• తాజా వార్తలు

మిమ్మల్ని సెల్ఫీ ఎక్స్ పర్ట్ లను చేసే వన్ అండ్ ఓన్లీ గైడ్

కొంతమంది సెల్ఫీ లు తీయడం లో సహజమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. అయితే చాలా మంది మంచి సెల్ఫీ లు తీయడం లో ఎప్పుడూ విఫలం చెందుతూ ఉంటారు. మీరూ అలాంటి వారేనా? అయితే ఈ ఆర్టికల్ మీకోసమే. మిమ్మల్ని సెల్ఫీ ఎక్స్ పర్ట్ లు గా మార్చే అయిదు యాప్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇస్తున్నాం.

గో క్యాం ( ఐఒఎస్ ) మరియు స్నాపి ( ఆండ్రాయిడ్ )

సెల్ఫీ లి తీసేటపుడు వచ్చే ప్రధాన ఇబ్బంది ఏమిటంటే మన ఫోజ్ సరైన పొజిషన్ లో ఉన్నపుడు ఫోన్ గట్టిగా పట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. బొటన వేలితో క్లిక్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలంటి సందర్భాలలో కేవలం చేతి సంజ్ఞల ద్వారా సెల్ఫీ లు తీసే అవకశాన్ని కల్పించేయే ఈ గో క్యాం మరియు స్నాపి యాప్ లు. ఒక చేతితో మీ ఫోన్ ను పట్టుకుని మరొక చేతితో సరైన సంజ్ఞలు చేయడం ద్వారా మీకు నచ్చిఒన ఫోజ్ లో ఫోటోలు లేదా సెల్ఫీ లు తీయడం చాలా  సులువు అవుతుంది. ఈ యాప్ లు అయిదు ఫీచర్ లను కలిగి ఉంటాయి. ఇవన్నీ మంచి సెల్ఫీ లను మీకు అందిస్తాయి. ఇవి రెండూ ఉచితంగానే లభిస్తాయి.

యూ క్యాం పర్ఫెక్ట్

ఇది కూడా మంచి సెల్ఫీ లను తీయడం లో సహకరిస్తుంది. మీరు అప్లై చేయాలి అనుకున్న ఎఫెక్ట్ లకు ఇది లైవ్ ప్రివ్యూ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందులో మంచి మంచి ఎఫెక్ట్ లు మరియు ఫిల్టర్ లు ఉంటాయి. సెల్ఫీ తీయడానికి ముందే వీటిలో లైవ్ ప్రివ్యూ చూడవచ్చు. దీనిద్వారా మీకు నచ్చిన ఫోటో లను తీయడం వీలు అవుతుంది.  ఏ ఎఫెక్ట్ లు లేదా ఫిల్టర్ లను మీరు ఫోటో తీసింజ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ లలో ఉచితంగానే లభిస్తుంది.

ఫేస్ ట్యూన్ మరియు ఫేస్ ట్యూన్ 2

ఫేస్ ట్యూన్ యాప్ ఎంత మంచి సెల్ఫీ లని అందిస్తుంది అంటే దీనిని సెల్ఫీ లకు ఫోటో షాప్ అని కూడా పిలుస్తారు. దీని సరికొత్త వెర్షన్ అయిన ఫేస్ ట్యూన్ 2 కూడా దీనికి మించిన ప్రదర్శన ను ఇస్తుంది. మీ ఫేస్ మరియు పళ్ళను వైట్ చేయడం, ఫేస్ యొక్క షేప్ ను మార్చడం , రెడ్ ఐ రిమూవల్, ప్యాచ్ లను యాడ్ చేయడం, బ్యాక్ గ్రౌండ్ ను బ్లర్ చేయడం లాంటి అనేక ఫీచర్ లు ఇందులో ఉంటాయి. ఇవి మాత్రమే గాక సింపుల్ గ ఉండే అనేక ఎఫెక్ట్ లూ, ఫిల్టర్ లు కూడా ఇందులో ఉంటాయి. ఆండ్రాయిడ్ యూజర్ లకు ఫేస్ ట్యూన్ మరియు ఐఒఎస్ యూజర్ లకు ఫేస్ ట్యూన్ 2 ఉచితంగానే లభిస్తాయి.

సెల్ఫీ గైడ్

తాజ్ మహల్ ముందు నిలబడి ఫోటో తీసుకోవాలి అనుకుంటున్నారా? అలాగే ఐఫిల్ టవర్, ఇండియా గేటు, చార్మినార్ ఇలా ఎన్నో ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశాలు బ్యాక్ గ్రౌండ్ గా మీ సెల్ఫీ లు ఉండాలి అనుకుంటున్నారా? వీటన్నింటికి సరైన సమాధానం సెల్ఫీ గైడ్ . ఈ యాప్ ను మీ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుని GPS ద్వారా మీకు కావలసిన లొకేషన్ ను మ్యాప్ పై ఎంచుకుంటే ఆ తర్వాత అందులో ఇన్ బిల్ట్ గా ఉన్న కెమెరా ఓపెన్ అయి ఆ ప్రదేశం లో మీ సెల్ఫీ వచ్చేలా చూస్తుంది. ఇందులో ఇది ఇచ్చే సూచనలను సరిగ్గా పాటిస్తే అద్భుతమైన సెల్ఫీ లను మీకు అందిస్తుంది. అయితే ప్రపంచం లో ఉన్న ప్రతీ చిన్న లొకేషన్ నూ ఇది కవర్ చేయదు. ఇందులో ఉన్న లొకేషన్ లవరకూ మీకు బెస్ట్ సెల్ఫీ లను అందించే ప్రయత్నం  చేస్తుంది. ఇది కూడా ఆండ్రాయిడ్ మరియు ఐఒఎస్ లలో ఉచితంగానే లభిస్తుంది.

డు ఇట్ యువర్ సెల్ఫీ

ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన పోపెలియర్ వేలకొద్దీ సెల్ఫీ టిప్స్ మరియు ట్రిక్స్ ను విశ్లేషణ చేసి 66 నియమాలతో కూడిన ఒక లిస్టు ను తయారు చేశారు. ఈ గైడ్ డు ఇట్ యువర్ సెల్ఫ్ లో ఉంటూ అధ్బుతమైన సెల్ఫీ లను అందంగా మరియు వేగంగా తీయడం ఎలాగో మీకు నేర్పిస్తాయి. ఇది ఒక బుక్ మాదిరిగా ఉంటుంది. ఒక పేజి లో గైడ్ లైన్స్ ఉంటే మరొక పేజి లో ఎదురుగా డిమాన్ స్ట్రేట్ చేస్తూ ఒక పిక్చర్ ఉంటుంది. ఇదంతా కూడా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే పూర్తి అవుతుంది. అధ్బుతమైన సెల్ఫీ ల కోసం ఇది ఒక చక్కని గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఇది పేపర్ బ్యాక్ రూపం లో అమజాన్ లో లభ్యం అవుతుంది.

 

జన రంజకమైన వార్తలు