• తాజా వార్తలు

ఏ ప్రొడక్టైనా యూజర్ మాన్యువల్ ని ఉచితంగా పొందడానికి ఒన్ & ఓన్లీ గైడ్

ఆన్ లైన్లో యూజర్ మాన్యువల్స్ ను కనుగొనేందుకు 7 ఉచిత వెబ్ సైట్లు ఉన్నాయి. ఈ వెబ్ సైట్ల ద్వారా మీరు ఆన్ లైన్ లో చదవడానికి వీలుగా పిడిఎఫ్ మాన్యువల్లను అందిస్తారు. లేదంటే మీ కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్లలో సెర్చ్ చేయడానికి కొన్ని మిలియన్ల మాన్యువల్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన ప్రొడక్టు మోడల్ నెంబర్ లేదా పార్ట్ నెంబర్ లేదా బ్రాండ్ పేరు లేదా ప్రొడక్టు యొక్క క్యాటగిరి ద్వారా మాన్యువల్ కోసం సెర్చ్ చేయవచ్చు. అయితే యూజర్ మాన్యువల్ ను ఏయే వెబ్ సైట్లు ఉచితంగా అందిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందా. 

1. మాన్యువల్స్ లిబ్.....
యూజర్ మాన్యువల్ సెర్చ్ ఇంజన్ చాలా సులభంగా ఉంటుంది. 2.5మిలియన్ యూజర్ల మాన్యవల్లను కలిగి ఉంది. అంతేకాదు పలు యూజర్లకు చెందిన దాదాపు 50,000 బ్రాండ్ల మాన్యువల్లు ఈ సాఫ్ట్ వేర్ లో ఉన్నాయి. కాబట్టి మీకు కావాల్సిన సెర్చ్ మాన్యువల్లను లిబ్ సాఫ్ట్ వేర్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఈ వెబ్ సైట్ ను లాగిన్ చేయగానే..స్క్రీన్ షాట్లో చూసేందుకు వీలుగా ఉండే సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లో మీకు కావాల్సిన ప్రొడక్టు లేదా ప్రొడక్టు యొక్క మోడల్ నెంబర్ లేదా మాన్యువల్ను తెలుసుకునేందుకు నెంబర్ ను ఎంటర్ చేయాలి. 

మోడల్ కానీ ప్రొడక్టు నెంబర్ కానీ తెలియకపోతే...బ్రాండ్ పేరుతో కూడా మాన్యువల్ ను బ్రౌజ్ చేయవచ్చు. ఇలా బ్రౌజ్ చేయగానే మీకు కావాల్సిన మాన్యువల్ ను చూపిస్తుంది. ఇక ఈ యూజర్ మాన్యువల్ సెర్చ్ ఇంజిన్ pdfరూపంలో యూజర్ మాన్యువల్ ను అందిస్తుంది. మీరు డైరెక్టుగా వెబ్ సైట్లో మాన్యువల్ ను చదవుకోవచ్చు. లేదంటే మీ కంప్యూటర్లోకి pdfను డౌన్ లోడ్ చేయవచ్చు. అంతే కాదు మీ యూజర్ మాన్యువల్ ను ఆన్ లైన్లో సేవ్ చేయడానికి ఒక ఉచిత అకౌంట్ ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 

2. సేఫ్ మాన్యువల్....
మీకు కావాల్సిన యూజర్ మాన్యువల్ మీరు సెర్చ్ చేస్తున్న వెబ్ సైట్లలో లభించకపోతే.....సేఫ్ మాన్యువల్ వెబ్ సైట్ కు వెళ్లండి. ఈ వెబ్ సైట్ యొక్క హోం పేజీకి వెళ్లి.....మీకు కావాల్సిన యూజర్ మాన్యువల్ కోసం సెర్చ్ చేయండి. ఇది 6,000బ్రాండ్లు, 650,000ప్రొడక్టులకు పైగా 800,000యూజర్ మాన్యువల్లు ఈ వెబ్ సైట్లో ఉన్నాయి. 
మీరు ప్రొడక్టు పేరు లేదా నెంబర్, లేదా బ్రాండ్ పేరు, ప్రొడక్ట్ కేటగిరితో యూజర్ మాన్యువల్ కోసం సెర్చ్ చేయవచ్చు. ఈ వెబ్ సైట్లో మాన్యువల్ కూడా pdfరూపంలో ఉంటుంది. దీన్ని మీ కంప్యూటర్లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ఆన్ లైన్ లో చదవేందుకు ఎలా అప్షన్ లేదు. ఆన్ లైన్ లో చదవాలంటే మీ స్వంతగా మరోక యూజర్ మాన్యువల్ ను అప్ లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. 

