• తాజా వార్తలు

వాట్సప్‌లో మీకు నచ్చిన రింగ్ టోన్ సెట్ చేసుకోవడం ఎలా,  పూర్తి గైడ్ మీకోసం

మన వాట్సప్ అకౌంట్‌ను మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని సెట్టింగ్స్ మనకు వాట్సప్‌లో అందుబాటులో ఉన్నాయి. వాట్సప్ వాయిస్ కాల్స్ అలానే వీడియో కాల్స్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో మీ వాట్సప్ అకౌంట్‌కు వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్ అలానే మెసేజ్‌లకు రకరకాల రింగ్‌టోన్స్ మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. వాట్సప్ కాంటాక్ట్‌లకు రింగ్‌టోన్స్ సెట్ చేసుకునే విధానంపై పూర్తి గైడ్ ని మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

స్టెప్ 1
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లయితే, ముందుగా ఫోన్‌లోని యాప్‌ను ఓపెన్ చేసిన టాప్ రైటర్ కార్నర్‌లో కనిపించే సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 2
సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత నోటిఫికేషన్స్‌లోని నోటిఫికేషన్ సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకోండి. అక్కడ మీకు నోటిఫికేషన్ టోన్ ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 3
నోటిఫికేషన్ టోన్ పై క్లిక్ చేసిన వెంటనే రింగ్‌టోన్స్ లిస్ట్ మీకు కనిపిస్తుంది. వాటిలో కావాల్సిన రింగ్‌టోన్‌ను సెట్ చేసుకోవచ్చు.

స్టెప్ 4
మీ ఆపిల్ ఐఫోన్ వాడుతున్నట్లయితే వాట్సాప్ రింగ్‌టోన్ మార్చుకునే క్రమంలో మీ ఫోన్ ఖచ్చితంగా ఐఓఎస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించేదిగా ఉండాలి.

స్టెప్ 5
ముందుగా ఐఫోన్ కాంటాక్ట్స్ యాప్‌లోకి వెళ్లండి. రింగ్‌టోన్‌ను మార్చాలనుకుంటున్న కాంటాక్ట్‌ను సెలక్ట్ చేసుకోండి. ఎడిట్‌చేసే క్రమంలో స్ర్కీన్ టాప్‌రైట్ కార్నర్‌లో కనిపించే "Edit" ఆప్షన్ పై క్లిక్ చేయండి. అందుబాటులో ఉన్న రింగ్‌టోన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో నచ్చిన రింగ్‌టోన్‌ను సెలక్ట్ చేసుకుని ఫోన్ ను రీస్టార్ట్ చేయండి.

జన రంజకమైన వార్తలు