• తాజా వార్తలు

మీ పిల్ల‌ల లొకేష‌న్‌ని ఎల్ల‌ప్పుడూ ట్రాక్ చేయ‌డానికి ఈజీయ‌స్ట్ గైడ్‌

పిల్ల‌ల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. కొన్ని గేమ్స్‌తో పాటు యాప్‌లు వీరిని టార్గెట్ చేసుకుని రూపొందిస్తున్నారు. దీంతో పిల్ల‌లు ఎక్క‌డున్నారో గుర్తించ‌డంతో పాటు వారు ఏయే యాప్‌లు ఎక్కువ వినియోగిస్తున్నారోన‌నే ఆందోళ‌న త‌ల్లిదండ్రుల్లో పెరుగుతోంది. కొన్ని యాప్‌లు లొకేష‌న్‌ను గుర్తించ‌డానికి, మ‌రికొన్నిబ్రౌజింగ్‌ యూసేజ్‌ను తెలుసుకోవ‌డానికి అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఒకే యాప్‌లో ల‌భిస్తే బాగుంటుంద‌ని త‌ల్లిదండ్రులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇలాంటి వారి కోస‌మే నాలుగు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం!

1. మైక్రోసాఫ్ట్ లాంఛ‌ర్‌(Microsoft Launcher)

పిల్ల‌ల లొకేష‌న్‌తో పాటు యాప్ యూసేజ్‌ను తెలిపేందుకు ప్ర‌స్తుతం ఉన్న యాప్స్‌లో ఇది ఉత్త‌మ‌మైనది. ఇందులో ఉన్న‌ మైక్రోసాఫ్ట్ ఫ్యామిలీ సేఫ్టీ ఫీచ‌ర్ ను ఉప‌యోగించి ఎంత మందినైనా పిల్ల‌ల‌ను యాడ్ చేసుకోవ‌చ్చు. ఈ యాప్‌ను పేరెంట్‌, చైల్డ్ ఫోన్‌లో డిఫాల్ట్ ఫోన్ లాంఛ‌ర్‌గా ఎంచుకోవాలి. అప్పుడే మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయి. 

లొకేష‌న్ క‌నుగొనేందుకు ఇలా చేయండి:
*  ముందుగా Microsoft Family పేజీలో మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి. త‌ర్వాత Add a Family Member ఆప్ష‌న్‌ని ఎంచుకోవాలి. ఇందులో పిల్ల‌ల వ‌య‌సును బ‌ట్టి Child లేదా Adult మీద క్లిక్ చేయాలి. త‌ర్వాత వారి ఈమెయిల్ ఐడీ గానీ, ఫోన్ నంబ‌ర్‌గానీ ఇవ్వాలి. త‌ర్వాత ఒక ఇన్విటేష‌న్ లింక్ మెయిల్ లేదా మొబైల్‌కి వ‌స్తుంది.
* త‌ర్వాత మైక్రోసాఫ్ట్ లాంఛ‌ర్ యాప్‌ని చిన్నారుల స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలి. ఇందులో లాగిన్ అవ్వాలి.  దీంతో ఫోన్‌లో నెట్ ఆన్ చేసినంత సేపు చిన్నారుల లొకేష‌న్‌ను సులువుగా ట్రాక్ చేసుకోవ‌చ్చు.
* మ‌ళ్లీ Microsoft Family పేజీ ఓపెన్ చేసి More Optionsపై క్లిక్ చేసి చైల్డ్ పేరు ఎంట‌ర్ చేయాలి. త‌ర్వాత Find on a Map ఆప్ష‌న్ ఎనేబుల్ చేసి See my child’s location on a map బటన్ మీద క్లిక్ చేస్తే  చైల్డ్ ఎక్క‌డున్నారో లొకేష‌న్‌తో స‌హా మ్యాప్‌లో చూడొచ్చు.

యాప్ యూసేజ్ గురించి తెలుసుకునేందుకు..
* దీని కోసం ముందుగా మీ చిన్నారి ఫోన్‌లోని Microsoft Family యాప్ ఓపెన్ చేసి Activity ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ఇందులో Activity Reporting ఎనేబుల్ చేసుకోవాలి. దీంతో పిల్ల‌ల యాప్ యూసేజ్‌తో పాటు గేమ్స్ వంటి వివ‌రాల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ రిపోర్ట్ చూపిస్తుంది. 

