రూ.10వేలలోపు స్మార్ట్‌ఫోన్ అయితే వెంటనే డబ్బులు చెల్లించి కొనేస్తాం. కానీ అంతకు మించి ఉంటే మాత్రం కొద్దిగా బడ్జెట్ గురించి ఆలోచిస్తాం! మరి ఐఫోన్, వన్ ప్లస్ వంటి అత్యధిక ధర ఉన్న మొబైల్స్‌ను ఒకేసారి డబ్బు చెల్లించి కొనడం కంటే.. నెలవారీ చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. వీరిని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ఇప్పుడు నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిని ఆఫర్ చేస్తున్నాయి. అంతేగాక క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు కూడా ప్రకటించేస్తున్నాయి. ఈఎంఐ అమౌంట్ ఆధారంగా 24 నెలల వరకూ వీటిని చెల్లించే అవకాశం ఉంది. ఇప్పటికీ కొంతమంది ఈ ఈఎంఐలో ఫోన్ ఎలా కొనాలనే అంశంపై సరైన అవగాహన ఉండటం లేదు. ఇలాంటి వారి కోసమే ఈ గైడ్!
ఏమేం కావాలి
* క్రెడిట్ కార్డు ఉండాలంటే కచ్చితంగా క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. మనకు సొంతంగా లేకపోతే ఫ్రెండ్స్, కుటుంబసభ్యులో ఎవరిదైనా పర్లేదు.
* ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విక్రయాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
* ముందుగా మీ కార్డు వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి.
* అంతేగాక ఓటీపీ వచ్చేందుకు మీ క్రెడిట్ కార్డుతో లింక్ అయిన మొబైల్ దగ్గరే ఉంచుకోండి.
ఆన్‌లైన్లో..
* ముందుగా రిటైలర్(అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఈబే) వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
* నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవాలి.
* Buy Now మీద క్లిక్ చేయాలి.
* మొబైల్ ఎక్కడికి రావాలో అడ్రస్ ఇవ్వాలి. తర్వాత Continue మీద క్లిక్ చేస్తే.. payment ఆప్షన్లు కనిపిస్తాయి.
* ఇందులో పేమెంట్ మోడ్ ఆప్షన్‌లో ఈఎంఐని ఎంచుకోవాలి.
* తర్వాత క్రెడిట్ కార్డు బ్యాంకును సెలక్ట్ చేయాలి.
* తర్వాత ఎన్ని నెలల్లో అమౌంట్ చెల్లిద్దామని అనుకుంటున్నామో.. ఎంచుకోవాలి. (3 నెలలు.. మ్యాక్సిమమ్ 24 నెలలు)
* కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి.
* తర్వాత మొబైల్ నంబరుకి వచ్చిన OTP వస్తుంది.
* ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.
ఆఫ్‌లైన్‌లో..
ఆఫ్‌లైన్ రిటైలర్ దగ్గరకు వెళ్లి.. ఫోన్‌ని సెలెక్ట్ చేసుకుని క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేయాలి. బ్యాంకు కస్టమర్‌కేర్‌తో మాట్లాడి లేదా బ్యాంకు మొబైల్ యాప్ ఉపయోగించి ఈ మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించేలా మార్చుకుంటే సరిపోతుంది.