గూగుల్ సరికొత్త ఓఎస్ Android Pie.. గూగుల్ పిక్సల్‌తో పాటు Rubin’s Essential స్మార్ట్‌ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చింది. పిక్సల్ యూజర్లు.. తమ సిస్టమ్‌ని అప్‌డేట్ చేసుకుంటే ఈ కొత్త ఓఎస్‌లోకి మారిపోతుంది. అయితే సాధారణ ఆండ్రాయిడ్ యూజర్లు కూడా ఈ Android Pieలోని కొన్ని ఫీచర్లను తమ ఫోన్‌లోనూ ఉపయోగించుకునే సదుపాయన్ని గూగుల్ కల్పిస్తోంది. ఈ థర్డ్ పార్టీ Android 9.0 తరహా లాంచర్‌ను ఇతర ఫోన్ల కోసం గూగుల్ రూపొందించింది. మరి మీ ఫోన్‌లోనూ ఈ ఆండ్రాయిడ్ పై.. ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేసుకుని Pieని ఎంజాయ్ చేయండి.
ఎలా ఇన్‌స్టాల్ చేయాలి?
* ఆండ్రాయిడ్ 9.0 ఏపీకే ఫైల్‌ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది అఫీషియల్ లాంఛర్ కాదు కానీ ఆండ్రాయిడ్ 9.0 ఓఎస్‌లో దాదాపు సగం ఫీచర్లు ఇందులో ఉంటాయి.
* ఒకసారి ఈ ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ అయ్యాక.. దీనిని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మొత్తం పూర్తయ్యాక మీ హోమ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇందులో లాంచర్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో పిక్సల్ లాంచర్‌ని ఎంచుకోవాలి.
* ఒకవేళ ఈ ఆప్షన్ రాకపోతే.. హోమ్ బటన్‌ని కొద్దిసేపు ప్రెస్ చేయాలి. తర్వాత లాంచర్‌ని మాన్యువల్‌గా సెలక్ట్ చేసుకోవాలి. ఇందులో Always ని ఎంచుకోవాలి. సో పిక్సల్ లాంచర్ డిఫాల్ట్‌గా ఎంపిక అవుతుంది.
* తర్వాత సెట్టింగ్స్‌లో ఈ పిక్సల్ లాంచర్‌ని ఉపయోగించాలనుకునే అప్లికేషన్స్‌కి ఎంచుకోవాలి. సో ఇవన్నీ.. ఇప్పుడు ఆండ్రాయిడ్ పై డివైస్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఎలా పనిచేస్తాయో అలానే పనిచేస్తాయి.
* మళ్లీ పిక్సల్ లాంచర్‌ని ఓపెన్ చేసి పర్మిషన్లు (లొకేషన్, ఫైల్స్, స్టోరేజ్) ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రస్తుతం గూగుల్ పిక్సల్ ఫోన్లకే ఈ కొత్త ఓఎస్ అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రపంచంలో ఇంకా రెండు శాతం మంది మాత్రమే ఈ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలో విడుదలయ్యే నోకియా ఫోన్స్, ఆండ్రాయిడ్ వన్, నెక్సస్, వన్ ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్లలో ఆగస్టు నెలాఖరు నాటికి ఆండ్రాయిడ్ పై వచ్చే అవకాశాలున్నాయి. ఓరియో యూజర్లు మాత్రం 2018 చివరి వరకూ వేచిచూడాల్సిందే!