2. సెంట్రీ పెట‌ర్న‌ల్ కంట్రోల్‌(Sentry Parental Control)
దీని ద్వారా సుల‌భంగా చైల్డ్‌ లొకేష‌న్‌తో పాటు యాక్టివిటీని గమ‌నించ‌వ‌చ్చు. ఇందులో Sentry Parental Control, Sentry Kid అనే రెండు యాప్స్ ఉంటాయి. ఒక‌టి త‌ల్లిదండ్రుల ఫోన్‌లోనూ, మ‌రొక‌టి చైల్డ్ ఫోన్‌లోనూ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనూ ఎంత‌మంది కావాలంటే అంత‌మంది చిన్నారులను యాడ్ చేసుకోవ‌చ్చు.

ఎలా ప‌నిచేస్తుందంటే..
* ఈ యాప్‌ను ముందుగా పేరెంట్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. త‌ర్వాత దీని నుంచి చిన్నారులు ఫోన్‌కి ఇన్విటేష‌న్ పంపాలి. దీని నుంచి మాత్ర‌మే Sentry Kid యాప్‌ని చైల్డ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయ‌గ‌లం. త‌ర్వాత Sentry Kid యాప్‌కి యాప్ యూసేజ్ ట్రాకింగ్‌, ఇత‌ర ప‌ర్మిష‌న్లు ఇవ్వాలి. ఇవ‌న్నీపూర్త‌య్యాక‌ Done ఆప్ష‌న్ మీద క్లిక్ చేస్తే చైల్డ్ ఫోన్‌లో యాప్
యాక్టివేట్ అవుతుంది.
* చైల్డ్ ఫోన్‌ని ఇక నుంచి ట్రాక్ చేసేయ‌చ్చు. ఇప్పుడు మ‌ళ్లీ Sentry Parental Control యాప్ ఓపెన్ చేసి చైల్డ్ పేరు ఎంచుకోగానే.. మ‌రో పేజ్‌లో చైల్డ్ ఎక్కడ ఉన్నారో మ‌రో స్క్రీన్‌పై మ్యాప్ క‌నిపిస్తుంది.

యాప్ యూసేజ్ తెలుసుకునేందుకు..
* చైల్డ్ ఫోన్లోని యాప్ ఓపెన్ చేసి Apps Usage ఆప్ష‌న్ ఎంచుకోవాలి. దీనిని ఎనేబుల్ చేసుకుంటే.. ఒక రోజులో ఏఏ యాప్స్.. ఎంత స‌మ‌యం వాటిని ఉప‌యోగించారో వివ‌రాల‌న్నీ తెలుస్తాయి.

3. పేరెంట‌ల్ కంట్రోల్ సెక్యూర్‌కిడ్స్‌(Parental Control SecureKids)
ఈ యాప్‌ని కూడా పేరెంట్‌ ఫోన్‌తో పాటు చైల్డ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పైన చెప్పిన రెండు యాప్‌ల‌లో ఎంత‌మంది పిల్ల‌లనైనా యాడ్ చేసుకుని వారి యాక్టివిటీల‌ను గ‌మ‌నించే అవకాశం ఉంది. కానీ పేరెంట‌ల్ కంట్రోల్ సెక్యూర్ కిడ్స్‌ యాప్ పెయిడ్ వెర్ష‌న్‌లో ఐదుగురిని మాత్ర‌మే యాడ్ చేయ‌గ‌లం. ఫ్రీ ప్లాన్‌లో మాత్రం ఒక్క‌రినే యాడ్ చేసుకోవ‌చ్చు. 

