• తాజా వార్తలు

ఏమిటీ paytm పోస్ట్ పెయిడ్ ? కంప్లీట్ గైడ్ మీకోసం

యుపిఐ ఆధారిత యాప్  Paytm సంస్థ పేటీఎం పోస్ట్‌పెయిడ్ సర్వీస్ ను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిని యూజర్లు క్రెడిట్ కార్డు మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. ఈ సర్వీస్ పేటీఎం యూజర్లు అందరికీ అందుబాటులోకి వచ్చింది. పేటీఎం పోస్ట్‌పెయిడ్ ని ఎలా అప్లయి చేయాలి. దీని ప్రయోజనాలు ఏంటి, కంపెనీ ఆఫర్లు ఏమైనా ఇస్తుందా లాంటివి ఓ సారి చూద్దాం.

Paytm పోస్ట్‌పెయిడ్ అంటే ఏమిటి?
Paytm పోస్ట్‌పెయిడ్ అనేది క్రెడిట్ కార్డుతో సమానంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఖర్చు చేయడానికి ముందే  కొంత క్రెడిట్ పరిమితిని పొందుతారు. అయితే ఈ క్రెడిట్ పరిమితి మీ వాలెట్ బ్యాలెన్స్, ప్లాట్‌ఫారమ్‌లో నెలవారీ ఖర్చు అలాగే ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. యూజర్ల వాడకం ఆధారంగా రాబోయే నెలల్లో కంపెనీ క్రెడిట్ పరిమితిని పెంచుతుంది. ప్రస్తుతం Paytm 500రూపాయల నుండి 6,000రూపాయల మధ్య క్రెడిట్ పరిమితిని అందిస్తోంది.

గడువు తేదీ:
బిల్లులు చెల్లించేందుకు క్రెడిట్ కార్డ్ గడువు తేదీ మాదిరిగానే Paytm పోస్ట్‌పెయిడ్‌కు కూడా గడువు తేదీ ఉంటుంది. ప్రతి నెలలో ఆఖరు 7 వ తేదీ లోపు మీరు పేమెంట్ చెల్లించాలి. మీరు లావాదేవీలు జరిపిన బిల్లు గడువు తేదీకి 15 రోజుల ముందు మీకు పంపబడుతుంది. సమయానికి చెల్లింపు చేయడంలో విఫలమైతే కొంత ఆలస్య చెల్లింపు ఛార్జీలను కంపెనీ వసూలు చేస్తుంది. అలాగే ఖాతా కూడా బ్లాక్ చేయబడుతుంది. మీరు చెల్లింపును క్లియర్ చేసిన తర్వాత ఖాతా మళ్లీ యాక్టీవ్ అవుతుంది. మీరు డెబిట్ కార్డ్, నెట్‌బ్యాంకింగ్ లేదా యుపిఐను ఉపయోగించి ఈ చెల్లింపులు చేయవచ్చు.

పేటీఎం పోస్ట్‌పెయిడ్ కోసం ధరఖాస్తు  ఎలా ?
పేటీఎం పోస్ట్‌పెయిడ్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సులభం. ముందుగా మీరు మీ ID మరియు చిరునామా రుజువును సమర్పించి మీ KYCని పూర్తిచేసుకోండి. మీ KYC ఇప్పటికే పూర్తిచేసుకున్నట్లయితే Paytm యాప్ ఓపెన్ చేయండి. అందులో సెర్చ్ పట్టీక దిగువన కుడి ఎగువ భాగంలో ‘Paytm పోస్ట్‌పెయిడ్' అనే ఎంపిక ఉంటుంది దానిని ట్యాప్ చేయండి. ఇప్పటికే KYC పూర్తయినందున మీ పేరు, ఇమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ మరియు ఇతర వివరాలను మళ్ళీ ఒక సారి చెక్ చేయండి.తరువాత దరఖాస్తు ఆప్సన్ మీద క్లిక్ చేయండి.  మీ ఖాతా యాక్టీవ్ అవుతుంది. దీని తరువాత మీరు ఎలాంటి పత్రాలు లేదా అదనపు వ్రాత పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు.దీనిని ప్రారంభించడానికి మీకు క్రెడిట్ బ్యాలెన్స్‌గా రూ .500 ఇవ్వబడుతుంది . ఈ క్రెడిట్  మీ వినియోగం ఆధారంగా పెరుగుతూ ఉంటుంది.

ఈ డబ్బును ఎక్కడ వాడుకోవచ్చు
ప్రీపెయిడ్ మొబైల్, డిటిహెచ్ రీఛార్జ్, యుటిలిటీ బిల్ చెల్లింపులు చేయడానికి మీరు పేటిఎం పోస్ట్‌పెయిడ్ బ్యాలెన్స్‌ను ఉపయోగించవచ్చు. ట్రావెల్ బుకింగ్, మూవీ టిక్కెట్లను బుక్ చేసుకోవడం, పేటీఎం మార్కెట్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఇతర సేవలకు మీరు ఈ బ్యాలెన్స్‌ను ఉపయోగించవచ్చు. రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు మరియు పెట్రోల్ పంపులలో చెల్లింపులు చేయడానికి కూడా Paytm పోస్ట్‌పెయిడ్ బ్యాలెన్స్ ఉపయోగించబడుతుంది. యాప్ లోని పాస్‌బుక్ ఎంపికను నొక్కడం ద్వారా మీరు బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు. భద్రత గురించి ఆందోళన చెందుతున్నవారికి పాస్‌కోడ్ లేదా వేలిముద్ర స్కానర్ ఉపయోగించి మీ ఖాతాను భద్రపరచడానికి ఒక ఎంపిక కూడా ఉంది.

జన రంజకమైన వార్తలు