై వాటర్ మార్క్ యొక్క పొజిషన్ ను సెట్ చేస్తుంది. యాడ్ వాటర్ మార్క్ టు వీడియో పై క్లిక్ చేస్తే ఇన్ స్టంట్ గా యాడ్ అవుతుంది. ఆ తర్వాత మీ వీడియో ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

వాటర్ మార్క్.ws

ఇందులో మీరు ఇమేజ్ నూ మరియు టెక్స్ట్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని ఫ్రీ వెర్షన్ కు ఉన్న ప్రతికూలత ఏమిటంటే ఇందులో కేవలం 30 సెకన్ల నిడివి ఉన్న వీడియో లను మాత్రమే అప్ లోడ్ చేయగలం. ఇది ఒక్కటి తప్ప ఇది చాలా మంచి వెబ్ సైట్ అని చెప్పవచ్చు.

  1. వెబ్ సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక కొత్త ఎకౌంటు ను క్రియేట్ చేసుకోవాలి.  తర్వాత యాడ్ ఫైల్స్ బటన్ పై క్లిక్ చేసి వీడియో ను అప్ లోడ్ చేయాలి. వెంటనే ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  2. ఇలా చేసిన తర్వాత క్రింద భాగం లో మీకు ఒక వాటర్ మార్క్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ పై క్లిక్ చేస్తే లోగో వాటర్ మార్క్ మరియు టెక్స్ట్ వాటర్ మార్క్ లలో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా అడుగుతుంది.  
  3. ఏదైనా ఒక ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని సదరు ఇమేజ్ లేదా లోగో ను మీ pc నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి. అంతేగాక దీనిని వివిధ రకాలుగా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు.
  4. అంతా అయిన తర్వాత ఫినిష్ పై క్లిక్ చేస్తే వాటర్ మార్క్ తో కూడిన మీ వీడియో జనరేట్ అవుతుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.

జన రంజకమైన వార్తలు