చైల్డ్ లొకేష‌న్ తెలుసుకునేందుకు..
* ముందుగా మ‌న ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసి.. Who use this device అనే ఆప్ష‌న్‌ని ఎంచుకోవాలి. అందులో Parent సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాక చైల్డ్ కోసం My Children అనే ఆప్ష‌న్ క్లిక్ చేసి వారికి ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. త‌ర్వాత Create a New Child ఆప్ష‌న్ మీద క్లిక్ చేసి చైల్డ్ పేరు, పుట్టిన తేదీ, వంటి వివ‌రాలు న‌మోదు చేయాలి. 
* త‌ర్వాత చైల్డ్ ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. యాప్ ఓపెన్ చేసి Who use this device ఆప్ష‌న్ ద‌గ్గ‌ర Child  ఎంచు కోవాలి. త‌ర్వాత అందులోకి లాగిన్ అవ్వాలి. త‌ర్వాత యాక్సెస్ లొకేష‌న్‌, యాప్ యూసేజ్ వంటి ఆప్ష‌న్ల‌ను ఎనేబుల్ చేసుకోవాలి. 
* మ‌ళ్లీ పేరెంట్ ఫోన్‌లోని చైల్డ్ నేమ్‌ని సెలెక్ట్ చేసుకుని Geolocation ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ఇక నుంచి పిల్ల‌ల లొకేష‌న్‌ను మ్యాప్ ద్వారా చూడొచ్చు! 

యాప్ యూసేజ్ కోసం..
* ఇందులో యాప్‌లోని Statistics ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ఇందులో ర‌క‌ర‌కాల ఆప్ష‌న్లు ఉంటాయి. గ‌త 24 గంట‌ల్లో, వారం 
రోజులు, నెల‌రోజుల‌కు సంబంధించిన వివ‌రాలు అందులో ఉంటాయి. ఇందులో చివ‌రిగా Most Used Applicationsను సెలెక్ట్ చేసుకోవాలి. 
* త‌ర్వాత  గ‌త 24 గంట‌ల్లో చైల్డ్ ఏఏ యాప్స్ ఎంతెంత టైమ్‌ యూజ్ చేశారు, ఏఏ గేమ్స్ ఎంత సేపు ఆడారు  వంటి వివరాల‌న్నీ క‌నిపిస్తాయి.

4. టైటిల్ పేరెంట‌ల్ కంట్రోల్‌(Tittle Parental Control)
ఈ యాప్ ఫ్రీ వెర్ష‌న్లో ఒక చైల్డ్‌ని మాత్ర‌మే యాడ్ చేయ‌గ‌లం. అంతేగాక రోజుకి మూడు సార్లు మాత్ర‌మే లొకేష‌న్‌ను తెలుసుకోగ‌లం. ఇక యాప్‌లో జియో ఫెన్సింగ్‌, టాస్క్ షెడ్యూలింగ్ వంటి అద‌న‌పు ఫీచ‌ర్లు కూడా ఉంటాయి. 
లొకేష‌న్ ఎలా తెలుసుకోవాలంటే.. 
* ముందుగా పేరెంట్ ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి Who will be using this app అనే ఆప్ష‌న్‌లో Parentను సెలెక్ట్ చేసుకోవాలి. త‌ర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకుని.. లాగిన్ అయి Child ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. త‌ర్వాత చైల్డ్ పేరు న‌మోదు చేశాక QR code and text code జ‌న‌రేట్ అవుతాయి. 
* ఈ యాప్‌ను చైల్డ్ ఫోన్‌లో ఓపెన్ చేసి Who will be using this app ఆప్ష‌న్‌లో Child సెల‌క్ట్ చేసుకోవాలి. త‌ర్వాత యాప్ యూసేజ్‌, లొకేష‌న్‌, యాక్సెసిబిలిటీ వంటి అనుమ‌తులు ఇవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక‌.. మొద‌ట పేరెంట్ ఫోన్లో వ‌చ్చిన‌ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినా లేక కోడ్‌ను ఎంట‌ర్ చేసినా.. ఈ రెండు ఫోన్లు కనెక్ట్ అవుతాయి. 
* లొకేషన్‌ గుర్తించేందుకు చైల్డ్ ఫోన్‌లోని Location ఆప్ష‌న్‌ని ఎనేబుల్ చేసుకుంటే స‌రిపోతుంది. 
యాప్ యూసేజ్ కోసం..
* చైల్డ్ ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి..పేరు సెలెక్ట్ చేసుకుని App Usage ఆప్ష‌న్ ఎంచుకోవాలి. 
* ఈరోజు ఏఏ యాప్స్ యాక్సెస్ చేశారో గ్రాఫ్ రూపంలో రిపోర్ట్ వ‌చ్చేస్తుంది. దీనిని ఈమెయిల్ చేసుకునే స‌దుపాయం కూడా ఉంది. 

 

జన రంజకమైన వార్తలు