ప్రతీ రోజు మనకు అనేక నెంబర్ లనుండి ఫోన్ కాల్స్ వస్తాయి. వాటిలో కొన్ని మాత్రమే మనకు తెలిసిన నెంబర్ లు ఉంటాయి. దాదాపుగా మిగిలినవన్నీ తెలియని నెంబర్ లే ఉంటాయి. వీటిలో కొన్ని స్పాం కాల్స్ కూడా ఉంటాయి. టెలి మార్కెటింగ్ కు చెందిన ఈ కాల్స్ మనలను పదేపదే విసిగిస్తూ అసలు ఫోన్ అంటేనే చికాకు వచ్చేలా చేస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఈ తరహా కాల్స్ ల్యాండ్ లైన్ నెంబర్ లనుండి వచ్చేవి కాబట్టి గుర్తించడం సులువు అయ్యేది. ఇప్పుడు వీళ్ళు కూడా తెలివి మీరి పోయారు. ల్యాండ్ లైన్ నెంబర్ లకు బదులుగా మామూలు ఫోన్ నెంబర్ లతో కాల్స్ చేయడం ప్రారంభించారు. ఫోన్ ఎత్తగానే ఏదో ఒక కర్ణ కఠోరమైన మ్యూజిక్ గానీ లేదా ఏదైనా ప్రమోషనల్ ఆఫర్ గానీ వినపడుతుంది. అయితే అదృష్టవశాత్తూ ఇలాంటి స్పాం కాల్స్ నుండి బయటపడడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ రోజు మన ఆర్టికల్ లో చదువుకుందాం.
కాల్స్ ను మాన్యువల్ గా బ్లాక్ చేయండి.
టెలి మార్కెటింగ్ కంపెనీల నుండి గానీ లేదా ఏదైనా కొత్త నెంబర్ లనుండి గానీ పదేపదే కాల్స్ వస్తూ విసిగిస్తూ ఉంటే వాటిని బ్లాక్ చేయడమే మంచిది. దీనికి సులువైన మార్గం ఏమిటంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో కాల్ లాగ్ ను ఓపెన్ చేసి ఏ నెంబర్ అయితే మీరు బ్లాక్ చేయాలి అనుకుంటున్నారో ఆ నెంబర్ పై లాంగ్ ప్రెస్ చేయండి.అక్కడ బ్లాక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలు. ఇకపై ఆ నెంబర్ నుండి మీకు ఏ విధమైన కాల్స్ రావు.
కాంటాక్ట్ లిస్టు లో ఉన్నవారిని తప్ప మిగతా వారిని బ్లాక్ చేయడం ఎలా ?
అసలు మీ కాంటాక్ట్ లిస్టు లో ఉన్న నెంబర్ లు తప్ప మరే ఇతర నెంబర్ నుండి కూడా మీకు కాల్స్ రావడం ఇష్టం లేదా? అయితే కాల్ బ్లాకర్ లాంటి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలి. మీ కాంటాక్ట్ లో ఉన్న నెంబర్ లు తప్ప వేరే ఏ ఇతర నెంబర్ నుండి అయినా మీకు కాల్స్ రాకుండా ఈ యాప్ బ్లాక్ చేస్తుంది. ముందుగా ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ను ఓపెన్ చేసి బ్లాక్ లిస్టు ను సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ బటన్ పై ట్యాప్ చేసి ఫ్రం కాల్ లోగో ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బ్లాక్ లిస్టు లో పెట్టాలి అనుకున్న నెంబర్ లను సెలెక్ట్ చేయండి. అంతే. ఇందులో ఉన్న ఏకైక ప్రతికూలత ఏమిటంటే మీ కాంటాక్ట్ లిస్టు లో లేని నెంబర్ నుండి మీకు కాల్ వచ్చినపుడు మీ ఫోన్ రింగ్ అవ్వదు.
థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా కాల్స్ బ్లాక్ చేయడం
కాల్స్ బ్లాక్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లో అనేకరకాల థర్డ్ పార్టీ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఉచితంగానే లభిస్తాయి, కొన్నింటికి మాత్రం నెలవారీ సబ్ స్క్రిప్షన్ ఉంటుంది. ట్రూ కాలర్, హియా, should I answer ?, మిస్టర్ నెంబర్ మొదలైనవి వీటికి ఉదాహరణలు. వీటికి చాలా పెద్దదట బేస్ ఉంటూ స్పామర్ ల యొక్క లిస్టు ను స్థిరంగా అప్ డేట్ చేస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని యాప్ లు స్పాం నెంబర్ లు వచ్చినపుడు మనకు వార్నింగ్ కూడా పంపుతాయి.
నేషనల్ డు నాట్ కాల్ రిజిస్టరీ లో రిజిస్టర్ చేయించుకోండి.
NDNCR లో రిజిస్టర్ చేసుకోవడానికి మీరు 1909 కు sms పంపడం గానీ కాల్ చేయడం గానీ చేయవలసి ఉంటుంది. START 0 లేదా START DND అని టైపు చేసి 1909 కు sms చేయాలి. లేదా ఈ నెంబర్ కు కాల్ చేసి మీకు ఇష్టం లేని కేటగరీ లను టైపు చేసి వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. నేషనల్ డు నాట్ కాల్ రిజిస్ట్రీ లో ఉన్న కేటగరీ నెంబర్ లను ఇక్కడ ఉ=ఇవ్వడం జరిగింది.
రియల్ ఎస్టేట్
ఎడ్యుకేషన్
హెల్త్
కన్స్యూమర్ గూడ్స్ అండ్ ఆటో మొబైల్స్
కమ్యూనికేషన్/బ్రాడ్ కాస్టింగ్/ఎంటర్ టైన్ మెంట్/ IT
టూరిజం అండ్ లెజర్