మీరు వాట్సప్‌లో ఉన్నప్పుడు కాని అలాగే మీ పర్సనల్ మెయిల్స్‌లో కాని , ఫేస్‌బుక్‌లో కాని కొన్ని రకాల లింకులు మీకు వస్తూ ఉంటాయి. అవేంటో తెలియకపోయినా అవి రాగానే వాటి మీద క్లిక్ చేస్తుంటాం. అలాంటి సమయంలోనే మన అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతుంటాయి. మరి వీటిని తెలుసుకోవడమెలా అనేది చాలామందికి తెలియకపోవచ్చు. వాటి మీద క్లిక్ చేసి ఆ తర్వాత అకౌంట్ హ్యాక్ అయిందని తెగ బాధపడుతుంటారు. అలాంటి వాటిని ఎలా తెలుసుకోవాలో కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. వాటిని పాటిస్తే మీ అకౌంట్లు రక్షణలో ఉంటాయి.
మెదట ఆ లింకును రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అని ప్రెస్ చేసి లింకును కాపీ చేసుకోండి. దాదాపు అన్ని వైరస్ లింకులు ఆంటీవైరస్ ప్రోగ్రాములతో గుర్తించబడకుండా ఉండేందుకు పొట్టి లింకులుగా మార్చబడు ఉంటాయి. (tinyurl, mcaf.ee google url shorten వంటి సర్వీసులను ఉపయోగిస్తారు)
కాబట్టి వీటి నిజమైన లింకులను పొందేందుకు ఆ లింకును http://urlxray.com/ అనే సైట్లో ఎంటర్ చేసి X-Ray అని ప్రెస్ చెయ్యండి.
అప్పుడు అది చూపించిన లింకును కాపీ చేసుకుని దాన్ని http://www.urlvoid.com/ లోని సెర్చ్ బాక్సులో వేసి scan చేస్తే ఆ లింకు సురక్షితమా కాదా అని రిపోర్టు వస్తుంది..
ఈ విషయాలను ఫాలో అయి మీరు మీ అకౌంట్లను రక్షించుకోండి. లేకుంటే హ్యాకింగ్ చేసిన వాళ్లు మీకు అసభ్యమైన వీడియోలను అలాగే డేంజరస్ వైరస్ లను పంపిచేందుకు అవకాశం ఉంటుంది.