• తాజా వార్తలు

గేమ‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డే సింగిల్ హ్యాండెడ్ కీబోర్డుల‌కు తొలి గైడ్

పీసీలు, ల్యాపీలు ఎన్నో మార్పులు చెందాయి. సైజ్‌, కాన్ఫిగ‌రేష‌న్‌, డిస్‌ప్లే, స్పీడ్ ఇలా.. కానీ కీబోర్డ్‌, మౌస్ మాత్రం అప్ప‌టి నుంచి ఇప్ప‌టికీ అదే స్టాండ‌ర్డ్‌. కీబోర్డు అంటే రెండు చేతులూ పెట్టి వాడుకోవాల్సిందే. మౌస్ వాడాలంటే ఒక చెయ్యి కీబోర్డు మీద నుంచి తియ్యాల్సిందే. ఇంకెన్నాళ్లీ ఇదే పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి అనుకుంటున్నారా? అయితే ఈ సింగిల్ హ్యాండెడ్ కీబోర్డులు చూడండి. కానీ ఇవి గేమ‌ర్స్‌కి మాత్ర‌మే ప‌నికొస్తాయి.

చాలా ర‌కాలున్నాయి

మామూలు కీబోర్డుల్లాగానే దీనిలో కూడా చాలా ర‌కాలున్నాయి. మెంబ్రేన్‌, మెకా మెంబ్రేన్ ఇలా అన్న‌మాట‌. కొన్ని కీబోర్డుల‌కు స్కో్లింగ్ వీల్ కూడా ఉంటుంది.

ఉప‌యోగాలు

ఫుల్ గేమింగ్ కీబోర్డు కంటే ఇవి కాస్ట్ త‌క్కువ‌.

డిజైన్, కాంపాక్ట్ సైజ్‌. చిన్న‌గా ఉండ‌టంతో మీరు కీబోర్డు మీద ఒక చెయ్యి మౌస్ మీద ఒక‌చెయ్యి పెట్టి ఒకేసారి వాడుకోవ‌చ్చు. గేమింగ్ ల‌వ‌ర్స్‌కి ఇవి ఎంతో ఉప‌యోగం.

ఈజీ టూ యూజ్‌‌

టైపింగ్‌కి ప‌నికొచ్చే సింగిల్ హ్యాండెడ్ కీబోర్డ్స్ కూడా ఉన్నాయి. కానీ వాటిని యూజ్ చేయ‌డం కాస్త క‌ష్టం అందుకే క్లిక్ కాలేదు. ‌

లోపాలు

ఇది ఫుల్ కీబోర్డ్ కాదు కాబ‌ట్టి అన్ని కీస్ ఉండ‌వు. కాబ‌ట్టి టైపింగ్ లాంటి రెగ్యుల‌ర్ యూజ్‌కు పనికిరావు.

కీబోర్డ్ డైరెక్ట్‌గా వాడుకోలేం. ముందుగా సెట్ చేసుకుని ఆ త‌ర్వాత యూజ్ చేసుకోవ‌చ్చు.

ఎవ‌రికి ఉపయోగం?

గేమింగ్ ల‌వ‌ర్స్‌కి

ప్రోగేమ‌ర్స్‌కి

ఎడ్జ్ కావాల‌నుకునే గేమ‌ర్ల‌కి

స్టాండ‌ర్ట్ కీబోర్డు వాడ‌లేనివారికి

గేమింగ్ ల్యాపీ యూజ‌ర్ల‌కి

 

జన రంజకమైన వార్తలు