• తాజా వార్తలు

జియో USSD కోడ్స్ లేటెస్ట్ & అప్ డేటెడ్ గైడ్

అతి తక్కువ కాలం లోనే అత్యంత ప్రముఖమైన టెలికాం ఆపరేటర్ గా రిలయన్స్ జియో పేరు గాంచింది. కేవలం జియో వలననే స్మార్ట్ ఫోన్ ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయంటే దీని ప్రాముఖ్యత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భారత టెలికాం రంగం యొక్క ముఖ చిత్రాన్నీ మరియు భారతీయులు ఫోన్ వాడే విధానాన్నీ సమూలంగా ఇది మార్చి వేసింది. ఏ టెలికాం ఆపరేటర్ కి అయినా కస్టమర్ లు చాలా ముఖ్యం. వీరికి అవసరమైన సేవలు అందించినపుడే ఏ ఆపరేటర్ అయినా ఎక్కువ కాలం మన గలుగుతుంది. వినియోగదారుల సమస్యలను తీర్చడానికి దాదాపుగా అన్ని టెలికాం ఆపరేటర్ లూ USSD కోడ్ లను నిర్వహిస్తాయి. ఏ కోడ్ ల గురించి సరైన అవగాహన ఉంటే మనకు వచ్చే సందేహాలు దాదాపుగా తీరిపోతాయి. ఇంకేమైనా ఉంటే కస్టమర్ కేర్ సపోర్ట్ ఉండనే ఉంటుంది. ఈ రోజు ఆర్టికల్ లో రిలయన్స్ జియో యొక్క USSD కోడ్ ల గురించి తెలుసుకుందాం.

మెయిన్ బాలన్స్ చెక్ చేయడానికి

మీ మెయిన్ బాలన్స్ ను రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. *333# ను డయల్ చేయడం ద్వారా మరియు MBAL అని టైపు చేసి 55333 కి మెసేజ్ చేయడం ద్వారా కూడా మీ మెయిన్ బాలన్స్ తెలుసుకోవచ్చు. ఈ రెండూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ లే.

ప్రీ పెయిడ్ బాలన్స్ మరియు వ్యాలిడిటీ ని తెలుసుకోవడం ఎలా ?

BAL అని టైపు చేసి 199 కి sms చేయడం ద్వారా ప్రీ పెయిడ్ బాలన్సు తెలుసుకోవచ్చు.

పోస్ట్ పెయిడ్ బిల్ అమౌంట్

 BILL అని టైపు చేసి 199 కి మెసేజ్ చేయడం ద్వారా మీ పోస్ట్ పెయిడ్ బిల్ అమౌంట్ ను తెలుసుకోవచ్చు.

మీ టారిఫ్ ప్లాన్ ను తెలుసుకోండి

MY PLAN అని టైపు చేసి 199 కి sms చేస్తే మీ టారిఫ్ వివరాలు తెలుస్తాయి.

మీ జియో సిమ్ నెంబర్ తెలుసుకోండి

*1# డయల్ చేయడం ద్వారా మీ నెంబర్ తెలుసుకోవచ్చు. మీ ఫోన్ లో ఉన్న మై జియో యాప్ లో మేనేజ్ యువర్ ఎకౌంటు విభాగం లో మై జియో అనే హెడింగ్ క్రింద కూడా మీ నెంబర్ ను మీరు తెలుసుకోవచ్చు.

4 జి డేటా యూసేజ్ ను చెక్ చేయండి

 MBAL అని టైపు చేసి 55333 కి మెసేజ్ చేయడం ద్వారా మీ 4 జి డేటా యూసేజ్ ను తెలుసుకోవచ్చు.

 డేటా బాలన్సు చెక్ చేయడం ఎలా ?

*333*1*3*# ద్వారా మీ డేటా బాలన్స్ చెక్ చేయవచ్చు.

మిగిలిన SMS బాలన్స్ తెలుసుకోవడం ఎలా ?

మై జియో యాప్ లో మై జియో > మేనేజ్ యువర్ ఎకౌంటు > బాలన్స్ > sms ద్వారా మరియు *367*2#ద్వారా కూడా మీ మిగిలిన sms బాలన్స్ తెలుసుకోవచ్చు.

మరికొన్ని USSD కోడ్ లు

4 జి డేటా యాక్టివేట్ చేయడానికి                      sms  START to 1925 or call 1925

మిస్డ్ కాల్ అలెర్ట్ యాక్టివేషన్                                            *333*3*2*1#  

మిస్డ్ కాల్ అలెర్ట్ డీ యాక్టివేషన్                                       *333*3*2*2#  

VAS బాలన్స్ చెక్ చేయడానికి                                          *333*1*4*1#

ఇంటర్ నెట్ బాలన్స్ చెక్ చేయడానికి                              *333*1*3#

జన రంజకమైన వార్తలు