• తాజా వార్తలు

అతి చవకైన ఆండ్రాయిడ్ టాబ్లెట్ లను కొనడానికి బయింగ్ గైడ్

తక్కువ ధరలో లభించే ఒక మంచి ఆండ్రాయిడ్ టాబ్లెట్ ను సెలెక్ట్ చేసుకోవడం అంటే అది ఏమంత సులువైన విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో తక్కువ ధరలో లభించే ఆండ్రాయిడ్ టాబ్లెట్ లు అనేకరకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో లోకల్ కంపెనీ ల వద్ద నుండీ అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ లైన సోనీ, హువేవి మరియు సామ్సంగ్ లాంటి కంపెనీలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల పట్ల స్పష్టంగా ఉంటే మనకు నచ్చిన మంచి ఆండ్రాయిడ్ టాబ్లెట్ ను కొనుగోలు చేయవచ్చు. ఆ విషయాలను ఈ ఆర్టికల్ లో చర్చిద్దాం.

అసలు మీకు టాబ్లెట్ ఎందుకు అవసరం ?

ముందుగా అసలు మీకు టాబ్లెట్ ఎందుకు అవసరమో ఒక్కసారి విశ్లేషించుకోవాలి. మీ అవసరాలకు తగ్గ ఫీచర్ లు ఉన్న ఆండ్రాయిడ్ టాబ్లెట్ లను సెలెక్ట్ చేసుకుని అందులో ఉత్తమమైన వాటిని ఎంచుకోవాలి. అన్ని ఫీచర్ లూ ఉండాలి అని అనుకుంటే టాబ్లెట్ పిసి కొనుక్కోవడం ఉత్తమం.

మీ బడ్జెట్ ను సెట్ చేసుకోండి కానీ ఒక్కోసారి రేట్ కు అతీతంగా కూడా చూడండి

ఆండ్రాయిడ్ టాబ్లెట్ లు రెండు వేల నుండీ యాబై వేల రూపాయల ధర వరకూ లభిస్తాయి. ఖరీదైన టాబ్లెట్ అయినంత మాత్రాన అదే స్థాయిలో క్వాలిటీ ఉండాలి అన్న నిబంధన ఏమీ లేదు. మీ అవసరాలకు తగ్గట్లు తెలివిగా సెలెక్ట్ చేసుకోండి. ఒక్కోసారి చవకగా లభించే టాబ్లెట్ లు కూడా హై ఎండ్ ప్రదర్శన ను ఇస్తాయి.

కంపెనీ

మీ టాబ్లెట్ మంచి కంపెనీది అయి ఉండడం మంచిది. మీకు అందుబాటులో ఉన్న ఏరియా లో సర్వీస్ సెంటర్ లు ఉన్న కంపెనీ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టం ను కలిగి ఉందా లేదా అనేది చూసుకోవాలి. సామ్సంగ్, హువేవి కంపెనీ టాబ్లెట్ లను ఎక్కువమంది కొంటూ ఉంటారు. అలాగే అనుకోకుండా టాబ్లెట్ కు ఏమైనా డ్యామేజ్ జరిగితే రిపేర్ చార్జెస్ ఎలా ఉంటాయో కూడా చూసుకోవలసిన అవసరం ఉంది.

ప్రాసెసర్

సామ్సంగ్ ఎక్సినోస్ : ఈ ప్రాసెసర్ లు చాలా వేగంగా పనిచేస్తూ మంచి ప్రదర్శన ను ఇస్తాయి.  లేటెస్ట్ క్వాడ్ కోర్ సామ్సంగ్ ఎక్సినోస్ 5250 ప్రాసెసర్ అధ్బుతమైన పెర్ఫార్మన్స్ ను అన్ని రకాల అప్లికేషను లు మరియు గేమ్ లతో సహా అందిస్తుంది.

Nvidia టెగ్రా 3 : ఇది ఒక కాంప్లెక్స్ క్వాడ్ కోరే ప్రాసెసర్. ఇది నావిగేషన్ మరియు హై ఫ్రేమ్ రేట్స్ ను అందిస్తుంది.

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4 :  ప్రస్తుతం ఇది చాలా తక్కువ టాబ్లెట్ లలో రన్ అవుతుంది. ఇది ఒక డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఇది కూడా మంచి పెర్ఫార్మన్స్ ను అందిస్తుంది.

టాబ్లెట్ సైజు లు

లభ్యం అయ్యే సైజు లను బట్టి ఆండ్రాయిడ్ టాబ్లెట్ లను మూడు రకాలు గా వర్గీకరించవచ్చు. అవి చిన్న, మీడియం మరియు పెద్ద సైజు లు .

స్మాల్ సైజు ( 7 – 7.9 ఇంచ్ లు )

7 నుండీ 7.9 ఇంచ్ ల సైజు ఉన్న టేబుల్ లను చిన్న సైజు టాబ్లెట్ లుగా పరిగణించవచ్చు. ఇది సాధారణంగా తక్కువ ధర లో లభిస్తూ పోర్టబుల్ గా ఉంటాయి. ఇవి యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటాయి. కొత్త యూజర్ లకు ఇవి ప్రిఫర్ చేయవచ్చు.

