• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు పెన్‌డ్రైవ్‌ కనెక్ట్ చేసేందుకు సింపుల్ గైడ్ మీకోసం

చాలా వరకు మార్కెట్లో లభ్యమవుతోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో మైక్రోఎస్డీ స్లాట్ లను కంపెనీలు అందిస్తున్నాయి. ఇంటర్నల్ expansion కార్డ్‌స్లాట్‌లను కలిగి ఉన్న ఫోన్‌లలో దాదాపుగా స్టోరేజ్ సమస్యలు తొలగినట్లేనని చెప్పవచ్చు!. కొన్ని సంధర్భాల్లో మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌ను పెన్‌డ్రైవ్‌కు కనెక్ట్ చేయవల్సి వస్తే ఎలా కనెక్ట్ చేసుకోవాలో తెలియదు. అలాంటి సమయంలో
ఈ కింది స్టెప్స్ పాటించడం ద్వారా మీరు మీ పనిని ఈజీగా చేయవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ పెన్‌డ్రైవ్‌‌కు కనెక్ట్ అవ్వాలంటే తప్పనసరిగా On-The-Go (OTG) ఫీచర్‌ను కలిగి ఉండాలి. ఒవవేళ ఈ సదుపాయం మీ ఫోన్‌లో లేకపోయినట్లయితే USB OTG checker యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పటికి కూడా మీ ఫోన్ OTG సపోర్టును పొందలేక పోయినట్లయితే తప్పనిసరిగా ఫోన్‌ను రూట్ చేయవల్సి ఉంటుంది.

మీ డివైస్కు USB OTG సపోర్ట్ లభించిన వెంటనే ఓ OTG కేబుల్‌ను కొనుగోలు చేయండి.

ఇప్పుడు OTG కేబుల్ ఒకవైపు భాగాన్ని మీ ఫోన్‌కు కనెక్ట్ చేసి మరొక భాగాన్ని పెన్‌డ్రైవ్‌కు కనెక్ట్ చేయండి.

పెన్‌డ్రైవ్ ఫోన్‌కు కనెక్ట్ అయిన వెంటనే యూఎస్బీ సింబల్ ఫోన్ స్ర్కీన్ పై కనిపిస్తుంది. ఒకవేళ నోటిఫికేషన్ అందని పక్షంలో ఫైల్ మేనేజర్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు