కొద్ది కాలం క్రితం విడుదలైన `రాజా ది గ్రేట్` సినిమా చూశారా? అందులో హీరో ఎవరి సాయం తీసుకోకుండా ఫోన్‌లో ఉన్న Google Assistantని ఉపయోగించుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోతుంటాడు. సినిమాలోనే కాదు బయట కూడా దీనిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే పర్సనల్ అసిస్టెంట్‌గా మారిపోతుందనడంలో సందేహం లేదు. 2016లో టెక్ దిగ్గజం గూగుల్ దీనిని ఆవిష్కరించిన దగ్గర నుంచి ఎన్నో కొత్త కొత్త ఆప్షన్లు ప్రవేశపెడుతూనే ఉంది. వ్యక్తిగత అవసరాలకు కూడా ఉపయోగించుకునేలా గూగుల్ అసిస్టెంట్‌లో మార్పులు చేస్తోంది. స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ స్పీకర్లు వంటి పరికరాల్లోనూ ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చింది. లైట్లు, వైఫై వంటివి ఆన్, ఆఫ్ చేయడానికి కూడా సాయపడనుంది. Google Assistantని ఫోన్‌లో సమర్థంగా ఎలా వినియోగించాలో తెలిపే సింపుల్ గైడ్..
డౌన్‌లోడ్ ఎలా..
ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న అన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ గూగుల్ అసిస్టెంట్.. ముందుగానే ఇన్‌స్టాల్ అయి ఉంటోంది. ఒకవేళ ఇంకా మీ ఫోన్‌లో లేకపోతే.. వెంటనే ఆండ్రాయిడ్ యూజర్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు.. యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎలా ఎనేబుల్ చేసుకోవాలి
- ఆండ్రాయిడ్ యూజర్లు..
* Google Assistant ఓపెన్ చేసేందుకు స్మార్ట్‌ఫోన్‌లోని Home బటన్‌పై కొద్ది సేపు నొక్కి ఉంచాలి.
* తర్వాత టెర్మ్స్ అండ్ కండీషన్ అనే ఆప్షన్ దగ్గర Agree సెలెక్ట్ చేసుకోవాలి.
* వాయిస్ కమాండ్ యాక్టివేట్ చేసేందుకు Continue మీద క్లిక్ చేయాలి. తర్వాత Ok Google ఆప్షన్‌ని యాక్టివేట్ చేసుకోవాలి.
* ఇక మీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు గూగుల్ అసిస్టెంట్ రెడీ అయిపోయినట్టే!
- ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు..
* ముందుగా గూగుల్ అసిస్టెంట్ యాప్‌ని ఓపెన్ చేయాలి
* తర్వాత వచ్చే సూచనలన్నింటినీ పాటించాలి.
* Ok Google ఆప్షన్‌ని ఎనేబుల్ చేయాలి.
* ఇందులో Ok Google, Hey Google అని నాలుగుసార్లు చెప్పాల్సి ఉంటుంది.
* ఇవన్నీ పూర్తయిన తర్వాత.. గూగుల్ ఓపెన్‌చేసి OK Google అని అంటే గూగుల్ అసిస్టెంట్ పనిచేయడం మొదలవుతుంది.
వాయిస్‌తో అన్‌లాక్ చేసేందుకు
* Google యాప్‌ని ఓపెన్ చేయాలి. తర్వాత కుడి వైపున ఉండే మూడు చిన్నచిన్న గీతలపై ట్యాప్ చేయాలి.
* ఆప్షన్స్‌లో Settings >Google Assistant> Settings సెలెక్ట్ చేసుకోవాలి.
* ఇందులో Phone> Ok Google ఆప్షన్‌ని ఆన్ చేసుకోవాలి.
* తర్వాత Ok Google, Hey Google అని నాలుగు సార్లు చెప్పాలని అడుగుతుంది.
* అలా చెప్పిన తర్వాత Done ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో మన వాయిస్ సేవ్ అవుతుంది.
* ఇప్పుడు Unlock with Voice Match ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటే వాయిస్ ద్వారా ఫోన్‌ని అన్‌లాక్ చేయచ్చు.