మీడియం ( 8.9 – 10.1 ఇంచ్ లు )

పెద్ద స్క్రీన్ లు, హై రిసోల్యూషన్ లు న్న టాబ్లెట్ లను మీడియం సైజు గా లెక్కించవచ్చు.  గేమ్స్ ఆడడం మరియు మూవీ లు చూడడం చెక్ష్సె యూజర్ లకు పెద్ద స్క్రీన్ లు చక్కగా ఉపయోగపడతాయి. చిన్న సైజు వాటితో పోలిస్తే వీటి మెమరీ మరియు ప్రసేఅర్ లు వేగంగా ఉంటాయి.

లార్జ్ ( 10.1 ఇంచ్ మరియు ఆ పైన )

ఇలాంటి టాబ్లెట్ లు ఎలెక్ట్రోనిక్ మార్కెట్ లో అంతగా లభించవు. ఇవి ఫాస్ట్ ప్రాసెసర్ లు, లర్గె స్క్రీన్ లు మరియు హై రిసోల్యూషన్ లను కలిగి ఉంటాయి. పర్సనల్ కంప్యూటర్ ల యొక స్మాల్ వెర్షన్ లుగా వీటిని చెప్పుకోవచ్చు.

స్క్రీన్ క్వాలిటీ

చీప్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ ల స్క్రీన్ రిసోల్యూషన్ మరియు పానెల్ టైపు లపై దానియొక్క క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ రిసోల్యూషన్ ఉంటే గ్రాఫిక్స్ మరింత షార్ప్ గా ఉంటాయి. ఇంగే యొక్క క్వాలిటీ అనేది పానెల్ టైపు పై ఆధారపడి ఉంటుంది.

స్టోరేజ్

ఆండ్రాయిడ్ టాబ్లెట్ లో మనం గుర్తు ఉంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన ఫీచర్ స్టోరేజ్ కెపాసిటీ. కనీసం 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న దానినే మంచ్ టాబ్లెట్ గా పరిగణించాలి.  ఎందుకంటే అందులో ఉన్న మెమరీ లో 25 శాతం టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టం మరియు దాని అప్లికేషను లు ఆక్రమిస్తాయి. అంటే 8 GB స్టోరేజ్ ఉన్న టాబ్లెట్ లో మనకు 6 GB మాత్రమే ఫ్రీ స్పేస్ ఉంటుంది. అంతకంటే తక్కువ మెమరీ ఉన్నవి అయితే అప్లికేషను లకే ఎక్కువ మెమరీ ని ఆక్రమిస్తాయి. కాబట్టి ఎక్కువ మెమొరీ ఫీచర్ మరియు SD కార్డు ఎక్స్ టెన్షన్ లు ఉన్న టాబ్లెట్ ను తీసుకోవడమే ఉత్తమం.

బ్యాటరీ లైఫ్

మన టాబ్లెట్ లు మంచి బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉండడం కూడా మంచిదే. 2000 mAh కంటే ఎక్కువ పవర్ ఉన్న బ్యాటరీ లను కలిగి ఉన్న ఆండ్రాయిడ్ టాబ్లెట్ లను తీసుకోవడం ఉత్తమం.

కెమెరా

ఏ స్మార్ట్ డివైస్ లో నైనా యూజర్ లు మందుగా చూసే అంశం కెమెరా. మంచి రిసోల్యూషన్ కలిగి ఉన్న కెమెరా ను సెలెక్ట్ చేసుకోవడం వలన హై క్వాలిటీ పిక్చర్ లను వీడియో లను క్యాప్చర్ చేయడం వీలు అవుతుంది. అలాగే వీడియో కాల్స్ చేసుకోవడానికి మంచి ఫ్రంట్ కెమెరా ఉన్న టాబ్లెట్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

కనెక్టివిటీ

ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న టాబ్లెట్ లలో దాదాపుగా అన్నీ వైఫై సపోర్ట్ మరియు సులభంగా ఇంటర్ నెట్ కు కనెక్ట్ అయ్యే ఫీచర్ లను కలిగి ఉంటున్నాయి.వై ఫై ఓన్లీ మరియు వైఫై విత్ 3 జి సపోర్ట్ అని రెండు రకాల డివైస్ లు ఉంటాయి. వీటిలో 3 జి సపోర్ట్ ఉన్న టాబ్లెట్ లను తీసుకోవడం మంచిది. తద్వారా అందులో సిమ్ వేసి దానిద్వారా కూడా ఇంటర్ నెట్ ను వాడుకోవచ్చు. HDMI కనెక్టివిటీ ఆప్షన్ అలాగే బ్లూ టూత్ అప్ డేటెడ్ వెర్షన్ కూడా మీ టాబ్లెట్ లో ఉండ విధంగా చూసుకోవాలి. దీనివలన డేటా షేరింగ్ కూడా సులువు అవుతుంది.

 

జన రంజకమైన వార్తలు