`నిను వీడని నేను` అంటూ ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా మనకు తెలియకుండానే వెంటే నడుస్తోంది గూగుల్! ఎక్కడికి వెళ్లినా.. ఆ సమాచారాన్నిగూగుల్ నిక్షిప్తం చేస్తోందని ఇటీవల పరిశోధనలో తేలిన దగ్గరి నుంచి అందరిలోనూ ఆందోళన మొదలైంది. కొన్నిసార్లు దీని ఆధారంగా .. నేరదర్యాప్తు సంస్థలు నిందితులను పట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సెట్టింగ్స్‌లో లొకేషన్ హిస్టరీ స్టోర్ అవ్వకుండా పాజ్ అనే ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా.. ఎలాంటి సమాచారం రికార్డు చేయడం కుదరదని గూగుల్ చెబుతోంది. లొకేషన్ హిస్టరీని డిజేబుల్ చేసుకున్నా.. గూగుల్ యాప్స్ ఆటోమేటిక్‌గా లొకేషన్‌ను స్టోర్ చేస్తున్నాయని తేలింది. గూగుల్ మిమ్మల్ని పసిగట్టకుండా ఉండేందుకు ఈ సింపుల్ గైడ్‌ని ఫాలో అవ్వండి!
ఆండ్రాయిడ్ యూజర్లు
Step 1. డివైజ్ సెట్టింగ్స్‌లో Security & location ఆప్షన్లో Privacy బటన్‌పై క్లిక్ చేయాలి.
Step 2. తర్వాత Location సెలక్ట్ చేసి.. App-level Permissionsని ఎంచుకోవాలి.
Step 3. ఇందులో వివిధ యాప్స్‌కి ఉన్న యాక్సెస్‌ని డిజేబుల్ చేసుకోవాలి. ఒకవేళ గూగుల్ ఓఎస్ అయితే గూగుల్ ప్లే సర్వీసెస్‌ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి.
Step 4. ఇది ఆన్‌లో ఉన్నంత సేపు ఇతర యాప్స్‌కి.. గూగుల్ ప్లే సర్వీస్ లొకేషన్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే దీనిని ఆఫ్ చేసుకోవాలి. దీంతో పాటు గూగుల్ క్రోమ్‌లోనూ ఈ సెట్టింగ్స్ మార్చుకోవాలి.
iOS Devices
Step 1 ఐఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తే.. ఇందులో ముందుగా While Usingకి సెట్టింగ్స్ మార్చుకోవాలి.
Step 2. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
Step 3. Settings > Privacy > Location Servicesలో Google Mapsని ఎంచుకుని అవసరమైన మార్పులు చేయాలి. వీటితో పాటు ఫోన్‌లో సెర్చ్ ఇంజన్ సెట్టింగ్స్ కూడా మార్చుకోవాలి.
Step 4. బ్రౌజింగ్ చేసే సమయంలో లొకేషన్ సర్వీస్ ఆఫ్ చేసేందుకు లొకేషన్ సర్వీస్ ఆప్షన్‌లో Never ఎంచుకోవాలి.
ఇతర ఫోన్లు అయితే
Step 1. బ్రౌజర్‌లోకి వెళ్లి.. myactivity.google.com వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
Step 2. లాగిన్ అయ్యాక.. ఫోన్‌లో ఉన్న సర్వీసెస్ ద్వారా గూగుల్ ట్రాక్ చేస్తోందో లేదో ఫోన్‌లో ఉన్న సెట్టింగ్స్‌లో చెక్ చేయాలి.
Step 3. సెట్టింగ్స్‌లోని డ్రాప్ డౌన్ మెనూలో.. Activity Controls సెలక్ట్ చేసుకోవాలి. ఇందులో Web & App Activity, Location History ఆప్షన్స్‌ని టర్న్ ఆఫ్ చేసుకోవాలి.
లొకేషన్ వివరాలు డిలీట్ చేయాలంటే..
ముందుగా myactivity.google.comలో Details ఆప్షన్‌లోకి వెళ్లాలి. From Your Current Location అనే ఆప్షన్‌ని ట్యాప్ చేస్తే.. గూగుల్ మ్యాప్స్‌కి కనెక్ట్ అవుతుంది. ఇందులో మనం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్లామనే వివరాలు కనిపిస్తాయి. పక్కనే ఉండే నావిగేషన్ ఐకాన్ సాయంతో.. వీటన్నింటినీ డిలీట్ చేసేయవచ్చు. ఇవి గూగుల్.కామ్, సెర్చ్, గూగుల్ మ్యాప్స్ వంటి వాటి నుంచి సేకరించిన సమాచారమంతా ఇక్కడ ఉంటుంది. వీటిని డిలీట్ చేస్తే.. గూగుల్ సర్వర్ నుంచి మొత్తం వివరాలన్నీ డిలీట్ అయినట్టే!