• తాజా వార్తలు

బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్‌వ‌ర్క్‌ల‌కు పోర్ట్ అవ్వ‌డానికి అతి తేలికైన గైడ్‌

పోర్ట్‌.. ఈ ప‌దం విని చాల‌కాల‌మే అయింది. ప్ర‌స్తుతం ఉప‌యోగిస్తున్న నంబ‌ర్ మారకుండా ఒక మొబైల్ సంస్థ నుంచి మ‌రో సంస్థ‌కి మార‌డానికి పోర్ట్ ఉప‌యోగించేవారు. అయితే ప్ర‌స్తుతం ఒక సంస్థ‌తో మ‌రో సంస్థ పోటీప‌డుతూ.. ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూ ఎవ‌రూ త‌మ చేజారిపోకుండా చూసుకుంటున్నాయి టెలీకాం సంస్థ‌లు. అయితే ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా ఇప్పుడు ప్రైవేట్ సంస్థ‌ల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ ఇత‌ర సంస్థ‌ల‌కు పోటీ మాత్రం ఇవ్వ‌లేక రేసులో వెనుక‌బ‌డిపోయింది. అంతేగాక ఉచిత జీబీ, ఇత‌ర ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుండ‌టంతో ఇత‌ర సంస్థ‌ల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. చాలా మంది దాని నుంచి బ‌య‌టికి వ‌చ్చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మ‌రి బీఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్‌టెల్‌, ఐడియా, రిల‌య‌న్స్‌, జియో వంటి వాటిలోకి ఏ విధంగా మారాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోస‌మే ఈ సింపుల్ గైడ్‌! 

* ముందుగా మెసేజెస్ ఓపెన్ చేసి.. అందులో PORT అని పెద్ద అక్ష‌రాల్లో రాయాలి. త‌ర్వాత స్పేస్ ఇచ్చి మొబైల్ నెంబ‌ర్ టైప్ చేయాలి. దీనిని 1900 నంబ‌రుకు పంపాలి. (PORT<space> Mobile number” To 1900)
* ఇలా పంపిన కొద్ది సేప‌టికి.. బీఎస్ఎన్ఎల్ నంబ‌రుకు ఒక మెసేజ్ వ‌స్తుంది. ఇందులో యునీక్ పోర్టింగ్ కోడ్‌(యూపీసీ) ఉంటుంది. 
* ఈ కోడ్‌ని జాగ్ర‌త్త‌గా గుర్తుపెట్టుకోవాలి. వేరే టెలీకాం ప్రొవైడ‌ర్‌కు మారే స‌మ‌యంలో.. ద‌ర‌ఖాస్తు ఫారంపై ఈ నంబ‌రు రాయాలి.  
* ఏ నెట్‌వ‌ర్క్‌లోకి మారాల‌నుకుంటున్నారో.. ఆ నెట్‌వ‌ర్క్ ఆప‌రేట‌ర్ స్టోర్‌కి వెళ్లి.. వివ‌రాలు అంద‌జేయాలి. 
* ఇందుకోసం ద‌ర‌ఖాస్తు ఫారాన్ని నింపాలి. త‌ర్వాత గుర్తింపు కార్డు జిరాక్స్‌తోపాటు ఫొటోను ఇవ్వాలి. 
* స‌ర్వీస్ చార్జి తీసుకున్నాక‌.. ఒక సిమ్‌ను అంద‌జేస్తారు. 
* ఒక వారం రోజుల్లో పాత సిమ్ సిగ్న‌ల్ నిలిచిపోయిన త‌ర్వాత‌.. కొత్త సిమ్ కార్డుని ఫోన్‌లో వేయాలి. 
* త‌ర్వాత 59059 నంబ‌ర్‌కి ఫోన్ చేసి వివ‌రాలు చెప్పాల్సి ఉంటుంది. దీంతో కొత్త సిమ్ కార్డు యాక్టివేట్ అవుతుంది.

 

జన రంజకమైన వార్తలు