గ్రూపుల్లో అడ్మిన్‌ను మరింత పవర్‌ఫుల్ చేస్తూ వాట్సాప్ కీలకమైన ఫీచర్లు ప్రవేశపెట్టింది. వాట్సాప్‌లో ఏదైనా గ్రూప్ క్రియేట్ చేస్తే.. అడ్మిన్‌తో పాటు సభ్యులు కూడా ఒకే రకమైన హక్కులు కలిగి ఉండేవారు. సభ్యులను గ్రూప్‌లో యాడ్ చేయడం, ఎవరినైనా తొలగించడం వంటివి మాత్రమే అడ్మిన్‌కు అదనంగా ఉండేవి. ఇక నుంచి గ్రూప్‌లో సభ్యుల పాత్రను నామమాత్రం చేస్తూ.. అడ్మిన్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలని వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ముఖ్యమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. రెస్ట్రిక్టిడ్ గ్రూప్.
అడ్మిన్.. మోర్ పవర్‌ఫుల్
ఇప్పటివరకూ గ్రూపులో సభ్యులందరూ ఇష్టమొచ్చిన లింకులు, ఫొటోలు వంటివి గ్రూపుల్లో షేర్ చేసే స్తుండేవారు. ఎక్కువ స్పామ్ మెసేజ్‌లు ఇలా గ్రూపుల్లో షేర్ అవుతోంది. దీంతో కొన్నిసార్లు పలు గ్రూపులపై ఫిర్యాదులు కూడా వస్తున్న విషయం తెలిసిందే! వీటన్నింటినీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు వాట్సాప్ ఈ రెస్ట్రిక్టెడ్ గ్రూప్ ను ప్రవేశపెట్టింది. ఇక నుంచి సభ్యులెవరూ గ్రూప్‌లో తమ ఇష్టమొచ్చినట్లు గ్రూప్ పేర్లు మార్చేయడం, పోస్ట్‌లు పెట్టడం, లింకులు, వీడియోలు పోస్ట్ చేయడం వంటివి చేసే అవకాశం లేదు. దీనివల్ల గ్రూప్‌లో అనవసర అంశాలపై చర్చలు తగ్గడంతో పాటు కచ్చితమైన సమాచారం మాత్రమే సర్క్యులేట్ అవుతుందని వాట్సాప్ స్పష్టంచేసింది.
రెండు అధికారాలు
ఈ రిస్ట్రెక్టిడ్ గ్రూప్‌ని కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న గ్రూప్‌లోనే చిన్న సెట్టింగ్ మార్చి రెస్ట్రిక్టిడ్ గ్రూప్‌గా మార్చేయవచ్చు. ఇందులో గ్రూప్‌పై మరింత అజమాయిషీ పెరిగేలా అడ్మిన్‌కి రెండు అధికారాలు ఇచ్చింది. మొదటిది గ్రూపులో సమాచారం ఎవరూ మార్చకుండా చేయడం, రెండోది సభ్యులెవరూ గ్రూప్‌లో పోస్ట్ చేయకుండా వారిని లాక్ చేయడం! ఇప్పుడు వీటిని ఎలా ఎనేబుల్ చేయాలో తెలుసుకుందాం!
గ్రూప్ సమాచారం మార్చకుండా..
* ముందుగా WhatsApp గ్రూప్‌ని ఓపెన్ చేయాలి.
* గ్రూప్ పేరు మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ పేజీలోకి వెళతాం. ఇందులో Group settings ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
* Edit group info ఆప్షన్‌ని ఎంచుకోవాలి. తర్వాత వచ్చే మెనూలో All participants, Only admins అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. కేవలం అడ్మిన్ మాత్రమే గ్రూపు సమాచారాన్ని మార్చాలని భావిస్తే Only admins ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఇది ఎనేబుల్ అయిన తర్వాత గ్రూప్ అడ్మిన్ సెట్టింగ్స్ చేంజ్ చేశారనే మెసేజ్ డిస్ప్లే అవుతుంది.
మెసేజ్‌లు రిస్ట్రిక్ట్ చేయడానికి..
వాట్సాప్ వన్‌వే గ్రూప్ మెసేజింగ్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది ఎనేబుల్ అయి ఉంటే అడ్మిన్లు మాత్రమే గ్రూపులో మెసేజ్‌లు పోస్ట్ చేయగలుగుతారు. ఇందులో ఉండే సభ్యులు దీనిని చదవగలరే తప్ప రిప్లై ఇవ్వలేరు.
* ముందుగా వాట్సాప్ గ్రూప్‌ని ఓపెన్ చేసి పేరు మీద క్లిక్ చేయాలి. గ్రూప్ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకోవాలి.
* ఇందులో Send messages మీద క్లిక్ చేయాలి. తర్వాత కనిపించే రెండు ఆప్షన్స్‌లో Only adminsను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఆడ్మిన్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే.. గ్రూపులో ఈ విషయం మెసేజ్ రూపంలో వస్తుంది. ఇందులో సభ్యలు ఎవరైనా టైప్ చేసేందుకు మెసేజ్ బాక్సుపై క్లిక్ చేస్తే అక్కడ Only admins can send messages అని చూపిస్తుంది. అక్కడే అడ్మిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. గ్రూప్ అడ్మిన్ పేర్లు వస్తాయి.