3. వర్క్ షాప్ మాన్యువల్.....
ప్రత్యేకంగా కార్ల కోసం వర్క్ మాన్యువల్లను సెర్చ్ చేస్తున్నట్లయితే వర్క్ షాప్ మాన్యవుల్ వెబ్ సైట్ కు వెళ్లండి. ఈ వెబ్ సైట్లో చాలా రకాల కార్ల బ్రాండ్లు, కారు నమూనాల కోసం ఉంటుంది. మీరు AUDI, BMW, అకురా, టయోటా, హోండా వంటి దాదాపు అన్ని బ్రాండ్ల వర్క్ షాప్ మాన్యువల్లను పొందవచ్చు. అంతేకాదు కొన్ని ప్రీమియం బ్రాండ్ల కోసం కావాల్సిన మాన్యువల్లు కూడా ఈ వెబ్ సైట్లో పొందుపర్చి ఉన్నాయి. 
అయితే కారు వర్క్ షాప్ మాన్యువల్ కోసం డైరెక్టుగా సెర్చ్ చేయడానికి ఈ వెబ్ సైట్ కు సెర్చ్ ఫీచర్ లేదు. మీరు చూడాలనుకుంటున్న కారు బ్రాండ్ పేరును క్లిక్ చేస్తే...మీకు కావాల్సిన వర్క్ మాన్యవల్ కలిగి ఉన్న బ్రాండ్ కార్లను చూపిస్తుంది. మాన్యువల్ ఓపెన్ చేయడానికి కారు పేరు మీద క్లిక్ చేయండి. ముందు చూసిన వెబ్ సైట్ల మాదిరిగా...PDF వర్క్ షాప్ మాన్యువల్ డౌన్ లోడ్ చేసుకునే ఛాన్స్ లేదు. ఆన్ లైన్లోనే మాన్యువల్ను చదువుకోవచ్చు. ప్రతి మాన్యువల్ కు ఇండెక్స్ ఉంటుంది. దీని ద్వారా డైరెక్టు గా మీకు కావాల్సిన పేజీకి వెళ్లొచ్చు. 

4. శాంసంగ్ యూజర్ మాన్యువల్స్....
మాన్యుఫాక్చర్ సపోర్టుతో వెబ్ సైట్ను గుర్తించడానికి...బెస్ట్ ఆప్షన్ గూగుల్ సెర్చ్. గూగుల్ సెర్చ్ లో మాన్యుఫాక్చర్ వెబ్ సైట్ పేరు క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన ప్రొడక్టు వివరాలను నమోదు చేయండి. ఇలా చేయడం ద్వారా తయారీదారులు యూజర్ మాన్యువల్లు, డ్రైవర్లు, సాఫ్ట్ వేర్,డౌన్ లోడ్స్ , మద్దతు ప్రశ్నలు, ఇంటరాక్టివ్ గైడ్లలకు సంబంధించి ప్రతీది అందిస్తారు. 

5.యూజర్ మాన్యువల్ గైడ్. కాం...
యూజర్ మాన్యువల్లను సెర్చ్ చేసేందుకు ఇది ఫ్రీ వెబ్ సైట్. కానీ వెబ్ సైట్ చాలా పాతగా ఉంటుంది. ఇంతవరకు ఎలాంటి అప్ డేట్ చేయలేదు. ఒకవేళ మీరు వెబ్ సైట్ హోం పేజీకి వెళ్లినట్లయితే...అందులో సెర్చ్ బాక్సు ఎక్కడా కనిపించదు. కేవలం బ్రాండ్స్, ప్రొడక్ట్ కేటగిరిలకు సంబంధించి జాబితాను మాత్రమే చూపిస్తుంది. ఏదైనా ప్రొడక్టుపై క్లిక్ చేశారనుకొండి...దానిలో ఉన్న అన్ని ప్రొడక్టులను చూపిస్తుంది. ఈ యూజర్ మాన్యువల్ ను pdf ఫార్మాట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్లో చదవడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. 

6.ఈ సర్వీసు ఇన్ ఫో...
యూజర్ మాన్యువల్ గైడ్. కాం వలే ఈ వెబ్ సైట్ కూడా చాలా పాతది. ఇందులో లిమిట్ కలెక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో డేటా షీట్లు, స్కీమాటిక్ డయాగ్రాయ్స్, కోడ్ కాలిక్యూలేటర్లు, సర్వీసు మెను ఉన్నాయి. ఇది pdfరూపంలో మాన్యవల్లను డౌన్ లోడ్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మాన్యువల్లు మల్టిపుల్ భాగల్లో విభజించబడి ఉంటాయి. అన్ని భాగాలను డౌన్ లోడ్ చేసి 7-జిప్ సాఫ్ట్ వేర్ తో షేర్ చేసుకోవచ్చు. 

7.మాన్యువల్ ఆన్ లైన్...
ఇది ఒక ఫ్రీ యూజర్ మాన్యువల్ సెర్చ్ ఇంజిన్. ఇందులో యూజర్ మాన్యువల్స్ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. దాదాపు 700,000కంటే ఎక్కువ ప్రొడక్టులు ఇందులో ఉన్నాయి. ఇది మాన్యువల్ లిబ్ తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఈ వెబ్ సైట్లో మీ ప్రొడక్టులకు సంబంధించిన సమస్యలను కూడా పోస్టు చేయడానికి ఒక ప్రత్యేక విభాగం ఉంది. 
అంతేకాదు ఈ వెబ్ సైట్ ఒక సాధారణ ఇంటర్ స్పేసును కలిగి ఉంది. సెర్చ్ బాక్స్ లో ...యూజర్ మాన్యువల్ కు అవసరమైన ప్రొడక్టు లేదా మోడల్ నెంబర్ ను టైప్ చేయాలి. దీంతో ఆన్ లైన్లో చదవడానికి ఈజీగా ఉంటుంది. ఈ మాన్యువలును pdf రూపంలో మీ కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతే కాదు మీ యూజర్ మాన్యువల్ ను ఆన్ లైన్లో సేవ్ చేయడానికి ఒక ఉచిత అకౌంట్ ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 
 

జన రంజకమైన వార్తలు