ల్యాప్‌టాప్.. పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. అయితే ల్యాప్‌టాప్‌లో వర్క్‌లోడ్ పెరిగే కొద్ది పనితీరు నెమ్మదిస్తుంటుంది. ఇందుకు ప్రధానమైన కారణమం ర్యామ్ (ర్యాండమ్ యాక్సిస్ మెమరీ) సరైనంతగా లేకపోవడమే. ఇటువంటి పరిస్ధితుల్లో ర్యామ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవటం ద్వారా ల్యాప్‌టాప్ పనితీరు మెరుగుపడుతుంది. సక్రమమైన పద్ధతిలో ల్యాప్‌టాప్‌కు అదనపు ర్యామ్‌ను ఇన్‌స్టాల్ చేసే ప్రాసెస్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా మీ ల్యాప్‌టాప్‌లోని ర్యామ్ మెమరీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మైకంప్యూటర్ ట్యాబ్ పై క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా ల్యాపీలో ఇన్‌స్టాల్ చేసిన ర్యామ్ మెమరీ గురించి మీకు తెలుస్తుంది.
ఇదే సమయంలో మీ ల్యాపీకి ఎటువంటి ర్యామ్ సరిపోతుందో ఓ అంచనాకు రావాలి. 2జీబి నుంచి 1టిబి వరకు రకరకాల స్టోరేజ్ వేరియంట్‌లలో ర్యామ్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో మీ అవసరానికి తగ్గట్టుగా ర్యామ్‌ను ఎంపిక చేసుకోండి.
ర్యామ్ మాడ్యుల్ సిద్ధమైన వెంటనే ఇన్‌స్టాలేషన్‌కు సిద్దమవ్వండి. ముందుగా మీ ల్యాప్‌టాప్‌ను పూర్తిగా టర్నాఫ్ చేయండి. ఈ సమయంలో ల్యాపీకి ఏ విధమైన పవర్ సప్లై ఉండకుండా చూసుకోండి. ర్యామ్ మాడ్యుల్‌ను ల్యాప్‌టాప్‌కు అనుసంధానించే క్రమంలో సేప్టీ కోసం షాక్ ప్రూఫ్ తొడుగును మీ చేతులకు ధరించండి.
ల్యాపీకి పూర్తిగా పవర్ నిలిపివేసినట్లు నిర్ధారణకు వచ్చిన వెంటనే మెమరీ కంపార్ట్‌మెంట్ డోర్ కోసం వెతకండి. తయారీదారును బట్టి ర్యామ్ స్లాట్ అనేది వేరువేరు స్ధానాల్లో ఉంటాయి. చాలావరకు ల్యాప్‌టాప్‌లలో మెచీన్ క్రింద భాగంలో మెమరీ కంపార్ట్‌మెంట్ డోర్‌లను ఏర్పాటు చేయటం జరుగుతుంది.
స్క్రూ డ్రైవర్ సహాయంతో ఆ డోర్‌ను ఓపెన్ చేసినట్లయితే రెండు ర్యామ్ స్లాట్‌లు మీకు కనిపిస్తాయి. ఒకవేళ ఈ రెండు స్లాట్‌లు ర్యామ్‌లతో నిండి ఉన్నట్లయితే అందులో ఒక ర్యామ్ మాడ్యుల్‌ను తొలగించి, దాని స్ధానంలో కొత్త ర్యామ్‌ను ఉంచండి.
స్లాట్ నుంచి ర్యామ్‌ను బయటకు తీసే క్రమంలో స్లాట్ చివరి భాగాల్లో కనిపించే Ejector Clips పై ప్రెస్ చేయవల్సి ఉంటుంది. ర్యామ్‌ను స్లాట్‌లో అమర్చే క్రమంలో ర్యామ్‌ను ఖచ్చితమైన స్ధానంలో కూర్చోబెట్టి Ejector Clipsను లాక్ చేస్తే సరిపోతోంది.
ర్యామ్ రీప్లేస్‌మెంట్ పూర్తి అయిన వెంటనే డోర్‌ను క్లోజ్ చేసి ల్యాప్‌టాప్‌ను ఆన్ చేయండి. మైకంప్యూటర్ ట్యాబ్ పై క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా ల్యాపీలో ఇన్‌స్టాల్ చేసిన ర్యామ్ మెమరీ గురించి తెలిసిపోతుంది. ఇప్పుడు ల్యాపీలోని అప్లికేషన్స్ మరింత వేగవంతంగా రన్ అవుతుంటాయి.