• తాజా వార్తలు

2G, 3G, 4G సిమ్‌ కార్డ్‌లను గుర్తించేందుకు పూర్తి గైడ్ 

4జీ సిమ్ కార్డ్‌ను, ఆ కార్డుకు సంబంధించిన సీరియల్ నెంబర్ ద్వారా గుర్తించే వీలుంటుంది. సిమ్ కార్డ్ సిరీయల్ నెంబర్‌లో ఎరుపు రంగులో హైలైట్ అయి ఉండే మూడు నెంబర్లు ద్వారా 4జీ సిమ్‌ను గుర్తించే 
వీలుంటుంది. ఇదే పద్థతిలో 2జీ, 3జీ సిమ్ కార్డులను కూడా గుర్తించే వీలుంటుంది.మరొక పద్ధతిలో భాగంగా మీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌ను 4జీ మోడ్‌కు మార్చి మాన్యువల్‌గా 4జీ నెట్‌వర్క్‌ను సెర్చ్ చేసుకునే వీలుంటుంది. నెట్‌వర్క్ సెట్టింగ్స్ మార్చిన తరువాత డిస్‌ప్లే పై 4జీ సిగ్నల్ కనిపించినట్లయితే సిమ్‌కార్డ్ ఖచ్చితంగా 4జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తున్నట్లే.ఒక్క జియో నెట్‌వర్క్‌ మినహాయించితే మిగిలిన నెట్‌వర్క్‌లకు సంబంధించిన ఇంటర్నెట్ సిగ్నల్ ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుంది. ఈ నెట్‌వర్క్‌లకు సంబంధించిన సిగ్నల్ సామర్థ్యం పట్టణాల్లో ఒకరకంగా, గ్రామీణ ప్రాంతాల్లో మరొక రకంగా ఉంటుంది. E, G, H, H+, 2G, 3G, 4G ఇలా అనేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్‌లో మొబైల్ ఇంటర్నెట్ వేగాన్ని సూచించటం జరుగుతోంది. ఈ సింబల్స్ వెనుక దాగి ఉన్న అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం..

G అంటే (GPRS)
జీపీఆర్ఎస్ (జనరల్ ప్యాకెట్ రేడియ్ సర్వీస్)ను 2.5జీ అని కూడా పిలవటం జరుగుతోంది. ఈ నెట్‌వర్క్ స్పీడ్ సెకనుకు 114 కేబీపీఎస్ వరకు ఉంటుంది. ఈ స్పీడ్‌లో వెబ్ పేజీలు చాలా నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ మాత్రం వేగంగా ఉంటుంది.

E అంటే (EDGE)
ఎడ్జ్ (ఎన్‌హాన్సుడ్ డేటా రేట్స్ ఫర్ జీఎస్ఎమ్ ఎవల్యూషన్) నెట్‌వర్క్, ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే 3 రెట్లు వేగంగా స్పందిస్తుంది. ఈ నెట్‌వర్క్ సపోర్ట్ స్పీడ్ సెకనుకు 217కేబీపీఎస్‌గా ఉంటుంది. నిరుత్సాహపరిచే విషయం ఎంటంటే ఈ స్పీడులో తక్కువ రిసల్యూషన్ వీడియోలు సైతం ఓపెన్ అవ్వవు.

2జీ నెట్‌వర్క్
ఇంటర్నెట్ వైర్‌లెస్ కమ్యూనిషన్ ప్రసారాలకు ఉపయోగించిన రెండవ తరం టెక్నాలజీనే 2జీ నెట్‌వర్క్‌గా పిలుస్తారు. ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ వంటి డేటా సర్వీసులను ఈ నెట్‌‌వర్క్ మొబైల్ ఫోన్‌లకు అందిస్తుంది.2జీ నెట్‌వర్క్ గరిష్ట వేగం సెకనుకు 50 kilobitsగా ఉంటుంది. ఈ స్పీడులో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చాలా నెమ్మదిగా ఉంటుంది.

3జీ (3G) నెట్‌వర్క్
3జీ నెట్‌వర్క్ అనేది యూనివర్శల్ మొబైల్ టెలీకమ్యూనికేషన్స్ సర్వీస్ స్టాండర్డ్స్ ఆధారంగా డిజైన్ కాబడింది. ఈ నెట్‌వర్క్ స్పీడ్ సెకనుకు 384 కేబీపీఎస్‌గా ఉంటుంది. ఈ స్పీడులో ఆన్‌లైన్ వీడియోలతో పాటు మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను అంతరాయం లేకుండా ఆస్వాదించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతోన్న నెట్‌వర్క్‌‌లలో 3జీ నెట్‌వర్క్ ఒకటి.

H స్టాండర్డ్
H నెట్‌వర్క్ స్టాండర్డ్ అనేది HSPA+ (హైస్పీడ్ ప్యాకెట్ యాక్సెస్) ఆధారంగా స్పందిస్తుంది. ఈ నెట్‌వర్క్ స్పీడ్ సెకనుకు 7.2 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. ఈ నెట్‌వర్క్ స్పీడులో యూట్యూబ్ వీడియోలతో పాటు వెబ్ బ్రౌజింగ్‌ను హైక్వాలిటీతో ఆస్వాదించవచ్చు. సినిమాలను సైతం వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

H+ స్టాండర్డ్
H+ నెట్‌వర్క్ స్టాండర్డ్ అనేది HSPA+ (హైస్పీడ్ ప్యాకెట్ యాక్సెస్) ఆధారంగా స్పందిస్తుంది. ఈ నెట్‌వర్క్ స్పీడ్ సెకనుకు 168.8 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఈ నెట్‌వర్క్ పరిధిలో ఆస్వాదించవచ్చు.

4G LTE
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లలో 4G LTEని ఫాస్టెస్ట్ నెట్‌వర్క్‌‌గా చెప్పుకోవచ్చు. 4G నెట్‌వర్క్ గరిష్ట వేగం సెకనుకు 1Gbpsగా ఉంటుంది. భవిష్యత్‌లో ఇదే నెట్‌వర్క్ 1Tbpsను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నెట్‌వర్క్ స్పీడులో హైక్వాలిటీ వెబ్‌బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు.

VoLTE (వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఇవల్యూషన్)
VoLTE కమ్యూనికేషన్ స్టాండర్డ్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నట్లయితే హైడెఫినిషన్స్ వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది. VoLTE అంటే వాయిస్ ఓవర్ ఎల్టీఈ అని అర్థం. ఈ కనెక్టువిటీ ఫీచర్.. 4జీ సర్వీస్ ద్వారా హై క్వాలిటీ వాయిస్, వీడియో ఇంకా మల్టీమీడియా సేవలను యూజర్లకు చేరువచేస్తుంది. VoLTE వ్యవస్థ ముఖ్యంగా కాల్ క్వాలిటీని మరింత మెరుగుపరుస్తుంది.  3జీ కంటే మూడు రెట్లు, 2జీ కంటే 6 రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. వాస్తవానికి, వాయిస్ ఓవర్ ఎల్టీఈ అనేది ఇంటర్నెట్ ద్వారా కాల్స్ చేసుకునేందుకు మరొక మార్గం. VoLTE కాల్స్ అనేవి స్టాండర్డ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా కాకుండా మొబైల్ 4జీ LTE బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ద్వారా డెలివరీ కాబడతాయి.

జన రంజకమైన వార్తలు